మళ్ళీ ఒంటరిగా మారిన ఇలియానా, భర్త కొడుకు వేరుగా.. డిప్రెషన్ లోకి వెళ్ళా, షాకింగ్ కామెంట్స్  

First Published Jan 5, 2024, 9:55 AM IST

తనకు కొడుకు పుట్టాక ఎదురైన చేదు అనుభవాల గురించి ఇలియానా ఎమోషనల్ కామెంట్స్ చేసింది. బిడ్డ పుట్టాక ఇలియానా ఒంటరిగా ఉండాల్సి వచ్చిందట.

గోవా భామ ఇలియానా పోకిరి చిత్రంతో టాలీవుడ్ లో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయింది. నాజూకు నడుము ఒంపులతో ఇలియానా యువత హృదయాల్లో కొలువైపోయింది. ఒకప్పుడు సౌత్ లో యువతకు కలల రాణిగా వెలుగు వెలిగింది ఇలియానా. టాలీవుడ్ లో కెరీర్ దూసుకుపోతున్న టైంలో ఇలియానా తీసుకున్న నిర్ణయాలే కెరీర్ ముగిసేలా చేశాయి. 

బాలీవుడ్ ని దున్నేయాలని బయలుదేరడంతో చుక్కెదురు తప్పలేదు. దీనితో కెరీర్ ట్రాక్ తప్పింది. లవ్ ఎఫైర్, బ్రేకప్ లాంటి వ్యవహారాలు ఇలియానాని కుంగదీశాయి. బాడీ అవుట్ ఆఫ్ షేప్ గా కూడా మారింది.  గత ఏడాది ఇలియానా పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చి అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తింది. పెళ్లి కాలేదు అప్పుడే గర్భం, పిల్లలు ఏంటి అంటూ అంతా షాక్ అయ్యారు.   

Latest Videos


చాలా రోజుల పాటు తన బిడ్డకు తండ్రి ఎవరనే విషయాన్ని కూడా ఇలియానా దాచిపెట్టింది. అయితే ఇటీవల అతడి ఫోటో షేర్ చేయడంలో ఇలియానా లైఫ్ పార్ట్నర్ డీటెయిల్స్ బయటకి వచ్చాయి. అతడి పేరు మైఖేల్ డోలాన్ అని తెలుస్తోంది. ఇలియానా తన భర్త గురించి విషయాలని గోప్యంగా ఉంచుతోంది. ఫోటో అయితే బయట పెట్టింది కానీ ఎలాంటి వివరాలు పేర్కొనలేదు. 

అయితే తనకు కొడుకు పుట్టాక ఎదురైన చేదు అనుభవాల గురించి ఇలియానా ఎమోషనల్ కామెంట్స్ చేసింది. బిడ్డ పుట్టాక ఇలియానా ఒంటరిగా ఉండాల్సి వచ్చిందట. దానికి గల కారణాలు చెప్పలేదు. బహుశా ఆరోగ్య సమస్యలు అయి ఉండొచ్చు. కొంతకాలం పాటు తాను వేరే గదిలో పాడుకోవాల్సి వచ్చింది అని ఇలియానా తెలిపింది. 

తన కొడుకుని డాక్టర్లు కొంతకాలం బాగా చూసుకున్నారు. ఆ తర్వాత నా భర్తే నాకు తోడయ్యాడు. నేను వేరే గదిలో ఒంటరిగా ఉంటూ డిప్రెషన్ లోకి వెళ్ళా. రోజూ ఏడ్చేదాన్ని. ఆ సమయంలో మైఖేల్ డోలాన్ నాకు ధైర్యం ఇచ్చారు. తన కొడుకు, డోలాన్ ఒక గదిలో ఉన్నారు. కొడుకు బాధ్యతలు మొత్తం నా భర్తే చూసుకున్నాడు. నేను మాత్రం వేరే గదిలో ఉండిపోవాల్సి వచ్చింది. 

ప్రశాంతంగా నన్ను రెస్ట్ తీసుకోమని చెప్పి బాబుని బాగా చూసుకున్నాడు. ఇంత మంచి భర్త నాకు దొరకడం నిజంగా అదృష్టం అంటూ ఇలియానా ఎమోషనల్ కామెంట్స్ చేసింది. తన భర్తని ప్రశంసలతో ముంచేస్తోంది కానీ.. అతడు ఎవరు.. పరిచయం, ప్రేమ పెళ్లి ఎలా జరిగాయి లాంటి విషయాలలో ఇలియానా ప్రైవసీ పాటిస్తోంది. 

గతంలో ఒక ఆస్ట్రేలియన్ ఫోటోగ్రాఫర్ తో ప్రేమ వ్యవహారం బెడిసికొట్టడం వల్ల ఇలియానా అప్పట్లో ఒంటరిగా వేదన అనుభవించింది. డిప్రెషన్ లోకి వెళ్ళింది. మరోసారి ఇప్పుడు డిప్రెషన్ లోకి వెళ్లినట్లు చెప్పింది. అయితే ఈసారి ఆమెకి తన భర్త తోడు ఉన్నాడు. 

click me!