ఈ చిత్రం తర్వాత కృతి శెట్టికి అవకాశాలు వెల్లువలా వస్తున్నాయి. వరుసగా కృతి శెట్టి శ్యామ్ సింగ రాయ్, బంగార్రాజు, ది వారియర్, మాచర్ల నియోజకవర్గం చిత్రాల్లో నటించింది. వీటిలో బంగార్రాజు మాత్రమే విజయం సాధించింది. మిగిలిన చిత్రాలన్నీ నిరాశపరిచాయి. రీసెంట్ గా విడుదలైన నితిన్ మాచర్ల నియోజకవర్గం చిత్రం బాక్సాఫీస్ వద్ద ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది.