పేరెంట్స్ కోసం చమ్మక్‌ చంద్ర రూ.కోటీతో ఇళ్లు.. శ్రీదేవి, శేఖర్‌ మాస్టర్‌, లాస్య తండ్రులను తలచుకుని ఎమోషనల్‌..

First Published Jun 19, 2021, 9:13 PM IST

`జబర్దస్త్` కమెడీయన్‌ చమ్మక్‌ చంద్ర తమ ఫేరెంట్స్ పై ఉన్న ప్రేమని చాటుకున్నారు. కోటి రూపాయలతో వారికోసం లగ్జరీ ఇళ్లు కట్టిస్తున్నాడు. మరోవైపు ఫాదర్స్  ని తలచుకుని శేఖర్‌ మాస్టర్‌, శ్రీదేవి, లాస్య, ప్రియాంక కంటతడి పెట్టుకున్నారు. 
 

ఆదివారం(జూన్‌ 20) ఫాదర్స్ డే. ఈ సందర్భంగా `స్టార్‌ మా`లోని `కామెడీ స్టార్స్ ` షోలో తండ్రులను తలచుకున్ని కన్నీళ్లు పెట్టుకున్నారు జడ్జ్ లు శేఖర్‌ మాస్టర్‌, నటి శ్రీదేవి. యాంకర్ లాస్య, మరోవైపు కమెడీయన్లు చమ్మక్‌ చంద్ర, ప్రియాంక సైతం తమ తండ్రులను గుర్తు చేసుకుని ఎమోషనల్‌ అయ్యారు.
undefined
శ్రీదేవి అంటే తనకు చాలా ఇష్టమని, తనకు చాలా క్లోజ్‌ అని తెలిపింది. డాడీ అంటే తనకు లైఫ్‌ అని చెప్పింది. డాడీ గురించి చెప్పాలంటే ఏడుపొస్తుందని వెల్లడించింది శ్రీదేవి.
undefined
ఈ సందర్భంగా డాడీకి గట్టిగా ఓ ముద్దుచ్చింది. తండ్రితో ఉన్న అనుబంధాన్ని పంచుకుంది. శ్రీదేవి తండ్రి సీనియర్‌ నటుడు విజయ్‌ కుమార్‌ అనే విషయం తెలిసిందే.
undefined
జడ్జ్ గా ఉన్న శేఖర్‌ మాస్టర్‌ స్పందిస్తూ, ఫిఫ్త్‌ క్లాస్‌లో ఉన్నప్పుడే వాళ్ల నాన్నగారు చనిపోయారని చెప్పి అందరి హృదయాలను బరువెక్కించారు.
undefined
స్వతహాగా ఎన్నో కష్టాలు పడి ఇక్కడి వరకు వచ్చానని చెప్పాడు శేఖర్‌ మాస్టర్. ఇప్పుడు హ్యాపీ అని తెలిపాడు. శేఖర్‌ మాస్టర్‌ జూనియర్‌ అసిస్టెంట్‌ నుంచి కెరీర్న్‌ ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇప్పుడు టాలీవుడ్‌లో టాప్‌ కొరియోగ్రాఫర్‌లో ఒకరు.
undefined
ఇక చమ్మక్‌ చంద్ర ఊర్లో ఉన్న తన అమ్మా నాన్నల కోసం కోటి రూపాయలతో లగ్జరీగా ఇళ్లు కట్టిస్తున్నాడట. అమ్మానాన్న చివరి రోజుల్లో నా ఇంట్లో ఉండాలని తాను కోరుకుంటున్నట్టు చెప్పింది.
undefined
తాను ఊర్లో ఉండేది లేదు, కానీ వారి కోసమే స్పెషల్‌గా ఇల్లు కట్టిస్తున్నట్టు చెప్పి అందరి మనసులను గెలుచుకున్నాడు చమ్మక్‌ చంద్ర. తన అమ్మానాన్నళ్లు, తమ్ముళ్ల కోసం తాను చచ్చిపోతానని వారిపై తనకున్న ప్రేమని పంచుకున్నాడు.
undefined
యాంకర్‌ లాస్య తనకు వాళ్ల నాన్నంటే ఓ ధైర్యమని, ఆయనే ఓ సైన్యమని చెప్పింది. నాన్న గురించి చెబుతూ కన్నీళ్లుపెట్టుకుంది. తన లైఫ్‌ లో ఏం జరిగినా తన కోసం వాళ్ల నాన్న ఉన్నాడని తెలిపింది లాస్య.
undefined
నాన్నంటే తనకు చాలా ఇష్టమని, నాన్నకి లవ్యూ చెప్పి అందరి మనసుని గెలుచుకుంది లాస్య.
undefined
ఒకప్పుడు `జబర్దస్త్` కమెడీయన్‌గా రాణించి జెండర్(లింగ మార్పిడి) చేసుకున్న ప్రియాంక తన నాన్నకి చిన్నప్పుడే కళ్లు పోయాయని తెలిపింది. తాను జెండర్‌ మార్చుకున్నాననే విషయం వాళ్ల నాన్నకి తెలియదని, తెలిస్తే ఏం జరుగుతుందో తెలియదు. ఒక్కసారి నాన్నని గట్టిగా పట్టుకుని హగ్‌ చేసుకోవాలని, ఏడ్వాలని ఉందంటూ కన్నీళ్లు పెట్టుకుంది ప్రియాంక.
undefined
ఫాదర్స్ డే సందర్బంగా కమెడీయన్స్, జడ్జ్ లు తమ నాన్నలతో అనుబంధాన్ని పంచుకుంటూ షోని భావోద్వేగభరితంగా మార్చారు. ఇది రేపు(ఆదివారం) మధ్యాహ్నం ప్రసారం కానుంది.
undefined
click me!