ఓవర్ ఆల్ గా ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా వసూలు చేసిన గ్రాస్ 18 కోట్లు మాత్రమే. ఇక శాటిలైట్. డిజిటల్ రైట్స్ ఏమైనా వెలిగిపోయాయా అంటే.. అది కూడా లేదు. ఇంత వరకూ ఏ సంస్థ ఈ సినిమా హక్కులు తీసుకోలేదు. రజినీకాంత్ సినిమా అంటే ఎంత డిమాండ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అటువంటిది ఏ ఓటీటీ సంస్థ ఈ సినిమా హక్కులను తీసుకోలేదంటే అర్ధం చేసుకోవచ్చు.
వందల కోట్ల టేబుల్ ప్రాఫిట్ రావల్సిన రజినీకాంత్ సినిమా.. హాట్ కేకుల్లా రైట్స్ అమ్ముడు పోవల్సిన తలైవా మూవీకి ఇలాంటి పరిస్థితి రావడం నిజంగా ఆశ్చర్యం అనే అనాలి. ఏమాత్రం హైప్ లేకపోవడంతో ఎవరు ఈసినిమాను కొనడానకి ముందు రావడంలేదట. ఇక ఇదే పరిస్థితితి తెలుగులో అక్కినేని అఖిల్ నటించిన ఏజెంట్ సినిమాకు కూడా ఉంది.