Janaki Kalaganaledu: కొత్త షాప్ ఓపెన్ చేసిన విష్ణు మల్లిక.. అఖిల్ కోసం జాబ్ చూసిన డేవిడ్?

First Published Feb 2, 2023, 11:42 AM IST

Janaki Kalaganaledu: బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు సీరియల్ మంచి కుటుంబ కథ నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కుటుంబం పరువుతో కూడిన కాన్సెప్ట్ తో ఈ సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈరోజు ఫిబ్రవరి 2వ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం..
 

ఈరోజు ఎపిసోడ్ లో రామచంద్ర స్వీట్ బండి క్లీన్ చేస్తూ ఉండగా వెన్నెల స్వీట్లు సర్దుతూ ఉంటుంది. మరోవైపు జ్ఞానాంబ దేవుడికి మొక్కుకుంటూ ఉండగా ఇంతలో జానకి అక్కడికి కాఫీ తీసుకొని వచ్చి అక్కడ పెట్టి దేవుడు ముందుకు వెళ్లి జ్ఞానాంబకు తన మనసులో మాటల్లో చెబుతూ నాకు నువ్వు తప్ప ఎవరు ఉన్నారు అమ్మ. నువ్వు కాకపోతే మా మంచి బాగు ఎవరు కోరుకుంటారు. పిల్లల తప్పులను పెద్దలు క్షమించాలి. అన్నం పెట్టిన చేతులే ఆశీర్వదించాలి. జ్ఞానాంబ వైపు చూస్తూ నువ్వు మాతో మాట్లాడకపోయినా పర్లేదు నవ్వుతూ ఆనందంగా మా వైపు చూస్తూ ఉంటే చాలు మాకు అదే పెద్ద సంతోషం అని అంటూ ఉంటుంది జానకి.

అప్పుడు జానకి మాటలకి జ్ఞానాంబ ఆలోచనలో పడుతుంది. అప్పుడు జానకి బయటికి వెళ్తూ జ్ఞానాంబ ఆశీర్వాదం తీసుకొని అక్కడి నుంచి బయటికి వెళుతుంది. ఆ తర్వాత రామచంద్ర గారు నేను రెడీ వెళ్దామా అనడంతో మీరు ఎందుకు గారు మీరు ఆటోలో వెళ్ళండి అంటాడు రామచంద్ర. అప్పుడు ఏం కాదులే రామ గారు సెంటర్ కి కాలేజ్ దగ్గరే కదా అట్నుంచి వెళ్తాను అనగా ఆ మాటలు జ్ఞానాంబ వింటూ ఉంటుంది. జానకి గారు మీరు బండి తోస్తారా వద్దులేండి అనడంతో ఇది మన బతుకు తెరువు సిగ్గు పడకూడదు సరే వెళ్దాం పదండి అని వాళ్ళిద్దరూ బండి తోసుకుంటూ వెళ్తుండగా అది చూసి జ్ఞానాంబ సంతోషపడుతూ ఉంటుంది. అప్పుడు గోవిందరాజులు అక్కడికి వచ్చి కొడుకు కోడలు బాగుపడుతుంటే చాటుగా చూసి సంతోష పడుతున్నావా అని అంటాడు.
 

వాళ్ళిద్దరూ అన్యోన్యంగా ఎంతో బాగా ఉంటారు అని గోవిందరాజులు పొగుడుతూ ఉండగా ఇంతలో వెన్నెల అక్కడికి వస్తుంది. మల్లిక వదిన్ని పిలువు అనడంతో లేదు గుడికి వెళ్ళింది అని అంటుంది వెన్నెల. చూసావా జ్ఞానం ఒకే ఇంట్లో ఉన్న ఇద్దరు కోడళ్ళ మధ్య ఎంత డిఫరెన్స్ ఉందో అని అంటాడు గోవిందరాజులు. అప్పుడు అమ్మ వెన్నెల నేను మీ అమ్మ గుడికి వెళ్లొస్తాము అనడంతో ఒక నిమిషం నాన్న అని వెన్నెల లోపలికి వెళ్లి కొబ్బరికాయ తీసుకొని వచ్చి ఇస్తుంది. అప్పుడు వాళ్ళిద్దరూ అక్కడ నుంచి బయలుదేరుతారు. మరొకవైపు మల్లిక,విష్ణు ఇంట్లో ఎవరికి తెలియకుండా కొత్త షాప్ ఓపెన్ చేయడంతో ఆ షాప్ ని చూసి మల్లిక సంతోష పడుతూ ఉంటుంది. అప్పుడు మల్లిక అక్కడ పనిచేసే వాళ్ళ మీద పెత్తనం చాలా ఇస్తూ ఉంటుంది.
 

ఇంతలోనే జానకి వాళ్ళు మల్లిక వాళ్లు షాప్ ముందుకు వచ్చి బండి నిలబెడతారు. జానకి మల్లికను లోపల చూసి ఏంటి ఇక్కడ మల్లిక ఉంది అని రామచంద్రుని పిలుచుకొని లోపలికి వెళ్తుంది. షాప్ లోపల మల్లిక కొత్తగా సీట్లో కూర్చుంటున్నగా ఇంతలో జానకి అక్కడికి వచ్చి మల్లిక  నువ్వేం చేస్తున్నావ్ ఇక్కడ అని అడుగుతుంది. అప్పుడు మల్లిక అబద్ధాలు చెబుతూ ఉండగా పక్కనే ఉన్న అతను ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు. ఆ తర్వాత జ్ఞానాంబ వాళ్లు గుడికి వెళుతూ ఉండగా అప్పుడు అమ్మవారికి జాకెట్ పీస్ కావాల్సి ఉండడంతో గోవిందరాజులు, జ్ఞానాంబ కలసి విష్ణు వాళ్ళ కొత్త బట్టల షాప్ కి వెళ్తారు. అప్పుడు అందరూ ఒక్కొక్కరుగా వస్తున్నాడంతో అది చూసి విష్ణు మల్లిక ఇద్దరు టెన్షన్ పడుతూ ఉంటారు.
 

అప్పుడు జానకి మల్లిక మీరు ఇద్దరు ఇక్కడ ఏం చేస్తున్నారు అని గోవిందరాజులు జ్ఞానాంబ బాగా అడగడంతో విష్ణు మందే కదా అమ్మ షాపు అనడంతో అప్పుడు మల్లికా అబద్ధాలు చెప్పి కవర్ చేస్తుంది. వాళ్ళ ఫ్రెండ్ షాప్ అత్తయ్య ఇక్కడ పని చేయమని చెప్పాను అని మల్లిక చెబుతుండగా అప్పుడు రామచంద్ర ఎవర్రా ఆ ఫ్రెండు అనడంతో విష్ణు తడబడుతూ ఉంటాడు. అప్పుడు మల్లికా అబద్ధాలు చెబుతూ పక్కనే పనిచేసే అతన్ని పిలుచుకొని వచ్చి మీరు షాప్ ఓనర్ అలాగే చూస్తున్నారేంటి అని అతనిని కూర్చోబెడుతుంది. అప్పుడు అతను ఆ సీట్లో కూర్చొని సంతోష పడుతూ ఉండగా జ్ఞానాంబ జానకి వాళ్లకు ఏమీ అర్థం కాకపోవడంతో అలాగే చూస్తూ ఉంటారు. అప్పుడు అమ్మవారికి జాకెట్ కావాలి అనడంతో విష్ణునే స్వయంగా ఇస్తాడు.
 

అప్పుడు డబ్బులు ఎంత అనగా వద్దులేమ్మా అనే విష్ణు అనడంతో నీకు ఫ్రెండు నీకు అమ్మకంతో షాపు అప్పగించాడు. నువ్వు అలా మన తన అని చూడకూడదు ఏవండీ డబ్బులు ఇవ్వండి అని అంటుంది జ్ఞానాంబ. అప్పుడు రామచంద్ర, జానకి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అప్పుడు జ్ఞానాంబ వాళ్లు అక్కడికి వెళ్లిపోవడంతో అప్పుడు విష్ణు 100 వైపు చూస్తూ అమ్మకి నిజం చెప్పాలని అనుకున్నాను కానీ అమ్మ చేత్తో మొదటి బోని అయింది అనుకుంటూ ఉంటాడు. అగోరించారులే ఇప్పటికైనా కొంచెం తెలుసుకోండి అని అంటుంది మల్లిక. అప్పుడు అక్కడ పనిచేసే అతను ఓనర్ సీట్ లో కూర్చుని ఉండడంతో మల్లిక కోపంగా చూడగా అతను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరొకవైపు అఖిల్, డేవిడ్ దగ్గరికి వెళ్తాడు.
 

అప్పుడు వాళ్లు ఒకరంటే ఒకరికి గిట్టదు అన్నట్టుగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఎన్ని గంటలకు రమ్మంటే ఎన్ని గంటలకు వచ్చావు అన్నంతో పిలవగానే వచ్చే అంత ఖాళీ టైం నాకు లేదు. జెస్సీ వెళ్ళమంటేనే ఇక్కడికి వచ్చాను అనడంతో పర్లేదు నా కూతురు మాటలు బాగానే వింటున్నావు అని అంటాడు పీటర్. అప్పుడు డేవిడ్ జెస్సీ మంచితనం గురించి చెబుతూ తన భర్త బాగుండాలని కోరుకుంటుంది.  నేను నా అల్లుడు బాగుండాలని కోరుకుంటున్నాను అఖిల్ మాత్రం అలాగే పొగరుగా మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు అఖిల్ అక్కడి నుంచి వెళ్ళిపోతుండగా అఖిల్ చేతిలో ఒక కొరియర్ పెడతాడు.
 

ఇక్కడే జాబ్ చూశాను రేపు వచ్చి జాయిన్ అవ్వు అని అనడంతో అఖిల్ ఇంట్లో మాటలు పడే దానికంటే ఇదే బెటర్ అనుకొని సరే అనుకుంటూ ఉంటాడు. నాకోసం జాబ్ చూసినందుకు థాంక్స్ అని అఖిల్ చెప్పడంతో నేను నీకోసం చూడలేదు నా కూతురి కోసం చూశాను అంటాడు పీటర్. నా కూతురికి ఏ కష్టం లేకుండా చూసుకో చాలు అని అంటాడు పీటర్. మరోవైపు జానకి చదువుకుంటూ ఉంటుంది.

click me!