పవన్ కి మూడోసారి విడాకులు తప్పవు, చెప్పేవారు లేక జీవితం నాశనం... వేణు స్వామి సంచలన జోస్యం 

First Published Jan 5, 2024, 9:57 AM IST


పవన్ కళ్యాణ్ ను ఉద్దేశిస్తూ వేణు స్వామి మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. ఆయన జాతకరీత్యా మూడోసారి విడాకులు తప్పవు. చెప్పేవారు లేక రాజకీయాలు చేస్తూ జీవితం నాశనం చేసుకుంటున్నాడని తన జోస్యం వివరించాడు. 
 

Pawan Kalyan

సెలబ్రిటీల కెరీర్, వ్యక్తిగత జీవితాలపై కామెంట్స్ చేస్తూ వేణు స్వామి పాప్యులర్ అయ్యారు వివాదాస్పద జ్యోతిష్యుడిగా పేరు తెచ్చుకున్నాడు. ప్రభాస్, పవన్ కళ్యాణ్, నాగ చైతన్య, అఖిల్, విజయ్ దేవరకొండతో పాటు పలువురు టాలీవుడ్ సెలెబ్స్ పై జాతకం పేరుతో షాకింగ్ కామెంట్స్ చేశాడు. 

Venu Swami

అయితే వేణు స్వామి చెప్పిన వాటిలో చాలా నిజమయ్యాయి. అలాగే టాలీవుడ్ స్టార్స్ ఈయన క్లయింట్స్. రష్మిక మందాన, నిధి అగర్వాల్, డింపుల్ హయాతి వంటి హీరోయిన్స్ కెరీర్లో ఎదగాలని పూజలు చేయించుకున్నారు. బాలకృష్ణతో పాటు పలువురు హీరోలు తనతో పూజలు జరిపించారని ఆయన చెప్పారు.

Latest Videos


Venu Swami

అయితే వేణు స్వామి చెప్పిన వాటిలో చాలా నిజమయ్యాయి. అలాగే టాలీవుడ్ స్టార్స్ ఈయన క్లయింట్స్. రష్మిక మందాన, నిధి అగర్వాల్, డింపుల్ హయాతి వంటి హీరోయిన్స్ కెరీర్లో ఎదగాలని పూజలు చేయించుకున్నారు. బాలకృష్ణతో పాటు పలువురు హీరోలు తనతో పూజలు జరిపించారని ఆయన చెప్పారు.

ఇటీవల ప్రభాస్ గురించి వేణు స్వామి చేసిన కామెంట్స్ ఫ్యాన్స్ ని హర్ట్ చేశాయి. సలార్ కూడా ప్లాప్ అవుతుందని అన్నాడు. దాంతో వేణు స్వామి మీద వారు మండిపడ్డారు. సలార్ విషయంలో వేణు స్వామి జోస్యం తప్పయిందని ఏకిపారేశారు. 
 

Pawan Kalyan

తాజాగా వేణు స్వామి పవన్ కళ్యాణ్ భవిష్యత్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ కి మరలా విడాకులు తప్పవు. ఆయన జాతకరీత్యా 2024లో మూడోసారి విడాకులు తీసుకుంటారు .  సినిమా కెరీర్ పరంగా జాతకం అద్భుతంగా ఉంది. వ్యక్తిగత సమస్యలతో సతమతం అవుతాడు. 
 

Pawan Kalyan


పవన్ కళ్యాణ్ కేవలం త్రివిక్రమ్ మాటలు వింటారు. అయితే త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోరు. చెప్పేవారు లేక అనవసరంగా రాజకీయాలు చేసి భవిష్యత్ నాశనం చేసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ సీఎం అయ్యే మార్గం వెతకడం లేదు. పవన్ కళ్యాణ్ సీఎం అయితే సంతోషించేవారిలో నేను కూడా ఒకరిని అన్నాడు. 

కానీ నా మాటలు తప్పుగా అర్థం చేసుకుని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నన్ను విమర్శిస్తున్నారని వేణు స్వామి చెప్పుకొచ్చాడు. వేణు స్వామి మాటల ప్రకారం మూడో భార్య అన్నాలెజినోవాకు కూడా పవన్ కళ్యాణ్ విడాకులు ఇవ్వనున్నాడు. అది కూడా ఈ ఏడాదే నట. 

గతంలో కూడా వేణు స్వామి పవన్ కళ్యాణ్ కి రాజకీయ భవిష్యత్తు లేదని చెప్పడం కొసమెరుపు. వేణు స్వామి తాజా వ్యాఖ్యలు మరోసారి కలకలం రేపాయి. వేణు స్వామి జోస్యం పై ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

click me!