ఒక్కొక్కటిగా కోట్ల ఆస్తులు అమ్ముకుంటున్న ప్రియాంక చోప్రా.. ఏమైంది?

First Published Jul 23, 2021, 2:26 PM IST

గ్లోబల్‌ బ్యూటీ ప్రియాంక చోప్రా అమెరికాలో సెటిల్‌ అయ్యింది. హాలీవుడ్‌ సినిమాలతో దూసుకుపోతుంది. అంతర్జాతీయంగా తన సత్తా చాటుకుంటోంది. ఇంతగా రాణిస్తున్న ప్రియాంక ఇప్పుడు ఆస్తులమ్ముకోవడం చర్చనీయాంశంగా మారింది. 

ప్రియాంక చోప్రా మూడేళ్ల క్రితం హాలీవుడ్‌ సింగర్‌ నిక్‌జోనాస్‌ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. తనకంటే ఏజ్‌లో చిన్నవాడైనా ప్రేమకి ఏజ్‌తో సంబంధం లేని నిరూపించింది. లాస్‌ ఏంజెల్స్ లో రూ.150కోట్లతో కొత్తగా కొన్న విలాసవంతమైన అత్యంత లగ్జరీ హౌజ్‌లో నివసిస్తుంది ప్రియాంక.
undefined
పైగా పారితోషికం రూపంలో ఆమె ఏడాదికి ఇరవై కోట్లకుపైగానే అందుకుంటోంది. ఇతర కమర్షియల్‌ యాడ్స్, మేగజీన్స్ కోసం ఫోటో షూట్లు, ప్రొడక్షన్‌తోనూ భారీగానే సంపాదిస్తుంది ప్రియాంక. మరోవైపు నిక్‌ జోనాస్‌ ఆదాయం అదనం. ఇన్ని రకాలుగా ఆదాయాన్ని పొందుతున్న ప్రియాంకకి ఆస్తులమ్ముకోవాల్సిన అవసరం ఏంటనేది ఇప్పుడు చర్చ.
undefined
అసలు విషయంలోకి వెళితే.. ప్రియాంక చోప్రా ఆస్తులమ్ముకోవడం ఓ రకమైన బిజినెస్‌గా చేస్తుంది. తనకు ఇండియాలో కోట్లల్లో ఆస్తులున్నాయి. ముంబయి, గోవా వంటి చోట్ల ప్రాపర్టీస్‌ ఉన్నాయి. వాటిని ఇటీవల అమ్మేసింది. మహారాష్ట్ర అంథేరిలోని ఓ బిల్డింగ్‌లో ఏడో ఆంతస్తులోని ఓ ఫ్లాట్‌ని ఈ మార్చిలో రూ. మూడు కోట్లు అమ్మేసిందట.
undefined
అలాగే అదే అంతస్తులోని మరో విశాలమైన ఫ్టాట్‌ని రూ.నాలుగుకోట్లకు అమ్మిందని బాలీవుడ్‌ మీడియా సమాచారం. ఈ రెండింటిని మరో బాలీవుడ్‌ నటి జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌ కొనుగోలు చేసింది. సముద్రం కనిపించే వ్యూతో బాల్కనీ, ఐదు బెడ్‌రూమ్‌లు, విశాలమైన లివింగ్‌ ఏరియా ఈ ఇంటి స్పెషాలిటీ. ఇలా ప్రియాంకకి ఏడు కోట్లు వచ్చాయి.
undefined
మరోవైపు ఒషిరావాలోని రెండంతస్తుల ఆఫీస్‌ని అద్దెకిచ్చింది ప్రియాంక. దీని నెల రెంటు రెండు లక్షల పదకొండు వేలు అని తెలుస్తుంది. గతేడాది ఫిబ్రవరిలోనూ పశ్చిమ అంధేరీలోని కరణ్‌ అపార్ట్‌మెంట్‌లో ఓ ఇంటిని రెండు కోట్ల రూపాయలకు అమ్మేసింది.
undefined
ప్రియాంక గతంలో ముంబైలోని జుహు అపార్ట్‌మెంట్‌లో ఉండేది. 2018లో నిక్‌ జోనస్‌ను పెళ్లి చేసుకున్న ఆమె, కొంతకాలం పాటు భర్తతో కలిసి అక్కడే నివసించింది. ఆ తర్వాత అమెరికాకి షిఫ్ట్ అయ్యారు. అయితే ప్రియాంక ఇండియాలో ఉన్న ఆస్తులను అమ్ముకుని మరో చోట, అంటే అమెరికా లాంటి చోట్లు మరో రూపంలో ఇన్వెస్ట్ చేయాలని భావిస్తుందట.
undefined
అదే సమయంలో ఇండియాలోనూ మరో కొత్త అపార్ట్ మెంట్లలో ఫ్లాట్‌ కొనాలని, ఇలా కొంటూ, అమ్ముతూ డబ్బులు సంపాదించడం లక్ష్యంగా పెట్టుకుందట ప్రియాంక.
undefined
ఇక ప్రస్తుతం ప్రియాంక `మ్యాట్రిక్స్`, `టెక్ట్స్ ఫర్‌ యూ` అనే రెండు చిత్రాల్లో నటిస్తుంది. మరోవైపు `సిటాడెల్‌` అనే టీవీ షోలో యాక్ట్ చేస్తుంది.బాలీవుడ్‌కి ఆల్మోస్ట్ దూరమైందనే చెప్పాలి.
undefined
click me!