ఎగసిపడుతున్న ఎద మీద తళుకులు అంటించిన రకుల్ ప్రీత్... ఆకర్షించేందుకు అలాంటి పనులా?

First Published Apr 24, 2023, 8:15 PM IST

క్రాప్ టాప్ లెహంగాలో రకుల్ ప్రీత్ సింగ్ మెస్మరైజ్ చేశారు. డిజైనర్ దుస్తుల్లో ఫ్యాన్స్ కి గ్లామర్ ట్రీట్ ఇచ్చారు. రకుల్ తన లేటెస్ట్ ఫోటో షూట్ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయగా వైరల్ అవుతుంది. 
 

Rakul Preeth Singh

స్టార్ లేడీ రకుల్ ప్రీత్ సింగ్ సోషల్ మీడియా వేదికగా సెగలు రేపుతోంది. ట్రెండీగా తయారై కుర్రాళ్ళ గుండెల్లో గంటలు మోగించారు. ఎద భాగం మీద తళుకులు అంటించుకుని ఆకర్షించే ప్రయత్నం చేసింది. రకుల్ పాప అందాలు ఫ్యాన్స్ ని నిద్రకు దూరం చేస్తున్నాయి. 
 

Rakul Preeth Singh

రకుల్ ప్రీత్ గ్లామర్ ని టాలీవుడ్ ఆడియన్స్ బాగా మిస్ అవుతున్నారు. కెరీర్ ఇచ్చిన టాలీవుడ్ ని కాదని బాలీవుడ్ లో పాగా వేసింది.హిందీలో రకుల్ వరుసగా చిత్రాలు చేస్తున్నారు. పోయిన ఏడాది అటాక్, రన్ వే 34, డాక్టర్ జి, కట్ ఫుట్లీ, థాంక్ గాడ్ చిత్రాలు రకుల్ నెలల వ్యవధిలో విడుదల చేశారు.  
 

Latest Videos


Rakul Preeth Singh

ఇక 2023 ఆరంభంలోనే ఓ మూవీతో ప్రేక్షకులను పలకరించింది. ఆమె లేటెస్ట్ రిలీజ్ ఛత్రీవాలీ హిట్ టాక్ తెచ్చుకుంది. దీంతో ఆమె పరాజయాలకు బ్రేక్ పడింది. కొత్త ఆశలతో ముందుకు వెళుతుంది. ఛత్రీవాలీ థియేటర్ రిలీజ్ కాకపోవడం నిరాశపరిచే అంశం. ఓటీటీ సక్సెస్ కెరీర్ కి ఏమంత హెల్ప్ చేయదు.

Rakul Preeth Singh


రకుల్ ఐదారేళ్ళ టాలీవుడ్ లో సత్తా చాటారు. ప్రభాస్, పవన్ మినహాయిస్తే ఈ తరం టాప్ స్టార్స్ అందరితో జతకట్టింది. ఈ మధ్య రకుల్ తెలుగులో నటించిన చిత్రాలు వరుసగా పరాజయం పొందాయి. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ మూవీతో రకుల్ వెలుగులోకి వచ్చింది. 
 

Rakul Preeth Singh

ఎన్టీఆర్ కి జంటగా నాన్నకు ప్రేమతో, చరణ్ తో ధృవ, అల్లు అర్జున్ కి జంటగా సరైనోడు చిత్రాల్లో రకుల్ నటించారు. ప్రస్తుతం కమల్ హాసన్-శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న భారతీయుడు 2 మూవీలో నటిస్తుంది. ఆ మధ్య రకుల్ నటించిన చెక్, కొండపొలం చిత్రాలు పరాజయం పొందాయి. ఆ దెబ్బతో రకుల్ కి టాలీవుడ్ లో అవకాశాలు రావడం లేదు. 
 

Rakul Preeth Singh


మరోవైపు రకుల్ పెళ్లి వార్తలు తరచుగా చక్కర్లు కొడుతున్నాయి. కొన్ని నెలల క్రితం రకుల్ తమ్ముడు అమన్ ప్రీత్ సింగ్... వచ్చే ఏడాది రకుల్-జాకీ పెళ్లి చేసుకోవచ్చని హింట్ ఇచ్చాడు. అమన్ కామెంట్ పై రకుల్ భిన్నంగా స్పందించింది. నా లైఫ్ గురించి నాకు తెలియని విషయాలు నువ్వు చెబుతున్నావా? అంటూ ట్వీట్ చేసింది. 
 

Rakul Preeth Singh

2021లో రకుల్ బాలీవుడ్ నటుడు, నిర్మాత జాకీ భగ్నానీ ని ప్రేమికుడంటూ పరిచయం చేసింది. అప్పటి నుండి రకుల్ పెళ్లి మీద మీడియా ఆసక్తి కనబరుస్తోంది. జాకీతో మీ పెళ్లెప్పుడని అడుగుతుంటే రకుల్ కి కోపం వస్తుంది. ఈ క్రమంలో ఇది పెళ్లి వరకు వెళ్లే ప్రేమేనా అనే సందేహాలు తలెత్తుతున్నాయి. బాలీవుడ్ లో లాకప్ లు బ్రేకప్ లు చాలా కామన్. 
 

Rakul Preeth Singh


రకుల్ డ్రగ్స్ ఆరోపణలు ఎదుర్కోవడం కొసమెరుపు. ఆమె రెండు సార్లు విచారణ ఎదుర్కొన్నారు. డ్రగ్స్ కేసులో టాలీవుడ్ స్టార్స్ పేర్లు వినిపించాయి వారిలో రకుల్ కూడా ఉన్నారు. అలాగే బాలీవుడ్ హీరోయిన్స్ దీపికా పదుకొనె, శ్రద్ధా కపూర్, సారా అలీఖాన్ లతో పాటు ఎన్సీబీ ఎదుట రకుల్ హాజరయ్యారు. 

click me!