బాలయ్య చేసిన దారుణమైన రేప్ సీన్స్... చిత్రహింస అనుభవించిన ఆ ఇద్దరు హీరోయిన్స్!

First Published Jun 19, 2024, 11:41 AM IST

సిల్వర్ స్క్రీన్ పై రేప్ సీన్ చూస్తుంటే ఒకింత ఆవేశం, ఆవేదన కలుగుతుంది. ఓ అమ్మాయి జీవితం నాశనం చేసిన విలన్ మీద కోపం వస్తుంది. మరి హీరో రేప్ సీన్ లో నటిస్తే జీర్ణించుకోవడం కష్టమే. బాలకృష్ణ అలాంటి రెండు ఘోరమైన రేప్ సీన్స్ లో నటించాడు. 
 

Balakrishna

బాలకృష్ణ కెరీర్లో అనేక విలక్షణ పాత్రలు చేశాడు. ఆయన నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్స్ కూడా చేశాడు. ఈ క్రమంలో ఆయన మానభంగం సన్నివేశాల్లో నటించి ఒకింత అభిమానులకు షాక్ ఇచ్చాడు. సాధారణంగా స్టార్ హీరో ఇమేజ్ ఉన్న నటులు ఈ సాహసం చేయరు. బాలయ్య మాత్రం ఇమేజ్ ని పక్కన పెట్టి రేప్ సీన్స్ లో నటించాడు.

Balakrishna

1997లో ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో తెరకెక్కిన పవిత్ర ప్రేమ చిత్రంలో బాలకృష్ణ హీరోగా నటించారు. లైలా, రోషిణి హీరోయిన్స్. ఈ మూవీలో లైలా డాక్టర్ రోల్ చేసింది. ఆమె మెయిన్ హీరోయిన్. పవిత్ర ప్రేమ చిత్రంలో బాలయ్య-లైలా మధ్య రేప్ సీన్ ఉంటుంది. 
 

Latest Videos


Balakrishna

మద్యం మత్తులో హీరో ఓ అమ్మాయి వెనకాల పడతాడు. అనుకోకుండా ఒంటరిగా ఉన్న హీరోయిన్ గదిలోకి వెళతాడు. చీకటి గదిలో ఆమె మీద మృగంలా విరుచుకుపడతాడు. ఆమె మానం దోచుకుంటాడు. మెరుపు వెలుగులో అతని చేతి మీద ఉన్న కాళీ అనే పచ్చబొట్టును మాత్రమే చూస్తుంది హీరోయిన్. ఆ కాళీ మీద ప్రతీకారం తీర్చుకోవాలి అనుకుంటుంది. బాలయ్య-లైలా మీద తెరకెక్కిన రేప్ సీన్ కొంచెం కటువుగానే ఉంటుంది. 
 

Balakrishna

బాలకృష్ణ పూర్తిస్థాయి నెగిటివ్ రోల్ చేసిన చిత్రం సుల్తాన్. సమరసింహారెడ్డి వంటి ఇండస్ట్రీ హిట్ అనంతరం సుల్తాన్ విడుదలైంది. కృష్ణ, కృష్ణంరాజు కీలక రోల్స్ చేయడం విశేషం. బాలకృష్ణ డ్యూయల్ రోల్ చేశాడు. సుల్తాన్ పాత్రలో బాలకృష్ణ కరుడుగట్టిన ఉగ్రవాది. 
 

Balakrishna

వేషాలు మార్చుతూ ఇండియన్ గవర్నమెంట్ కి సవాల్ విసురుతూ ఉంటాడు. జాలి,దయ లేని కర్కశుడు సుల్తాన్. ఈ మూవీలో రోజా, రచన, దీప్తి భట్నాగర్ హీరోయిన్స్ గా నటించారు. రోజా తో బాలకృష్ణకు రేప్ సీన్స్ ఉన్నాయి ఈ చిత్రంలో. 
 

Balakrishna

తాళి కట్టని భార్యగా రోజా నటించింది. ఇంటికి వచ్చినప్పుడల్లా ఆమె మీద మృగంలా దాడి చేసి కోరిక తీర్చుకుంటూ ఉంటాడు. రోజాతో బాలకృష్ణ రేప్ సీన్స్ పైశాచికత్వం తలపిస్తాయి. సుల్తాన్ పాత్రలోని జంతు ప్రవృత్తిని తెలియజేశాడం కోసం దర్శకుడు అలాంటి సన్నివేశాలు రాశాడు. 
 

Balakrishna

పవిత్ర ప్రేమ, సుల్తాన్ చిత్రాల్లో బాలకృష్ణ చేసిన రేప్ సీన్స్ ఫ్యాన్స్ కూడా నొచ్చుకునేలా ఉంటాయి. కాగా ఈ రెండు చిత్రాలు సరైన ఫలితం ఇవ్వలేదు. పవిత్ర ప్రేమ ప్లాప్ కాగా, సుల్తాన్ యావరేజ్ రిజల్ట్ అందుకుంది. సమరసింహారెడ్డి థియేటర్స్ లో ఉండగానే సుల్తాన్ మూవీ రావడం విశేషం..

click me!