Devatha: జానకమ్మను కలిసిన దేవుడమ్మ..మాధవ్ ని అనుమానిస్తున్న ఆదిత్య!

First Published Oct 25, 2022, 12:25 PM IST

Devatha: బుల్లితెరపై ప్రసారమవుతున్న దేవత సీరియల్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. చెల్లి కోసం భర్తను త్యాగం చేసిన మహిళ కథతో ప్రేక్షకుల ముందు వచ్చింది. నిత్యం ట్విస్టులతో కొనసాగుతున్న ఈ సీరియల్ ఈ రోజు అక్టోబర్ 25వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం..
 

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే..రుక్మిణి దేవి దొరకలేదు అని ఆదిత్య తో చెప్పుకుంటూ బాధగా ఉంటుంది. భయపడొద్దు రుక్మిణి, దేవి కనబడుతుందిలే దేవి కనిపించడం లేదని ఇంట్లో అమ్మవాళ్ళు చాలా కంగారు పడుతున్నారు అని అనగా, ఎక్కడ వెతికినా దేవి కనిపించడం లేదు ఇంకెన్ని వెతకాలి అయినా అత్తమ్మకి దేవి అంటే ఇష్టమని తెలుసుగాని దేవి కనపడకపోతే ప్రాణం పోయే అంత బాధ పడుతుందని అనుకోలేదు అని అంటుంది. మా ఇంట్లో వాళ్లకి దేవి నా కూతురు అని తెలియడం తప్ప మిగిలిన అన్ని విషయాల్లోనీ దేవిని తన సొంత ఇంటి బిడ్డలాగే చూసుకుంటారు అని అంటాడు ఆదిత్య. 

అలాంటి ఇంటికి దేవిని దూరం చేస్తున్నానని బాధపడుతుంది రుక్మిణి. ఆ తర్వాత సీన్లో రామ్మూర్తి జానకమ్మ దగ్గరికి వచ్చి, దేవి కనిపించడం లేదని నువ్వు సరిగ్గా ముద్ద కూడా తినడం లేదు దేవి దొరుకుతుంది లే బాధపడొద్దు అని మందులు ఇస్తూ ఉంటాడు. ఇంతలో దేవుడమ్మ తన భర్తతో కలిసి అక్కడికి వస్తుంది. జానకమ్మ గారికి ఎలాగున్నది అని అనగా, ఇంకేం తగ్గలేదు అమ్మ అని బెంగపెట్టుకుంటుంది దేవి మీద అని రామ్మూర్తి అంటాడు. ఇంతలో చిన్మయి మాధవ్ అక్కడికి వస్తారు.  దేవుడమ్మని చూసిన చిన్మయి వెళ్లి హద్దుకొని అవ్వ దేవి కనిపించడం లేదు అని ఏడుస్తూ ఉంటుంది. 
 

అప్పుడు దేవుడమ్మ, నీతో పాటే కదమ్మా స్కూల్ కి వెళ్ళింది మరి ఎలాగా అక్కడి నుంచి బయటికి వచ్చింది అని అడుగుతుంది. తెలిదు అవ్వ నాకు చెప్పకుండా వచ్చేసింది నాకు చెప్తే నేను పంపించేదాన్నే కాదు అని అనగా దేవుడమ్మ చిన్మయి ని ఊరుకోపెడుతుంది. మాధవ్ ని చూస్తూ, కన్న కూతురు కనిపించడం లేదంటే ఇంత మనశాంతిగా ఉన్నాడు ఏంటి అని అనుకోని దేవి గురించి ఏమైనా తెలిసిందా మాధవ్ అని అడుగుతుంది దేవుడమ్మ. ఇంకా ఏం తెలియలేదు వెతుకుతున్నారు అందరూ అని మాధవ్ అంటాడు. 
 

అప్పుడు దేవుడమ్మ, రాధ ఏది అని అనగా, దేవి కనిపించడం లేదు అని తెలిసినప్పుడు నుంచి రాధ ప్రతి సందులోని ప్రతి ఊర్లోని వెతుకుతుంది అని అంటాడు రాం మూర్తి. మా ఆదిత్య కూడా దేవి కనిపించడం లేదని చెప్పేసరికి ఊరంతా వెతుకుతున్నాడు అని అని చెప్పి దేవి గురించి ఏదైనా తెలిస్తే చెప్పండి మేము ఇంకా బయలుదేరుతాము అని బయలుదేరుతారు. ఆ తర్వాత సీన్లో భాష, సూరి ఇద్దరు కలిసి కరెన్సీ కి భోజనం పెడుతూ ఉంటారు. అప్పుడు వాడు అమాయకుడిగా నటిస్తూ భోజనం అంతా తింటాడు. మాకేం మిగిల్చ లేదా అని సూరి అనగా, అదేంటి మీకు మీరు తెచ్చుకోలేదా అని అంటాడు కరెన్సీ. 
 

అప్పుడు భాషా, పోనీలే వీడిని అప్పగిస్తే 50 లక్షలు వస్తాయి కదా అని అనగా మీరేంటి ఇంత తెలివితక్కువగా, అమాయకంగా ఉన్నారు. మా నాన్న దగ్గర ఎన్ని కోట్లు ఉన్నాయి 50 లక్షల అడుగుతారేంటి ఓ రెండు కోట్లు ఇస్తే కానీ కొడుకుని ఇవ్వను అని చెప్పండి చచ్చినట్టు మా నాన్న ఇస్తారు అని అంటాడు. దానికి భాషా, దీనివల్ల నీకు వచ్చేదేంటి అని అనగా, మా బాబు నాకు ఎప్పుడూ డబ్బులు ఇవ్వడు కనీసం ఈ విధంగానైనా డబ్బులు ఇస్తే ముగ్గురూ సగం సగం చేసుకుంటాం కదా అని అనగా ఈ విషయం ఏదో బాగుంది అని భాష, సూరి ఫోన్ చేయడానికి వెళ్తారు.
 

 అప్పుడు కరెన్సీ, వీళ్ళు బాగా దొరికారు అని తన గదిలోకి వెళ్లి వాళ్ళతో మాట్లాడుతూ నవ్వుకుంటాడు. ఆ తర్వాత సీన్లో జరిగిన విషయం అంతా గుర్తుతెచ్చుకుంటూ సత్య బాధపడుతూ, అయినా నేను ఇంత చదువుకున్నాను నా భర్త ఇంకొకరితో వెళ్తే మౌనంగా ఎందుకు కూర్చుని ఊరుకోవాలి. ఇప్పటివరకు నా అక్క అని ఊరుకున్నాను ఇప్పుడు నుంచి అలా ఊరుకోను అని అనుకుంటుంది. అదే సమయంలో దేవుడమ్మ, తన భర్తతో కలిసి తిరిగి ఇంటికి వస్తారు. అప్పుడు వచ్చి, ఏవండీ మీరు మాధవ్ ని చూశారా కూతురు కనిపించడం లేదని భయం ఏమాత్రం కళ్ళల్లో లేదు. 
 

బాధను తెచ్చుకొని నటిస్తున్నాడు మరోవైపు పాపం రాధ ఊరంతా వెతుకుతూ ఉన్నది ఏ సంబంధం లేని మన ఆదిత్య కూడా వెతుకుతున్నాడు. వాడు మాత్రం హాయిగా ఇంట్లో కూర్చున్నాడు.  పిల్లలు లేరని మనం బాధపడుతుంటే పిల్లలు ఉన్నా కూడా పట్టించుకోలేని పరిస్థితి వాళ్ళది అనుకుంటారు. ఈ మాటలు విన్న సత్య, వాళ్ళు వెతుకుతున్నారు అని మీరు అనుకుంటున్నారు అదే అవకాశంతో వాళ్ళు హాయిగా గడుపుతున్నారు అని అనుకుంటుంది. ఆ తర్వాత సీన్లో రుక్మిణి దేవి కోసం వెతుకుతూ ఉంటుంది. 
 

దేవమ్మ కనిపించి ఒక దినమైంది ఎక్కడికి వెళ్లి ఉంటుంది అని అనుకుంటుంది. ఇంతలో ఆదిత్య వచ్చి, దేవి గురించి ఏమైనా తెలిసిందా అని అనగా లేదు అని అంటుంది రుక్మిణి. అప్పుడు ఆదిత్య, నిజంగానే దేవి తనంతట తానే వెళ్లిపోయింది అనుకుంటే ఇప్పటికి కచ్చితంగా దొరికే ఉంటుంది ఎవరైనా తన బలవంతంగా తీసుకెళ్లి ఉంటారా అని అనుకుంటాడు. అప్పుడు రుక్మిణి, నువ్వు ఆఫీసర్ వే కదా పోలీసులు నీ మాట వింటారు కదా కనిపెట్టలేవా అని అనగా, తప్పంతా నువ్వు చేసి, అజాగ్రత్తగా ఉండి ఎదుటి వాళ్ళని అంటున్నావ్ ఎందుకు? ఇంట్లో రాక్షసుడు ఉన్నాడని తెలుసు.

 దేవిని నాకు దక్కకుండా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాడని తెలుసు, అయినా ఇంత అజాగ్రత్తగా ఉన్నావు నీవల్లే దేవి నాకు దూరమైంది. దేవి అక్కడున్నది కాబట్టి ఇన్ని కష్టాలు పడుతుంది అదే నా దగ్గరికి వచ్చేసుంటే, నా దగ్గరే పెరుగంటే తను హాయిగా మహారాణిలా ఉండేది. ఇదంతా నీ వల్లే వచ్చింది అయినా తప్పు నాది. దేవియే నా కన్న కూతురు అని తెలిసిన వెంటనే ఎవరి గురించి ఆలోచించకుండా తీసుకువెళ్లి పోతే ఇంత జరిగేదే కాదు. దేవిని దాయల్సిన అవసరం ఇంకెవరికి ఉంటుంది ఆ మాధవ్ గాడికి తప్ప నాకు ఎందుకో వాడి మీద అనుమానంగా ఉన్నది అని ఆదిత్య అంటాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!
 

click me!