లాల్ సింగ్ చద్దా సినిమా పరాజయం తరువాత, అమీర్ ఖాన్ కొన్నాళ్ళు సినిమా నుండి విరామం తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అంతే కాదు అప్పటినుంచి అతను ఏ సినిమాను కమిట్ అవ్వలేదు. రీసెంట్ గా తన కూతురు ఇరాఖాన్ వివాహం ఘనంగా నిర్వహించారు ఆమీర్ ఖాన్. ఇండియాలోని అన్ని పరిశ్రమల నుంచి ఎంతో మంది సెలబ్రిటీలు ఈ పెళ్ళికి హాజరయ్యారు.