'ఆర్ యూ వర్జిన్' హైపర్ ఆది షాకింగ్ క్వశ్చన్... ఆ విషయంలో ఫైర్ అయిన యాంకర్ రష్మీ

First Published Aug 26, 2021, 9:41 AM IST

బుల్లితెర షోలలో రారాజుగా వెలుగొందుతుంది ఢీ రియాలిటీ షో. 12సీజన్స్ సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకున్న ఢీ, 13వ సీజన్ మరింత రంజుగా సాగుతుంది.

 
షో ప్రారంభం నుండి ఇప్పటి వరకు ఢీలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. మొదట డాన్స్ మాత్రమే ఉన్న ఈ షోకి గ్లామర్, రొమాన్స్, కామెడీ జోడించడం జరిగింది. రష్మీ, సుడిగాలి సుధీర్, హైపర్ ఆది రాకతో షో సరికొత్తగా సిద్ధమైంది. 

కంటెస్టెంట్స్ డాన్స్ పెర్ఫార్మన్స్ ఒకెత్తు అయితే, గ్యాప్ లో సుధీర్, ప్రదీప్, ఆది, రష్మీ, దీపికా చేసే అల్లరి, కామెడీ మరొక ఎత్తు. ప్రేక్షకులు కావలసిన మసాలా జోడించి ఢీ షో మరింత ఆకర్షణీయంగా మేకర్స్ రూపొందిస్తుండగా, భారీ టీఆర్పీతో దూసుకుపోతుంది. 

తాజాగా ఢీ షోలో చోటు చేసుకున్న ఓ సంఘటన అందరికీ షాక్ ఇచ్చింది. హైపర్ ఆది ఏకంగా ఆర్ యూ వర్జిన్ అంటూ బోల్డ్ క్వచ్చన్ అడిగేశాడు. ఆది ప్రశ్నకు షో లోని వారందరూ షాక్ అయ్యారు. రౌండ్ లో విన్ అయిన రష్మీ టీం... సుధీర్, ఆది టీమ్ టాస్క్ చేయాలని కోరారు. 

అయితే మూడ్ లేదన్న హైపర్ ఆది చేయనని చెప్పాడు. వకీల్ సాబ్ మూవీలో పవన్ ని ఇమిటేట్ చేస్తున్న ఆది టాస్క్ చేసేది లేదంటూ వెళ్లి.. సోఫాలో కూర్చున్నారు. టాస్క్ చేద్దాం భయ్యా అంటూ.. కన్విన్స్ చేయడానికి ప్రయత్నించిన సుధీర్ ని ఆది.. ఆర్ యూ వర్జిన్ అంటూ షాకింగ్ క్వచ్చన్ వేశాడు. 


ఆది ప్రశ్నకు షోలో జడ్జెస్ తో పాటు యాంకర్ రష్మీ, దీపిక షాక్ అయ్యారు. అయితే ఆది అడిగిన ప్రశ్నకు సుధీర్ సమాధానం ఇవ్వకపోగా, చిన్న నవ్వు నవ్వి ఊరుకున్నాడు. రెండు సార్లు ఆది సుడిగాలి సుధీర్ ని ఆ ప్రశ్నతో ఇబ్బంది పెట్టాడు. 

ఇక రౌండ్ లో ఓడిపోయిన ఆది, సుధీర్ టీమ్ టాస్క్ చేయము అనడంతో రష్మీ ఫైర్ అయ్యారు. మేము రౌండ్ గెలిచాము, ఓడిన మీరు టాస్క్ చేయాలని సుధీర్, ఆదిలను నిలదీశారు. అనేక ఆసక్తికర అంశాలతో కూడిన ఢీ ప్రోమో వైరల్ గా మరింది. 

click me!