ఆ మూవీ చూస్తే చాలు కన్నీళ్లు వస్తాయి.. విశ్వనాథ్ గారిని తలుచుకుంటూ, ఆ హీరోయిన్ తో ఎమోషనల్ గా చిరు

First Published Feb 3, 2023, 10:58 AM IST

కళాతపస్వి కె. విశ్వనాథ్ గారి మరణంతో టాలీవుడ్ మొత్తం దిగ్బ్రాంతికి గురైంది. దేశం నలుమూలల సినీ ప్రముఖుల నుంచి విశ్వనాథ్ గారి మృతి పట్ల సంతాపాలు వ్యక్తం అవుతున్నాయి.

K Viswanath

కళాతపస్వి కె. విశ్వనాథ్ గారి మరణంతో టాలీవుడ్ మొత్తం దిగ్బ్రాంతికి గురైంది. దేశం నలుమూలల సినీ ప్రముఖుల నుంచి విశ్వనాథ్ గారి మృతి పట్ల సంతాపాలు వ్యక్తం అవుతున్నాయి. తన ప్రతి చిత్రంలో కళాత్మకత, భారతీయత, తెలుగుదనం ఉండేలా చేయడం ఆయన ప్రత్యేకత. చిరంజీవి, కమల్ హాసన్, వెంకటేష్ లాంటి హీరోలతో ఎన్నో అద్భుతమైన చిత్రాలు తెరక్కించారు. 

అనారోగ్యం కారణంగా గురువారం రోజు ఆయన తుదిశ్వాస విడిచారు. మెగాస్టార్ చిరంజీవితో కె విశ్వనాథ్.. శుభలేఖ, ఆపద్భాంధవుడు, స్వయంకృషి లాంటి క్లాసిక్ చిత్రాలని తెరకెక్కించారు. శుభలేఖ చిత్రానికి ఆయన నంది అవార్డు కూడా దక్కించుకున్నారు. మెగాస్టార్ చిరంజీవికి, కళాతపస్వితో విడదీయరాని అనుబంధం ఉంది. తన రీ ఎంట్రీ చిత్రం ఖైదీ నెంబర్ 150 సమయంలో చిరంజీవి.. రోజాతో ఇంటర్వ్యూలో పాల్గొన్న సంగతి తెలిసిందే. 

ఆ ఇంటర్వ్యూలో చిరు.. కళాతపస్వి గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి. మీ చిత్రాల్లో కాకుండా మీకు బాగా నచ్చిన చిత్రం ఏంటి అని రోజా చిరంజీవిని ప్రశ్నించింది. దీనికి చిరు సమాధానం ఇస్తూ.. కె విశ్వనాథ్ గారి శంకరాభరణం అని చెప్పారు. ఆ చిత్రం చూసిన ప్రతిసారి కన్నీళ్లు వస్తాయి. అది ట్రాజిడీ మూవీ కూడా కాదు. కానీ ఆ చిత్రంలోని ఎమోషన్ నన్ను కట్టిపడేస్తుంది అని చిరు అన్నారు. 

శంకరాభరణం చిత్రం విశ్వనాథ్ గారి కెరీర్ లో ఒక మైలురాయి. ఆ చిత్రం జాతీయ అవార్డు కూడా సొంతం చేసుకుంది. తాను ఎంతో మంది దర్శకులతో పనిచేసినప్పటికీ.. దర్శకత్వ ప్రతిభ పరంగా తనకి విశ్వనాథ్, బాలచందర్ అంటే ఇష్టం అని చిరంజీవి రోజాతో అన్నారు. 

ఇప్పుడు కళాతపస్వి మరణవార్త విని చిరంజీవి దిగ్బ్రాంతికి గురయ్యారు. పితృ సమానులు కళాతపస్వి కె విశ్వనాథ్ గారు ఇలా లేరనే వార్త ఎంతో దిగ్బ్రాంతికి గురిచేసింది. మా ఇద్దరిది తండ్రి కొడుకుల అనుబంధం. సున్నితమైన ఆర్ట్ ఫిలిమ్స్ ని కూడా బ్లాక్ బస్టర్స్ చేసిన ఘనత ఆయనకి మాత్రమే సొంతం. 43 ఏళ్ల క్రితం ఆయన ఐకానిక్ చిత్రం శంకరాభరణం విడుదలైన రోజేనే శంకరుడికి ఆభరణంగా కైలాసానికి ఏతెంచారు అని చిరంజీవి తన సంతాపం తెలిపారు. 

కళాతపస్వికిని కడసారి చూసేందుకు, నివాళులు అర్పించేందుకు తెలుగు సినీ ప్రముఖులు ఆయన నివాసానికి క్యూ కట్టారు. అభిమానులు విశ్వనాథ్ గారు మధురమైన చిత్రాలని గుర్తు చేసుకుంటున్నారు. 

click me!