School Holiday : ఫెంగల్ తుఫాను భీభత్సం ... ఏపీలో విద్యాసంస్థలకు సెలవులు

First Published | Dec 2, 2024, 10:13 AM IST

ఫెంగల్ తుఫాను ప్రభావంతో భారీ నుండి అతిభారీ వర్షాలు కురుస్తుండటంతో ఆంధ్ర ప్రదేశ్ లో ఇవాళ విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు.

School Holidays

School Holidays : బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగల్ తుఫాను దక్షిణాది రాష్ట్రాల్లో భీభత్సం సృష్టిస్తోంది. ఈ తుఫాను ప్రభావంతో ఇప్పటికే ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పుడు తెలంగాణ, కర్ణాటక, కేరళలో కూడా వర్షాలు మొదలయ్యాయి. ఈ వర్షాలకు తోడు చలి తీవ్రకు కూడా బాగా పెరిగింది. దీంతో భారీ వర్షాలు కురుస్తున్న ప్రాంతాలతో పాటు వర్షాలు కురిసే అవకాశం వుందని ఐఎండి హెచ్చరించిన ప్రాంతాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించారు. 

 ఇలా ఆంధ్ర ప్రదేశ్ లో పలు జిల్లాల్లో భారీ వర్షాల నేపథ్యంలో సెలవులు ప్రకటించారు. వర్షాలు కురుస్తున్న మిగతా జిల్లాల్లో కూడా పిల్లల తల్లిదండ్రులు సెలవును డిమాండ్ చేస్తున్నారు. వర్ష తీవ్రతను బట్టి ఆయా జిల్లాల్లో విద్యసంస్థలకు సెలవులపై కలెక్టర్లు, విద్యాశాఖ అధికారులు నిర్ణయం తీసుకోనున్నాయి. ఇప్పటికయితే రెండు జిల్లాల్లో సెలవులు ప్రకటించారు. 
 

School Holidays

చిత్తూరు జిల్లాలో సెలవులు : 

బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగల్ తుఫాను తీరం దాటింది. గత శనివారం రాత్రి పుదుచ్చెరి సమీపంలో తీరం దాటినా దాని ప్రభావం దక్షిణాది రాష్ట్రాలపై ఇంకా కొనసాగుతోంది. ముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్ లోని రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతాల్లో భారీ నుండి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. ఒక్కసారిగా కుండపోత వర్షం కురుస్తుండటంతో ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం వుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.

ఇవాళ(సోమవారం) కూడా ఏపీలో భారీ వర్షాలు  కొనసాగుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో ముందుగానే అప్రమత్తమైన పలు జిల్లాల కలెక్టర్లు స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. ఇలా చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో ఇవాళ ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు మూతపడ్డాయి. 

చిత్తూరులో ఇప్పటికే భారీ వర్షాలు కురిసి పరిస్థితి ప్రమాదకరంగా మారింది. దీంతో వాగులు వంకలు వరదనీటితో ఉదృతంగా ప్రవహిస్తున్నాయి...చెరువులు, జలాశయాలు నిండుకుండల్లా మారాయి. ఇవాళ కూడా భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం వుండటంతో ఎలాంటి ప్రమాద జరక్కుండా విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ నిర్ణయం తీసుకున్నాయి. 


School Holidays

అన్నమయ్య జిల్లాలో సెలవులు 

ఇక అన్నమయ్య జిల్లాలోనూ ఇదే పరిస్థితి వుంది. భారీ వర్షాలతో ఇప్పటికే జిల్లా ప్రజలు అతలాకుతలం అవుతున్నాయి. ఈ వర్షాలు ఇవాళ కూడా కొనసాగుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో విద్యాశాఖ అధికారులతో చర్చించి స్కూళ్లు, కాలేజీలకు ఇవాళ(సోమవారం) సెలవు ప్రకటించారు జిల్లా కలెక్టర్ శ్రీధర్. యోగి వేమన యూనివర్సిటీ పరిధిలో ఇవాళ జరగాల్సిన డిగ్రీ పరీక్షలు వాయిదా పడ్డాయి. 

ఇక వైఎస్సార్ కడప, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో కూడా సోమవారం భారీ వర్షాలు కురుసే అవకాశం వుందని వాతావరణ శాఖ ప్రకటించింది. కాబట్టి చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో మాదిరిగానే ఈ జిల్లాల విద్యాసంస్థలకు సెలవు ప్రకటించాలని కోరుతున్నాయి. అయితే ఇప్పటివరకు ఆయా జిల్లాల విద్యాశాఖ నుండిగాని, జిల్లా కలెక్టర్ల నుండిగానీ సెలవులపై ప్రకటన రాలేదు... కాబట్టి ఆ జిల్లాల్లో సెలవులు లేనట్లే. 

ఇప్పటివరకు చిత్తూరు జిల్లా పుత్తూరులో అత్యధికంగా 187 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదయ్యింది. ఇక మనుబోలు 154మి.మీ, రాచపాలెం 152 మి.మీ, సూళ్లూరుపేట 118 మి.మీ, బీమునివానిపాలెం 137 మి.మీ,, నెల్లూరు జిల్లా మునుబోలు 133 మి.మీ, పూలతోట 124 మి.మీ, నగరి 120 మి.మీ వర్షపాతం నమోదయ్యింది. ఈ వర్షాల కారణంగా భారీగా పంటనష్టం జరిగింది. 
 

school holiday

కర్ణాటకలోనూ సెలవులు : 

ఫెంగల్ తుఫాను కర్ణాటకను వణికిస్తోంది. రాజధాని బెంగళూరుతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిన్న (ఆదివారం) నగరంలో చెదురుమదురు జల్లులు కురిసినా ఇవాళ(సోమవారం) భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం వుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఎల్లో అలర్ట్ ప్రకటించిన వాతావరణ నగర ప్రజలు అప్రమత్తంగా వుండాలని సూచించారు. భారీ వర్షసూచన నేపథ్యంలో బెంగళూరులోని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించాలని పేరెంట్స్ కోరుతున్నారు.  

అయితే ఇప్పటికే కర్ణాటకలోని పలు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని ఐఎండి హెచ్చరించిన మాండ్య, మైసూరు, కొలార్, చామరాజనగర్, చిక్కబళ్లపూర్ జిల్లాల్లో ఇవాళ విద్యాసంస్థలకు సెలవు ఇచ్చారు. మరో రెండురోజులు (డిసెంబర్ 3,4) కూడా కర్ణాటకలో వర్షాలు కురిసే అవకాశం వుందని ఐఎండి ప్రకటించింది... ఈ నేపథ్యంలో వర్షతీవ్రత ఎక్కువగా వుండే జిల్లాల్లో మరిన్ని సెలువులు వుండనున్నాయి. 

ఈ వర్షాల నేపథ్యంలో చలి తీవ్రత కూడా పెరిగింది. బెంగళూరులో ఆదివారం గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సాధారణంగా డిసెంబర్‌లో బెంగళూరులో గరిష్ట ఉష్ణోగ్రత 26.5 డిగ్రీల సెల్సియస్ గా వుంటుంది. కానీ ఆదివారం 22.4 గా వుంది... కనిష్ట ఉష్ణోగ్రత 19.5గా నమోదైంది. బెంగళూరు విమానాశ్రయం వద్ద అయితే గరిష్టంగా 22.9 డిగ్రీలు, కనిష్టంగా 19.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. 
 

Telangana Rains

తెలంగాణలో వర్షాలు : 

ఫెంగల్ తుఫాను ప్రభావం తెలంగాణపై పడింది. గత రెండ్రోజులుగా ఆకాశం మేఘావృతంగా వుండటంతో పాటు పలు జిల్లాల్లో జల్లులు కురుస్తున్నాయి. రాజధాని హైదరాబాద్ లో ఆదివారం రాత్రి చిరుజల్లులు కురిసాయి...  దీంతో చలి తీవ్రత మరింత పెరిగి నగరవాసులను వణికించింది. 

ఇప్పటికే మహబూబ్ నగర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట, హన్మకొండ, వరంగల్, జనగామ జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం వుండటంతో ఈ జిల్లాల్లో ఎల్లో అలర్ట్ ప్రకటించారు. 

ఈ తుఫాను కారణంగా తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో విమానాలు రద్దయ్యాయి. హైదరాబాద్ నుండి తిరుపతి వెళ్లాల్సిన విమానం వాతావరణ పరిస్థితులు అనుకూలించక రద్దయ్యింది. ఇక తమిళనాడులో కూడా భారీ వర్షాలు కురుస్తుండటంతో చెన్నై విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేసారు. దీంతో అక్కడికి వెళ్లాల్సిన విమానాలు కూడా రద్దయ్యాయి. 

Latest Videos

click me!