రొమాన్స్ చేసేటప్పుడు రోజా అలా అంటుంటే మూడ్ వచ్చేది కాదు

First Published Dec 16, 2020, 12:42 PM IST

హీరో శ్రీకాంత్ కెరీర్ లో క్లాసిక్ హిట్ గా నిలిచిపోయింది ప్రేయసి రావే. రాశి హీరోయిన్ గా నటించిన ఈ ట్రాజిక్ లవ్ స్టోరీని లెజెండరీ నిర్మాత రామానాయుడు నిర్మించగా, పోసాని కృష్ణమురళి మాటలు అందించారు. 1999లో విడుదలైన ఈ చిత్రం 21ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో శ్రీకాంత్ ఆ సినిమా విశేషాలు పంచుకున్నారు.

అలాగే తనతో నటించినఅప్పటిహీరోయిన్స్గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 90లలో స్టార్ హీరోయిన్స్ గా వెలుగొందినసౌందర్య, రమ్యకృష్ణ, రాశి మరియు రోజా గురించి శ్రీకాంత్ మాట్లాడడం జరిగింది.
undefined
ప్రతి ఒక్క హీరోయిన్ తో అనేక సినిమాలలో శ్రీకాంత్ నటించడం జరిగింది. హీరోయిన్స్ అందరితో చాలా సన్నిహిత సంబంధం ఉండేదట. అందరూ ఒక కుటుంబంలా కలిసి ఉండేవారట. షూటింగ్స్ సెట్స్ లో వరుసలు పెట్టి పిలుచుకునేవారట.
undefined
ఇక రోజా శ్రీకాంత్ ని అన్నయ్య అని పిలిచేదట. ప్రతి సన్నివేశంలో నటించే సమయంలో అలా చేద్దాం... ఇలా చేద్దాం అన్నయ్య అని సంభోధించేదట. చివరకు రొమాంటిక్ సన్నివేశాల సమయంలో కూడా రోజా అన్నయ్య అంటూ పిలిచేదట.
undefined
దానితో ఎహె ఆపు... నువ్వు అన్నయ్య అంటుంటే నాకు రొమాంటిక్ మూడ్ రావడం లేదని శ్రీకాంత్ అనే వాడట. నవ్వుతూ ఈ విషయాన్ని మీడియాతో పంచుకున్నారు శ్రీకాంత్.
undefined
ఇక ప్రేయసి రావే మూవీ ఇప్పుడు చూసినా ఫ్రెష్ ఫీల్ కలుగుతుందని, రామానాయుడు గారు పట్టుబట్టి ఆ మూవీ నాతో చేశారన్నారు. ప్రేయసి రావే రూపంలో మంచి హిట్ ఇచ్చిన రామానాయుడు గారికి ధన్యవాదాలని శ్రీకాంత్ అన్నారు.
undefined
click me!