పవన్ కాదంటే, వకీల్ సాబ్ నెక్స్ట్ ఆప్షన్ ఏ స్టార్ హీరోనో తెలిస్తే షాకవుతారు!

First Published Apr 9, 2021, 10:57 AM IST

వకీల్ సాబ్ మూవీ ప్రభంజనం మాములుగా లేదు. రెండు తెలుగు రాష్ట్రాలలో పండగ వాతావరణం నెలకొంది. పవన్ ఫ్యాన్స్ మూడేళ్ల నిరీక్షణకు తెరదించుతూ విడుదలైన వకీల్ సాబ్ సెలెబ్రేషన్స్ లో ఫ్యాన్స్ మునిగిపోయారు. 
 

ఇక వకీల్ సాబ్ చిత్రానికి పాజిటివ్ టాక్ రావడం ఫ్యాన్స్ ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తుంది. తమ హీరో పేరిటన నయా రికార్డ్స్ నమోదు కావడం ఖాయమని వారు ఫిక్సయ్యారు. వకీల్ సాబ్ ప్రదరిస్తున్న థియేటర్స్ దగ్గర కోలాహలం ఓ రేంజ్ లో ఉంది.
undefined
లాయర్ గా పవన్ ఇరగదీశాడని, పవన్ కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ ఈ చిత్రంలో చూడవచ్చని అందరూ అంటున్నారు. ఫైట్స్, డైలాగ్స్ విషయంలో పవన్ దుమ్ములేపాడు అంటున్నారు.
undefined
కాగా ఈ చిత్ర దర్శకుడు వకీల్ సాబ్ గురించి ఓ ఆసక్తికర విషయం బయటపెట్టారు.  వకీల్ సాబ్ పింక్ చిత్రానికి తెలుగు రీమేక్. నిజానికి పవన్ కళ్యాణ్ ఇమేజ్ కి సరిపోయే సబ్జెక్టు కాదు. పింక్ యదావిధిగా తీస్తే పవన్ లాంటి హీరో సెట్ కాడు.
undefined
ఒకవేళ పవన్ ఈ చిత్రం చేయనంటే మరో ఆప్షన్ ఎవరనే ఆలోచన అందరిలో ఉంది.  ఈ ప్రశ్నకు వకీల్ సాబ్ చిత్రానికి దర్శకత్వం వహించిన వేణు శ్రీరామ్ స్వయంగా చెప్పారు.
undefined
తాను ఎంచుకున్న ఈ సబ్జెక్టు ని పవన్ నిరాకరించిన నేపథ్యంలో కింగ్ నాగార్జునతో పింక్ రీమేక్ చేయాలనుకున్నారట ఆయన. పవన్ చేయకపోతే ఆ సబ్జెక్టు నాగార్జున సెట్ అవుతుందని ఆయన భావించారట.
undefined
ఏజ్ పరంగా కూడా పింక్ సబ్జెక్టుకి నాగార్జున దగ్గరగా ఉంటారు. అలాగే ఎలాంటి పాత్రలో అయినా ఒదిగిపోయే నటుడుగా నాగార్జునను చెప్పుకుంటారు. ఆయన చేసిన అన్నమయ్య, శ్రీరామ దాసు చిత్రాలే దీనికి నిదర్శనం.
undefined
ఇక వకీల్ సాబ్ పింక్ చిత్రంతో పోల్చితే చాలా విభిన్నంగా ఉందన్న టాక్ వినిపిస్తుంది. ఓ ఫ్రెష్ మూవీ చూస్తున్న భావన కలుగుతుండగా, పింక్ మదిలోకి రాదని ప్రేక్షకులు అంటున్నారు. ఆ విధంగా పవన్ ఇమేజ్ కి తగ్గట్టుగా దర్శకుడు వకీల్ సాబ్ తీర్చిదిద్దాడట.
undefined
click me!