ప్రణీత సౌత్ లో తెలుగు, తమిళం, కన్నడ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అటు హిందీలో సినిమాల్లోనూ అవకాశాలు అందుకుంది. చివరిగా తెలుగు ఆడియెన్స్ ను ‘హలో గురు ప్రేమ కోసమే’,‘ఎన్టీఆర్ : కథానాయకుడు’ చిత్రాలతో అలరించింది. ఆ తర్వాత హిందీలో రెండు సినిమాలు చేసింది. మున్ముందు ఎలాంటి సినిమాల్లో నటించబోతుందనేది ఆసక్తికరంగా మారింది.