చివరకు సదా కూడా చూపించేస్తుంది... కొంగు చాటు నుండి తొంగి చూస్తున్న నెలవంక నడుము!

First Published Jun 9, 2023, 10:11 PM IST


చివరికి సదా కూడా పంథా మార్చింది. కొత్తగా గ్లామరస్ ఫోటో షూట్స్ చేస్తుంది. తాజాగా నల్ల చీరలో నడుము వంపులు ప్రదర్శించింది. 
 

Sadaa


చాలా గ్యాప్ తర్వాత సదా సిల్వర్ స్క్రీన్ పై  కనిపించింది. లేటెస్ట్ రిలీజ్  అహింస చిత్రంలో లాయర్ రోల్ చేశారు. దర్శకుడు తేజ  తెరకెక్కించిన ఈ చిత్రం నిరాశపరిచింది. కాగా వెండితెరకు సదాను పరిచయం చేసిన దర్శకుడు తేజ కావడం విశేషం. ఆయనే ఆమెకు రీఎంట్రీ ఛాన్స్ కూడా ఇచ్చాడు. 
 

Sadaa


మరోవైపు సదా టీవీ హోస్ట్ అవతారం ఎత్తారు. ఆమె బీబీ జోడి జడ్జిగా చేశారు . బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్స్ తో బీబీ జోడి పేరుతో డాన్స్ రియాలిటీ షో కండక్ట్ చేశారు. ఈ షోకి సీనియర్ హీరోయిన్ రాధ, తరుణ్ మాస్టర్ జడ్జెస్ తో పాటు జడ్జిగా సదా  చేశారు. ఇటీవల జబర్దస్త్ జడ్జి గా కూడా ఎంట్రీ ఇచ్చారు. 
 

Sadaa

ఇక సదా కెరీర్ పరిశీలిస్తే ఆమె సిల్వర్ స్క్రీన్ పై కనిపించి చాలా రోజులు అవుతుంది. 2018లో విడుదలైన తమిళ చిత్రం టార్చ్ లైట్ తర్వాత మరలా కనిపించలేదు. మంచి ఆఫర్ వస్తే నటించడానికి సిద్ధంగా ఉన్నారు. 

Sadaa

సదా పరిశ్రమకు వచ్చి రెండు దశాబ్దాలు దాటిపోయింది. మంచి ఆరంభం లభించినా పునాది వేసుకోలేకపోయింది. జయం డెబ్యూ మూవీ 2002లో విడుదలైన సెన్సేషనల్ విజయం సాధించింది.  ఆ మూవీతో సదా ఓవర్ నైట్ స్టార్ అయ్యారు. 

Sadaa


జయం మూవీ సదాకు వరుస ఆఫర్స్ తెచ్చిపెట్టింది. ఆమె బిజీ యాక్ట్రెస్ అయ్యారు . అయితే ఆమెకు స్టార్స్ పక్కన అరుదుగా అవకాశాలు వచ్చాయి. ఫార్మ్ లో ఉన్నప్పుడు ఎన్టీఆర్ కి జంటగా నటించిన నాగ ఆడలేదు. అనంతరం బాలయ్యతో వీరభద్ర చిత్రం చేసింది. ఇది కూడా నిరాశపరిచింది. 
 

సదా కెరీర్లో ఉన్న మరో అతిపెద్ద హిట్ అపరిచితుడు. దర్శకుడు శంకర్-విక్రమ్ కాంబోలో వచ్చిన ఈ సైకలాజికల్ థ్రిల్లర్ తెలుగు, తమిళ భాషల్లో భారీ విజయం సాధించింది. అపరిచితుడు తర్వాత ఆ రేంజ్ హిట్ మరలా పడలేదు. స్క్రిప్ట్ సెలక్షన్ లో తడబడ్డ సదా ప్లాప్స్ తో రేసులో వెనుకబడింది. ఆమె కెరీర్ గ్రాఫ్ పడిపోతూ వచ్చింది. 2016 తర్వాత రెండేళ్లు ఆమె పరిశ్రమకు దూరమయ్యారు.
 

click me!