Brahmamudi: కావ్య పద్ధతిని అసహ్యించుకుంటున్న కళ్యాణ్.. ఫంక్షన్ కి వచ్చిన స్వప్న నిజం చెప్పనుందా?

First Published Apr 25, 2023, 2:35 PM IST

Brahmamudi: స్టార్ మాలో ప్రసారమవుతున్న బ్రహ్మముడి సీరియల్ మంచి ఉత్కంఠత రేపుతూ ప్రేక్షకులకు మరింత చేరువ అవుతుంది. చేజేతులా జీవితం నాశనం చేసుకొని తిరిగి పుట్టింటికి చేరుకున్న ఒక ఆడపిల్ల కథ ఈ సీరియల్. ఇక ఈరోజు ఏప్రిల్ 25 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.
 

ఎపిసోడ్ ప్రారంభంలో మీరు మా అక్కని ఈవెంట్ కి తీసుకెళ్లి హారాన్ని కూడా ప్రజెంట్ చేశారు. మీకు పెద్ద థ్యాంక్స్ అంటుంది కావ్య. మీరు చాలా స్పీడ్ గా వెళ్తున్నారు, మీరు మాట్లాడేది అబద్ధం అని మీకే రుజువు చేయగలను అంటాడు రాహుల్. అదే నిజమని నేను రుజువు చేస్తాను అంటుంది కావ్య. ఇద్దరూ ఆల్ ద బెస్ట్ చెప్పుకుంటారు. మిస్టర్ డిఫెక్ట్ మిమ్మల్ని మోసం చేసినవాడు మీ ఇంట్లోనే ఉన్నాడు అనుకుంటుంది కావ్య. మరోవైపు మీరు చేసిన పని ఏమీ బాగోలేదు ఇలాంటి ఒప్పందం ఎందుకు చేశారు అని కావ్య ని అడుగుతాడు కళ్యాణ్. 

దాని గురించి మీకు ఎలా తెలుసు అంటుంది కావ్య. అన్నయ్య, పెద్దమ్మ మాట్లాడుకుంటుంటే విన్నాను అంటాడు కళ్యాణ్.అందరూ నేనే తప్పు చేశాను అని అనుకుంటున్నారు. నువ్వు మాత్రం ఎందుకు నాకు సపోర్ట్ చేస్తున్నావని అడుగుతుంది కావ్య. సీతని రాముడు మాత్రమే అనుమానించాడు లక్ష్మణుడు కాదు. మీది తప్పు కాదు అని నిరూపించుకోవడం కోసం నా సహాయం అవసరమైతే తప్పకుండా హెల్ప్ చేస్తాను అంటాడు కళ్యాణ్. అసలు విషయం ఏంటంటే రేపు తాతయ్య వాళ్ళ పెళ్లిరోజు గ్రాండ్ గా సెలబ్రేట్ చేద్దామని అనుకుంటున్నాము.

Latest Videos


అక్కడ ఇలా డల్ గా కాకుండా హ్యాపీగా ఉండండి అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు కళ్యాణ్. మరుసటి రోజు పొద్దున్నే సీతారామయ్య దంపతులకు పెళ్లిరోజు శుభాకాంక్షలు చెప్తారు కుటుంబ సభ్యులందరూ. మీ పెళ్లి రోజుని గ్రాండ్ గా సెలబ్రేట్ చేద్దామనుకుంటున్నాము అంటూ అందరూ సీతారామయ్య దంపతులను ఒప్పిస్తారు. కావ్య, రాజ్ చేతుల మీదుగా తతంగం అంతా చేస్తారు అంటే ఒప్పుకుంటాము అంటుంది చిట్టి. ఇష్టం లేకపోయినా తాతయ్య వాళ్ళ కోసం ఒప్పుకుంటాడు రాజ్. మరోవైపు ఫ్యామిలీ టెన్షన్స్ లో పడి రాజ్ ఆఫీస్ కి వెళ్లడం లేదు. అక్కడ వ్యవహారాలు చక్కబెట్టడానికి ఇదే కరెక్ట్ టైం అలా చేస్తే తాతయ్య వాళ్ళ ముందు నిన్ను హైలెట్ చేస్తాను అంటుంది రుద్రాణి. 

నేను కూడా అదే పనిలో ఉన్నాను అంటాడు రాహుల్. మరోవైపు డెకరేషన్ చేస్తూ గిల్లికజ్జాలు పెట్టుకుంటూ ఉంటారు రాజ్, కావ్య. ఇదంతా చూస్తున్న సీతారామయ్య దంపతులు నవ్వుకుంటారు. కావ్య సంవత్సరాలు ఎలాంటి పరిస్థితిని అయినా ధైర్యంగా ఎదుర్కొంటుంది అంటుంది చిట్టి. ఇక్కడికి వచ్చిన దగ్గరనుంచి ఆ అమ్మాయి మనకోసం చాలా చేసింది కానీ మనం మనమే తనకు ఏమీ చేయలేకపోయాము. వాళ్ల పుట్టింటి వాళ్ళని ఈ ఫంక్షన్ కి పిలువు. వాళ్ల కన్న వాళ్ళని చూసుకొని సంతోషిస్తుంది అంటాడు సీతారామయ్య.

అపర్ణకి ఇష్టం లేదు అంటుంది చిట్టి. మనం ఉన్నాం కదా చూసుకుందాంలే నువ్ వెళ్లి కావ్య పుట్టింటి వాళ్లకి ఫోన్ చేసి నేను రమ్మన్నానని చెప్పు అంటాడు సీతారామయ్య. కనకానికి ఫోన్ చేసి ఫంక్షన్ కి ఆహ్వానిస్తుంది చిట్టి. చిట్టి తో మాట్లాడిన కనకం ఆనందంతో పొంగిపోతుంది. మీరు ఫోన్ చేశారు అంటే నమ్మలేకపోతున్నాను అంటుంది కనకం. నన్నే నేరుగా వచ్చి పిలవమంటావా అంటుంది చిట్టి. అయ్యో.. వద్దండి మేము తప్పకుండా వస్తాము అని ఫోన్ పెట్టేస్తుంది చిట్టి. ఎందుకు వస్తానన్నావు వాళ్ళ సంగతి తెలుసు కదా అంటుంది అప్పు. 

లేదు ఇన్ని సమస్యల మధ్యన కూడా మనల్ని ఆహ్వానించారు అంటే వెళ్ళకపోతే మనదే తప్పు అవుతుంది అంటాడు కృష్ణమూర్తి. ఇదంతా విన్న స్వప్న వాళ్ళు వీళ్ళు కలిసి పోయేలాగా ఉన్నారు నేను కూడా వెళ్తే నన్ను కూడా క్షమిస్తారు అనుకుంటూ రాహుల్ కి విషయం చెప్తుంది. నువ్వు రాకు.. వస్తే ఇద్దరం దొరికిపోతాము అంటూ ఏదో మాట్లాడుతూ ఉండగా రుద్రాణి వచ్చి ఫోన్ లాక్కుంటుంది. నీకు బాధ్యత అనేది రాదు అక్కడ రాజు వాళ్ళు బాధ్యతగా పనిచేస్తుంటే నువ్వు ఇక్కడ అమ్మాయిలతో సోది కబుర్లు చెబుతున్నావు ఇంక లాభం లేదు నీకు ఒక కోటీశ్వరులు సంబంధం చూశాను. సాయంత్రం అదే విషయాన్ని తాతయ్య గారితో మాట్లాడతాను అంటుంది రుద్రాణి.
 

ఇదంతా ఫోన్లో విన్న స్వప్న కంగారు పడిపోతుంది. సాయంత్రం ఫంక్షన్ కి వెళ్లటమే కరెక్ట్ అనుకుంటుంది. మరోవైపు పెళ్ళికొడుకు లాగా ముస్తాబై ఉన్న సీతారామయ్యని ఆట పట్టిస్తూ ఉంటారు రాజ్ వాళ్ళు. చిట్టిని పెళ్ళికూతురుగా ముస్తాబు చేస్తుంది కావ్య. మీ తాతయ్య గారు ఏడిపిస్తారు అంటూ సిగ్గు పడిపోతుంది చిట్టి. ఫంక్షన్ కోసం కనుక వాళ్ళు బయలుదేరుతుంటే స్వప్న కూడా అందంగా రెడీ అయి బయటికి వస్తుంది. తనను చూసి కనకం వాళ్ళు షాక్ అవుతారు. దీన్ని కూడా ఫంక్షన్ పిలిచేవాళ్ళు ఉంటారని ఎలా అనుకుంటుంది అంటాడు కృష్ణమూర్తి. పొద్దున్నే దీని మొహం చూడడమే దరిద్రం అనుకుంటే అక్కడికి వస్తాను అంటూ సిగ్గు లేకుండా ఎలా తయారయిందో అంటూ చివాట్లు పెడుతుంది కనకం. 

అందరూ మీలాగా మిడిల్ క్లాస్ మెంటాలిటీతో ఉండరు. మనకి పూటకి గతిలేకపోయినా నీతులు మాత్రం బాగా చెప్తాము అంటుంది స్వప్న. చెంప పగిలేలాగా కొడుతుంది కనకం. ఇది అక్కడికి వస్తే అక్కడ నా కూతురు పరిస్థితి ఏం కావాలి? దీన్ని ఇక్కడే పడుండమను అంటాడు కృష్ణమూర్తి. స్వప్న ఇక్కడే ఉంటుంది తనకి తోడుగా నేనుంటాను మీరు వెళ్ళండి అని అప్పు వాళ్ళని పంపిస్తుంది వాళ్ళ పెద్దమ్మ. తప్పు ఇది తక్కువ ఇది కాదు సీసీ కెమెరా లాగా కాపలా కాయాలి అంటుంది అప్పు. వాళ్లు వెళ్లిపోయిన తర్వాత నీకు కాఫీ కలిపి ఇస్తాను రా అంటుంది వాళ్ళ పెద్దమ్మ.
 

నువ్వు వెళ్ళు నేను వస్తాను అని పెద్దమ్మతో చెప్పి, నేను అక్కడికి వెళ్ళాలి వెళ్లి రాహుల్ పెళ్లి సంబంధం ఆపేయాలి అనుకుంటూ అక్కడ నుంచి బయలుదేరుతుంది స్వప్న. మరోవైపు ఫంక్షన్ కి వచ్చిన కనకమ్మ వాళ్ళని చూసి నీ శత్రువులని ఇంటికి ఆహ్వానించావా వదిన అని అపర్ణని అడుగుతుంది రుద్రాణి. ఏం మాట్లాడుతున్నావ్ అంటూనే కనకం వాళ్ళని చూసి కోపంతో రగిలిపోతుంది అపర్ణ. తర్వాయి భాగంలో ఫంక్షన్ కి వచ్చిన స్వప్నని చూసి కోపంతో రగిలిపోతుంది అపర్ణ. కనకం వాళ్లు కూడా షాకవుతారు. ఎవరితో లేచిపోయావు అంటూ రుద్రాణి నిలదీస్తుంది. నిజం చెప్పేస్తుందేమో అని టెన్షన్ పడతాడు రాహుల్.

click me!