రోజా భర్త వల్లే విజయ్‌కాంత్ కి 'కెప్టెన్' బిరుదు.. జయలలిత, ఎంజీఆర్, శివాజీ గణేశన్ తర్వాత ఆ రికార్డు ఆయనదే

First Published Dec 28, 2023, 10:54 AM IST

తమిళ సీనియర్ నటుడు, డీఎండీకే అధినేత కెప్టెన్ విజయ్‌కాంత్ ఆరోగ్య పరిస్థితి కొంతకాలంగా ఆందోళన కరంగా ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవలే కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన విజయ్ కాంత్ అంతలోనే కరోనా బారీన పడి మృతి చెందడం తీవ్ర విషాదంగా మారింది. 

captain prabhakaran

తమిళ సీనియర్ నటుడు, డీఎండీకే అధినేత కెప్టెన్ విజయ్‌కాంత్ ఆరోగ్య పరిస్థితి కొంతకాలంగా ఆందోళన కరంగా ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవలే కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన విజయ్ కాంత్ అంతలోనే కరోనా బారీన పడి మృతి చెందడం తీవ్ర విషాదంగా మారింది. 

విజయ్‌కాంత్ 80, 90 దశకాల్లో వందలాది చిత్రాల్లో నటించి అలరించారు. ఆ తర్వాత డీఎండీకే పార్టీని స్థాపించి పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చారు. విజయ్‌కాంత్ సామాన్యులకు సైతం అందుబాటులో ఉండే నాయకుడు అంటూ తమిళనాడులో గుర్తింపు ఉంది.

Latest Videos


విజయకాంత్ మృతితో లక్షలాదిమంది అభిమానులు తమిళనాట శోకంలో మునిగిపోయారు. సినీ రాజకీయ ప్రముఖులు కెప్టెన్ ని కడసారి చూసేందుకు తరలి వెళుతున్నారు. విజయకాంత్ పేదవారికి ఎమోషనల్ గా కనెక్ట్ అయిన నాయకుడు. సినీ రంగంలో కూడా ఎన్నో రికార్డులు ఆయన సొంతం అయ్యాయి. అయితే తన క్రేజ్ ని విజయ్ కాంత్.. రజని, కమల్ తరహాలో పూర్తి స్థాయిలో కొనసాగించలేకపోయారు. 

remembering actor vijayakanth

స్టార్ హీరోలకు వారి బిరుదులు, ముద్దు పేర్లే ఇంటి పేర్లుగా మారిపోతాయి. దశాబ్దాల నుంచి అభిమానులు విజయ్ కాంత్ ని కెప్టెన్ అని పిలవడం చూస్తూనే ఉన్నాం. ఆ బిరుదు వెనుక తిరుగులేని రికార్డు, ఆసక్తికరమైన విశేషాలు ఉన్నాయి. విజయకాంత్ నటించిన 100వ చిత్రం 'కెప్టెన్ ప్రభాకరన్'. ఆంధ్ర ప్రదేశ్ మంత్రి, నటి రోజా భర్త ఆర్కే సెల్వమణి దర్శకత్వంలో మెమొరబుల్ మూవీ తెరకెక్కింది. 1991లో విడుదలైన ఈ చిత్రం విజయకాంత్ కెరీర్ లో తిరుగులేని హిట్ గా నిలిచింది. 

అప్పటి నుంచే ఆర్కే సెల్వమణి విజయ్ కాంత్ ని కెప్టెన్ అని పిలవడం ప్రారంభించారు. దీనితో ఆ పేరే విజయకాంత్ బిరుదుగా మారిపోయింది. ఒకరకంగా అదే ఇంటిపేరుగా కూడా మారిపోయింది అని చెప్పొచ్చు. అంతకు ముందే విజయకాంత్ సెల్వమణి దర్శకత్వంలో పూలన్ విసరణై అనే చిత్రంలో నటించారు. 

దీనితో విజయకాంత్, సెల్వమణి మధ్య మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. అయితే కెప్టెన్ ప్రభాకరన్ మూవీ ప్రభంజనం అంతటితో ఆగిపోలేదు. ఆ చిత్రంతో విజయకాంత్ మరో అరుదైన రికార్డ్ కూడా సొంతం చేసుకున్నారు. అంతకు ముందు తమ 100వ చిత్రాలతో సిల్వర్ జూబ్లీ బ్లాక్ బస్టర్ సాధించింది జయలలిత, ఎంజీఆర్, శివాజీ గణేశన్ మాత్రమే. 

కెప్టెన్ ప్రభాకరన్ చిత్రం కూడా సిల్వర్ జూబ్లీ హిట్ గా నిలిచింది. జయలలిత, ఎంజీఆర్, శివాజీ గణేశన్ తర్వాత ఆ ఘనత సాధించిన హీరోగా విజయకాంత్ రికార్డు సృష్టించారు. మరో విశేషం ఏంటంటే రోజా కూడా విజయకాంత్ సరసన తమిళ్ సెల్వన్ అనే చిత్రంలో నటించింది. ఆ మూవీ కూడా సూపర్ హిట్ గా నిలిచింది. 

click me!