Lifestyle
బొద్దింకలు ఇంట్లో లేకుండా చేయడానికి చాలా మంది మార్కెట్ లో దొరికే కెమికల్స్ ను వాడుతుంటారు. కానీ రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో ఉండే వాటితోనే ఈ పనిచేయొచ్చు.
అవును ఆరెంజ్ తొక్కతో ఇంట్లో ఒక్క బొద్దింక లేకుండా చేయొచ్చు. ఎందుకంటే ఆరెంజ్ తొక్కలో లిమోనీన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది బొద్దింకలు ఇంట్లో లేకుండా చేస్తుంది.
ఆరెంజ్ తొక్కలతో బొద్దింకలను తరిమికొట్టాలంటే.. ఈ తొక్కలను బొద్దింకలు వచ్చే ప్రదేశాల్లో ఉంచండి. అటుపక్క ఒక్క బొద్దింక కూడా రాదు.
ఆరెంజ్ తొక్కలతో బొద్దింకలను ఇంట్లోకి రాకుండా చేయడమే కాదు.. దీన్ని గిన్నెలు తోమడానికి కూడా ఉపయోగించొచ్చు. దీనికి గిన్నెలు తోమితే గిన్నెలు తలతలా మెరిసిపోతాయి.
అలాగే మైక్రోవేవ్ ను కూడా ఆరెంజ్ తొక్కతో క్లీన్ చేయొచ్చు. ఇందుకోసం ఒక గిన్నెలో కొన్ని తొక్కలు, నీళ్లు పోసి వేడి చేయండి. దీనివల్ల మైక్రోవేవ్ నుంచి వాసన రాదు.
ఆరెంజ్ తొక్క వాటర్ మన ఇమ్యూనిటీ పవర్ ను పెంచడానికి బాగా సహాయపడుతుంది. ఇందుకోసం ఆరెంజ్ తొక్కలను నీటిలో మరిగించి తాగాలి.