ఆ హీరోయిన్లు మగవాడి ఆశలకు లొంగుతున్నారు.. అందుకే అవకాశాలుః బిగ్‌బాస్‌ ఫేమ్‌ మీరా మిథున్‌ సంచలన వ్యాఖ్యలు

First Published Aug 13, 2021, 8:47 AM IST

ఇటీవల దళితులను సినిమాల్లోకి రానివ్వొద్దంటూ సంచలన వ్యాఖ్యలు చేసి వివాదాల్లో ఇరుక్కున్న బిగ్‌బాస్‌ నటి మీరా మిథున్‌ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సినిమాల్లో రానించాలంటే అందుకు ఒప్పుకోవాలని బోల్డ్ కామెంట్‌ చేశారు. 
 

చిత్ర పరిశ్రమలో మగవాడి ఆశలకు లొంగితేనే అవకాశాలు వస్తాయని, అందుకే ఇతర రాష్ట్రాల హీరోయిన్లు విజయాలు సాధిస్తున్నారని వ్యాఖ్యానించింది. నటి, మోడల్, బిగ్‌ బాస్‌ ఫేం మీరా మిథున్‌ గతవారం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీతో పాటుగా ఏడు సెక్షన్లతో కేసులు ఆమె మీద నమోదు అయ్యాయి. 

ఈ పరిస్థితుల్లో గురువారం ఆమె విడుదల చేసిన వీడియో  వైరల్‌గా మారడమే కాదు, మరో వివాదాన్ని రేపింది. ఈ మేరకు విడుదల చేసిన వీడియోలో ప్రధాని నరేంద్రమోదీ, సీఎం ఎంకే స్టాలిన్‌లకు విజ్ఞప్తి చేస్తూ, తనకు రక్షణ కల్పించాలని వేడుకున్నారు. 
 

తమిళనాడు బిడ్డగా, ఓ సామాజిక వర్గానికి చెందిన మహిళ నైన తాను అనేక ఇబ్బందుల్ని ఇక్కడ ఎదుర్కొంటున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఏది చేసినా, ఏమి చెప్పినా వివాదం చేస్తున్నారని పేర్కొన్నారు.
 

తనను వేధించిన ఆ ఒక్క వ్యక్తిని ఉద్దేశించి స్పష్టంగా వ్యాఖ్యలు చేస్తే, దానిని ఓ సామాజిక వర్గాన్ని కించ పరిచినట్లుగా చిత్రీకరించారని వివరించారు. తనకు వ్యతిరేకంగా సాగుతున్న పరిణామాల్ని అడ్డుకోవాలని, ఇందుకు ముగింపు పలికేందుకు సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. 
 

ఇక, పోలీసుల్ని ఉద్దేశించి మరికొన్ని వ్యాఖ్యలు చేశారు. తనకు వ్యతిరేకంగా, తన మీద అతి నీచాతి నీచంగా, అసభ్య పదజాలాలతో సామాజిక మాధ్యమాల వేదికగా విమర్శలు, ఆరోపణలు, చర్చలు సాగుతున్నాయని, వీటి మీద ఎందుకు దృష్టి పెట్టలేదని ప్రశ్నించారు.

తాను చేసిన వ్యాఖ్యలను బూతద్దంలో పెట్టి వివాదంగా మార్చిన వారికి వత్తాసు పలుకుతూ కేసులు పెట్టారని మండిపడ్డారు. మహిళనైన తన మీద  సామాజిక మాధ్యమాల వేదికగా సాగుతున్న  దాడి విషయంలో ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. తనను అరెస్టు చేయలేరంటూ పోలీసులకు సవాల్‌ చేయడం గమనార్హం. 

దీంతో ఈ వ్యాఖ్యలు ఇప్పుడు మరింత దుమారాన్ని రేపుతున్నాయి. హీరోయిన్లు, నెటిజన్లు, సినిమా వర్గాలు మీరాపై దారుణంగా కామెంట్లు చేస్తున్నారు. ఆమె వ్యాఖ్యలను ఖండిస్తూ పోస్ట్ లు పెడుతున్నారు. సోషల్‌ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. మరి ఈ కొత్త వివాదం నుంచి ఎలా బయటపడుతుందో చూడాలి. 

click me!