Karthika Deepam: కార్తీక్ పుట్టినరోజు జరిపి మోనితకు పెద్ద షాక్ ఇచ్చిన దీప!మోనిత మీద అనుమానంతో కార్తీక్!

First Published Oct 6, 2022, 8:02 AM IST

Karthika Deepam:బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్,కుటుంబ కథా నేపథ్యంతో కొనసాగుతూ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈరోజు అక్టోబర్ 6వ తేదీన ఏం జరుగుతుందో తెలుసుకుందాం.
 

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే..దీప,కార్తీక్ కి ,ఈరోజు మీ పుట్టినరోజు డాక్టర్ బాబు. పుట్టినరోజు శుభాకాంక్షలు అని చెప్పి పువ్వులు ఇస్తుంది. ఈ రోజు నా పుట్టినరోజా! అని కార్తీక్ అనుకుంటాడు. అప్పుడు మోనిత మనసులో, ఈరోజు కార్తీక్ పుట్టినరోజు కదా నేను ఎలా మర్చిపోయాను సరైన సమయంలో దీప నన్ను ఇరికించేసింది. పోనీ ఈరోజు నీ పుట్టినరోజు కాదు కార్తీక్ అని చెబుదామంటే ఆధార్ కార్డు ఆధారాలు ఏమైనా తీసుకొస్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది అని అనుకుంటుంది. అప్పుడు కార్తీక్, ఈరోజు నా పుట్టినరోజా మోనిత అని అనగా,అవును కార్తీక్ అని అంటుంది మోనిత.మరి నీకు ఎందుకు గుర్తులేదు చెప్పలేదు ఎందుకు అని అనగా, లేదు కార్తీక్ చేద్దామనుకున్నాను, సర్ప్రైస్ ఇద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు అని అంటుంది.అప్పుడు దీప,డాక్టర్ అమ్మ మీ పుట్టినరోజు ఇంట్లో బాగా జరుపుతుంది అనుకున్నాను. 

బెలూన్,కేకులతో ఇల్లంతా హడావిడిగా ఉంటుందనుకున్నాను కానీ మీరు ఏంటి ఇలా పడుకున్నారు అని చెప్పి, నేను ఒక చిన్న కేక్ కటింగ్ ప్లాన్ చేశాను రండి డాక్టర్ బాబు కేక్ కట్ చేయండి అని అనగా, కార్తీక్ అక్కడికి వస్తాడు ఇష్టం లేకపోయినా మోనిత కూడా వస్తుంది. అప్పుడు కార్తీక్ కేక్ కట్ చేస్తాడు. అప్పుడు దీప,గుర్తుందా డాక్టర్ బాబు కిందటి సంవత్సరం ఇదే పుట్టినరోజు రోజు నేను మీకు పర్స్ ఇచ్చాను అని అదే పర్స్ ని ఇస్తుంది దీప. నిజంగా ఇచ్చావా అని ఆ పర్స్ తీసుకుంటాడు కార్తీక్. అప్పుడు దీపా కార్తిక్ తో, మీ పుట్టినరోజు జరిపేందుకు రేపు రక్తదానం, అన్నదానం చేస్తున్నాము డాక్టర్ బాబు మీరు కచ్చితంగా రేపు రావాలి అని అనగా, ఇప్పుడు అవన్నీ ఎందుకు దీప అని కార్తీక్ అంటాడు. మీరు ఇచ్చిన డబ్బులతోనే చేస్తున్నాను డాక్టర్ బాబు మీ మంచి కోసమే అనగా సరే రేపు అంతా మీతోనే ఉంటాను అని కార్తీక్ అంటాడు.

అప్పుడు కార్తీక్ మోనితతో, అవును మోనిత, నువ్వు దీప నా వెనకాతల పడుతుంది అని అన్నావు కదా అలాంటప్పుడు ఈ  పర్స్ నాకు ఇచ్చినప్పుడు నువ్వు ఎందుకు అడ్డుకోలేదు? కిందటి సంవత్సరం కూడా నువ్వు నా పుట్టిన రోజు మర్చిపోయావా అని అనగా, లేదు కార్తీక్ నాకు గుర్తుంది.చాలా చేకటి అయింది,నాకు నిద్రొస్తుంది అని బలవంతంగా దీప దగ్గరనుంచి కార్తీక్ నీ లాక్కొని వెల్లిపోతుంది మోనిత.ఆ తర్వాత రోజు ఉదయం దీప తయారయ్యి కార్తీక్ దగ్గరికి వస్తుంది కానీ అక్కడ కార్తీక్ ఇంటికి తాళం వేసి ఉంటుంది.ఇంట్లో ఎవరూ ఉండరు అప్పుడు దీప కంగారుగా వాళ్ళ అన్నయ్య దగ్గరకు వెళ్లి అన్నయ్య, డాక్టర్ బాబు కనిపించడం లేదు. ఆ మోనిత కూడా లేదు. ఎక్కడికి వెళ్ళుంటారు ఇల్లు ఖాళీ చేసేసి ఉంటారని భయపడుతూ ఉంటుంది. 

అప్పుడు వాళ్ళ అన్నయ్య, సామాన్లు అన్నీ ఇక్కడే ఉన్నాయి కదా ఎక్కడికి వెళ్ళుండరు అని అనగా, లేదు అన్నయ్య దాని గురించి మీకు తెలీదు బయటకు వెళ్దాము అని చెప్పి తీసుకువెళ్లి ఇంకొక ఊరికి చెక్కేస్తుంది అని భయపడుతూ ఉంటుంది.మరోవైపు కారులో మోనిత, కార్తీక్ వెళ్తూ ఉండగా కార్తీక్ ఆలోచిస్తూ డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు.అప్పుడు మోనిత మనసులో, మళ్ళీ కార్తిక్ ఏం ఆలోచిస్తూ ఉంటాడు. పుట్టినరోజు గురించి ఆలోచిస్తూ ఉంటాడా? అయినా పుట్టినరోజుని ఎలా మర్చిపోయా? ఆ దుర్గ గాడి గొడవలో పడి కార్తీక్ పుట్టినరోజు మర్చిపోయాను అని అనుకుంటుంది.ఇంతలో కార్తీక్ మోనితతో, నిజంగానే నువ్వు నా పుట్టిన రోజు గుర్తుందా, లేకపోతే అబద్ధాలు ఆడుతున్నావా అని అనగా మోనిత, నిజంగానే కార్తీక్ నాకు నీ పుట్టినరోజు గుర్తున్నది అందుకే నేను వంటల వాళ్ళతో నీ పుట్టినరోజుకి వంటలు చేయించమని అడిగినప్పుడు వంటలక్క గుర్తుపట్టేసింది.
 

లేకపోతే దానికి నీ పుట్టినరోజు అని కూడా తెలియదు అని అనగా, నీకు పుట్టినరోజు గుర్తులేదు అంటే చెప్పు నమ్ముతాను కానీ ఇలాంటి కథలు అల్లోధ్దు అని కార్తీక్ అనగా, కథలు అల్లడం  ఏంటి కార్తీక్ అని మోనిత అంటుంది. నువ్వు వంట వాళ్ళకి చెప్పినట్టు అయితే వాళ్లైనా రావాలి కదా అని కార్తీక్ అంటాడు. తర్వాత మర్చిపోయాను కార్తీక్ కన్ఫర్మ్ చేయలేదు అని మోనిత తప్పించుకుంటుంది. అప్పుడు కార్తిక్, అయినా మర్చిపోయావా లేకపోతే ఇంకెవరినో దృష్టిలో పెట్టుకొని ఉండి పోయావా! అయినా ఇంట్లో, వాడు లేకపోతే నిమిషం కూడా ఉండేదాన్ని కాదు కదా ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వస్తున్నావు అని కార్తీక్ అడుగుతాడు.
 

దానికి మోనిత,నీకు చెప్తే అర్థం కాదా కార్తీక్ ఆ దుర్గకి నాకు ఎటువంటి సంబంధం లేదు. వాడు ఉన్నాడో పోయాడో కూడా నాకు తెలియదు అని అనగా కార్తీక్,ఈమధ్య చాలా వార్తలు వస్తున్నాయి ప్రియుడు కోసం మొగుడిని చంపేసిన భార్య అని కొంపతీసి నువ్వు అలాంటివి ఏమైనా ప్లాన్ చేస్తున్నావా? ఒకవేళ ప్లాన్ చేస్తే ముందే చెప్పు ఒకసారి చచ్చి బతికాను మరోసారి గతం గుర్తు లేకుండా చేస్తే బాగోదు కదా అని అంటాడు. దానికి మోనిత కోపంతో, నేను ఎందుకు అలా చేస్తాను కార్తీక్ ఇంకా ఈ టాపిక్ ఇక్కడ వదిలే అని చిరాకు పడుతుంది.
 

దానికి కార్తీక్, తప్పు చేసిన వాళ్ళని నిలదీస్తే ఇలాగే చిరాకు పడతారు అని అనగా, కార్తీక్ నీకు దండం పెడతాను ఇంకా బయలుదేరుదామా అని మోనిత అంటుంది. దానికి కార్తీక్ ,ఏ ప్లాను లేకపోతే పర్లేదు ఒకవేళ ప్లాన్ ఉన్నా నేను ఏం చేయగలను, ఒక రోజు తప్పించుకున్నా మరో రోజు దొరికి పోవాల్సిందే అని అంటాడు.దానికి మోనిత మనసులో, నిన్ను ఇంతలా ప్రేమిస్తే ఆ దుర్గ గాడు రావడం వల్ల నన్నే అనుమానిస్తున్నావా! దీప నిన్ను పదేళ్లు ఎలా భరించిందో! ఆ నరకం ఎలా చూసిందో అని అనుకుంటుంది మోనిత.
 

 ఆ తర్వాత శౌర్య, సూర్యుడు, చంద్రుడు ముగ్గురు టిఫిన్ కోసం షాప్ కి వస్తారు.అప్పుడు సౌర్య ముందు వెళ్తుండగా చంద్రమ్మ సూర్యుడుతో,డబ్బులు ఉన్నాయా అని అడుగుతుంది.ఉన్నాయి అని సూర్యుడు చెప్పగా, ఇప్పుడు ఉన్నాయి అని చెప్పి చివర్లో లేవు అంటే నేను ఇప్పుడు అంట్లు తోమలేను అని అంటుంది. ఇంతలో శౌర్య వచ్చి ఏమైంది అని అనగా ఏమీ లేదమ్మా అని అంటారు వాళ్ళు. అప్పుడు సౌర్య, మనం ఎక్కడికి వెళ్తున్నాము అని అడుగుతుంది  దానికి వాళ్లు, పక్కన సంగారెడ్డి గ్రామానికి వెళ్తున్నాం అమ్మ. అక్కడ చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి బతుకమ్మ పండుగ ని బాగా జరుపుకుంటారు.అందరూ వస్తారు అని వాళ్ళు అనగా,అయితే అమ్మానాన్నలు వచ్చే అవకాశం ఉన్నది కదా అని సౌర్య అంటుంది.ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తరువాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!

click me!