Samantha: ఆ పుస్తకమే ప్రూఫ్... ఇంకా విడాకుల డిప్రెషన్ లోనే సమంత, అందుకే చైతూ పై రగిలిపోతుందా?

Published : Aug 05, 2022, 08:10 PM IST

అతి దేనికైనా అనర్థమే. సమంత చైతు ఒకరినొకరు ఘాడంగా ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకున్నారు. ఒకరి అభిప్రాయాలు మరొకరు గౌరవిస్తూ కాపురం చేశారు. 2021 అక్టోబర్ లో విడాకుల ప్రకటన చేశారు. అప్పటికే నెలరోజులుగా సమంత, నాగ చైతు విడాకులు వార్తలు చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఇది షాకింగ్ న్యూస్ అనిపించలేదు.   

PREV
16
Samantha: ఆ పుస్తకమే ప్రూఫ్... ఇంకా విడాకుల డిప్రెషన్ లోనే సమంత, అందుకే చైతూ పై రగిలిపోతుందా?
Samantha

అయితే కారణాల అన్వేషణ మొదలైంది. కొందరు చైతూ తప్పులు ఎత్తి చూపగా మరికొందరు సమంతను టార్గెట్ చేశారు. విడాకుల వ్యవహారంలో ఎక్కువగా సమంత నిందలు, విమర్శలు ఎదుర్కొన్నారు. ఆమెపై నిరాధార కథనాలు ప్రచారం చేస్తున్న కొన్ని ఛానల్స్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరిగింది.

26

ఏళ్ల తరబడి ప్రేమించుకున్న ఈ టాలీవుడ్ క్రేజీ కపుల్ నాలుగేళ్లు భార్యాభర్తలుగా ఉన్నారు. మరి ఈ ప్రయాణంలో ఒకరంటే ఒకరికి అమితమైన ప్రేమ ఏర్పడి ఉంటుంది. అది ఎడబాటు తర్వాత మానసిక వేదనకు కారణం అయ్యింది. చైతూతో విడిపోయాక సమంత ఫ్రెండ్స్ కి దగ్గరయ్యారు. సినిమాలకు విరామం ప్రకటించి ఆధ్యాత్మిక, హాలీడే టూర్స్ కి వెళ్లారు. 
 

36

ఎంత ప్రయత్నించినా ఆమె చైతూ జ్ఞాపకాల నుండి బయటపడలేకపోతున్నారేమో అనిపిస్తుంది. చైతూపై ఉన్న ప్రేమే ఆమె కోపానికి, ద్వేషానికి కూడా కారణం కావచ్చు. ఇటీవల ఇంటర్వ్యూలలో సమంత మాజీ భర్త చైతూని ఉద్దేశిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం ఆయనపై సమంత కోసం ఇంచు కూడా తగ్గలేదనిపిస్తుంది. మా ఇద్దరినీ ఒకే గదిలో ఉంచాల్సి వస్తే, పదునైన ఆయుధాలు కూడా దాచి ఉంచాలి, అన్నారు సమంత. 
 

46
Samantha

చైతూ దూరం కావడం వలన సమంత అనుభవిస్తున్న మానసిక వేదన కూడా ఆ కోపానికి కారణం కావచ్చు. విడాకులు తీసుకుని పది నెలలు అవుతున్నా సమంత డిప్రెషన్ నుండి బయటపడలేదని కొందరు అభిప్రాయపడుతున్నారు. దానికి రుజువుగా తాజా సంఘటన చూపిస్తున్నారు. ముంబై ఎయిర్ పోర్ట్ లో సమంత చేతిలో యు కెన్ హీల్ యువర్ లైఫ్ అనే బుక్ తో కనిపించారు.

56
Samantha Snapped at airport


ప్రముఖ రచయిత లూయిస్ హే రాసిన ఆ బుక్ మానసిక ప్రశాంత సాధించడం, మనసుకు శరీరానికి అనుసంధానం చేయడం, భావోద్వేగాలపై అదుపు వంటి విషయాల గురించి రాసింది. మానసిక సమస్యలతో ఇబ్బందిపడుతున్న సమంత దానిని నుండి బయటపడడం కోసం యు కెన్ హీల్ యువర్ లైఫ్ బుక్ చదువుతున్నారని అంచనా వేస్తున్నారు. అయితే ఇది కేవలం ఊహ మాత్రమే.
 

66

 
స్టార్ గా టాలీవుడ్ లో హైట్స్ చూసిన సమంత ఫోకస్ బాలీవుడ్ కి మళ్లింది. అక్కడ ఓ ఖరీదైన ఇంటిని కొన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆమె వరుసగా రెండు బాలీవుడ్ చిత్రాలు ప్రకటించారు. తెలుగులో శాకుంతలం, ఖుషి, యశోద వంటి క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. ఇవన్నీ పాన్ ఇండియా స్థాయిలో ఐదు భాషల్లో విడుదల కానున్నాయి. 

Read more Photos on
click me!

Recommended Stories