గోవా భామ ఇలియానా పోకిరి చిత్రంతో టాలీవుడ్ లో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయింది. నాజూకు నడుము ఒంపులతో ఇలియానా యువత హృదయాల్లో కొలువైపోయింది. ఒకప్పుడు సౌత్ లో యువతకు కలల రాణిగా వెలుగు వెలిగింది ఇలియానా. టాలీవుడ్ లో కెరీర్ దూసుకుపోతున్న టైంలో ఇలియానా తీసుకున్న నిర్ణయాలే కెరీర్ కు శాపంలా మారాయి.
బాలీవుడ్ ని దున్నేయాలని బయలుదేరడంతో చుక్కెదురు తప్పలేదు. దీనితో కెరీర్ ట్రాక్ తప్పింది. హీరోయిన్ గా అవకాశాలు తగ్గాయి. లవ్ ఎఫైర్, బ్రేకప్ లాంటి వ్యవహారాలు ఇలియానాని కుంగదీశాయి.
ప్రస్తుతం ఇలియానా అవకాశాల కోసం ప్రయత్నిస్తోంది. ఖాళీ సమయంలో గోవా లాంటి ప్రదేశాల్లో వెకేషన్స్ లో ఎంజాయ్ చేస్తోంది. అలాగే అవకాశం చిక్కినప్పుడు సినిమాల్లో నటిస్తోంది.
ఇలియానా అందాలకు ఎప్పుడూ కుర్రాళ్ళ హృదయాలు గల్లంతవుతూనే ఉంటాయి. ఇలియానా లేటెస్ట్ అందాలు చూస్తే మైండ్ బ్లాక్ కావలసిందే. ఇలినా మునుపటిలా నాజూకుగా మారిపోయింది.తన ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తున్న పిక్స్ ని ఇంస్టాగ్రామ్ షేర్ చేసింది.
ఎల్లో డ్రెస్ లో తొంగి చూస్తున్న ఎద పరువాలు చూపిస్తూ ఇలియానా ఏంజిల్ గా ఫోజులు ఇచ్చింది. ఇటీవల ఇలియానా గజాబ్ మ్యూజిక్ వీడియోలో నటించింది. ఆ సాంగ్ ప్రమోషన్ లో భాగంగా ఇలియానా .
ఇలియానా ప్రస్తుతం కత్రినా కైఫ్ సోదరుడితో డేటింగ్ లో ఉన్నట్లువార్తలు వస్తున్నాయి. ఇటీవల వీరిద్దరూ వెకేషన్ లో కూడా కనిపించారు. ఇలియానా విషయంలో ఈ లవ్ స్టోరీ అయినా పెళ్లి వరకు వెళుతుందో లేదో చూడాలి. ప్రస్తుతం ఇలియానా వయసు 35 ఏళ్ళు.
గతంలో బ్రేకప్ తర్వాత డిప్రెషన్ కు గురయ్యానని చెప్పిన ఇలియానా.. కోలుకోవడానికి చాలా టైం పట్టినట్లు కూడా తెలిపింది. తన లవ్ బ్రేకప్ గురించి ఇలియానా తరచుగా ఇంటర్వ్యూలలో మాట్లాడుతూ ఉంటుంది.
ఆస్ట్రేలియన్ ఫోటో గ్రాఫర్ తో ఇలియానా కొంతకాలం డేటింగ్ చేసి విడిపోయింది. బ్రేకప్ తర్వాత ఇలియానా హెల్త్ గురించి అనేక రూమర్స్ వినిపించాయి.
మానసిక ఒత్తిడి, ఆందోళన కలిగి ఉండడం నిజంగా భయాన్ని కలిగించే అంశం. ఆ సమయంలో ఎవరినీ దగ్గరకు రానీయరు. ద్వేషించడం మొదలుపెడతారు. అసలు ఎందుకు అలా ఉన్నారో మీకే అర్థం కాదు. ఈ అంశాలు బతికుండగానే మిమ్మల్ని తినేస్తాయి అంటూ ఇలియానా ఇటీవల ఎమోషనల్ కామెంట్స్ చేసింది.
దేవదాసు చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైన ఇలియానా.. పోకిరితో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిన సంగతి తెలిసిందే. తెలుగులో ఇలియానా మహేష్, పవన్, ప్రభాస్, బన్నీ, ఎన్టీఆర్ లాంటి స్టార్స్ తో సినిమాలు చేసింది.