జబర్దస్త్ ద్వారా వస్తున్న లక్షల సంపాదన లీక్ చేసిన కెవ్వు కార్తీక్... ఇక సుధీర్,ఆది, గెటప్ శ్రీనులకు ఎంత?

First Published May 26, 2021, 8:15 PM IST

బుల్లితెర షోల్లో జబర్దస్త్త్ ఒక సంచలనం. దాదాపు ఎనిమిదేళ్ల క్రితం మొదలైన ఈ కామెడీ షో తిరుగులేకుండా దూసుకుపోతుంది. సామాన్యులను స్టార్స్ ని చేసిన ఈ షోలో కమెడియన్స్ కి ప్రేక్షకులలో పిచ్చ క్రేజ్ ఉంది. 
 

వీకెండ్ లో రెండు వారాలు.. గురువారం, శుక్రవారం కోసం ఎదురు చూస్తే జబర్దస్త్ అభిమానులు ఎందరో అని చెప్పాలి. ఇంట్లో మనుషులుగా మారిపోయిన జబర్దస్త్ కమెడియన్ సంపాదన ఎంత అనే విషయం తెలుసుకోవాలని అందరికీ ఉంటుంది.
undefined
ఏళ్లుగా జబర్దస్త్ వేదిక ద్వారా నవ్వులు పంచుతున్న కమెడియన్స్ లో కెవ్వు కార్తీక్ ఒకరు. సాధారణ టీమ్ మెంబర్ గా ఉన్న కార్తీక్ ఆ తరువాత టీమ్ లీడర్ అయ్యాడు. ముక్కు అవినాష్ తో పాటు కెవ్వు కార్తీక్ టీం లీడర్ గా ఉండేవారు.
undefined
బిగ్ బాస్ షో కోసం జబర్దస్త్ అవినాష్ వదిలివేయగా, కెవ్వు కార్తీక్ మాత్రమే టీమ్ లీడర్ గా మిగిలారు. ఇక తాజా ఇంటర్వ్యూలో తన కెరీర్, రెమ్యూనరేషన్స్ గురించి మాట్లాడడం జరిగింది.
undefined
మొదట్లో కేవలం రెండు వందలకు ఈవెంట్స్ లో మిమిక్రీ చేసేవారట అవినాష్. ఇంజనీరింగ్ తరువాత ఓ జాబ్ లో చేరగా, అత్తెసరు సంపాదన కుటుంబ అవసరాలకు సరిపోయేది కాదట. దానితో జాబ్ వదిలేసి ఈవెంట్స్ నిర్వహిచడం మొదలుపెట్టాడట.
undefined
ఈవెంట్స్ వలన తనకు మంచి ఆదాయమే వచ్చేదట. అయితే ఆర్టిస్ట్ కావాలని జబర్దస్త్ కి రావడం జరిగిందట కార్తీక్. టీం లీడర్ గా ఎదిగాక తన రెమ్యూనరేషన్ లక్షలకు చేరిందని కార్తీక్ తెలిపాడు.
undefined
ఐతే స్పష్టంగా ఎంత ఇస్తారు అనేది చెప్పలేదు. అయితే మనకున్న సమాచారం ప్రకారం జబర్దస్త్ కమెడియన్స్ లో చాలా మంది నెల జీతం రూపంలో రెమ్యూనరేషన్ తీసుకుంటారు. ఎపిసోడ్స్ వారీగా తీసుకొనేవారు చాలా తక్కువ.
undefined
ఇమేజ్, స్టార్డం ని బట్టి అక్కడ టీమ్ లీడర్స్ జీతాలు రూ. 2లక్షల నుండి మొదలు అవుతాయట. సుధీర్, హైపర్ ఆది, రామ్ ప్రసాద్, గెటప్ శ్రీను అధికంగా రూ. 4 లక్షల వరకు తీసుకొనే అవకాశం కలదు. కెవ్వు కార్తీక రెమ్యూనరేషన్ రూ. 2కి తగ్గకుండా ఉంటుందని వినికిడి.
undefined
ఇక తల్లిని ఎంతగానో ప్రేమించే కార్తీక్ తన సంపాదనతో లక్షలు ఖర్చుపెట్టి ఆరోగ్యం బాగుచేయించి కాపాడుకున్నాడట. ఈ విషయం ఓ కార్యక్రమంలో కార్తీక్ తల్లి స్వయంగా చెప్పారు.
undefined
click me!