అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న బిగ్ బాస్ విన్నర్ అభిజీత్.. సినిమాలకు గుడ్ బై అంటూ ఫ్యాన్స్ కి షాకిచ్చిన యువహీరో

First Published Sep 15, 2021, 12:06 PM IST

క్లాసిక్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల కాంపౌండ్ ద్వారా వెండితెరకు పరిచయమయ్యాడు అభిజీత్. వీరి కాంబినేషన్ లో వచ్చిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, ఫీల్ గుడ్ మూవీగా నిలిచింది. అయితే కమర్షియల్ గా హ్యాపీ డేస్ తరహాలో విజయం సాధించలేదు. 

లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ మూవీ తరువాత అభిజీత్ నటించిన ఒకటి రెండు చిత్రాలు అనుకున్నంత విజయం సాధించలేదు. అభిజీత్ అనే ఒక హీరో ఉన్నాడన్న విషయం ప్రేక్షకులు మరచిపోగా, బిగ్ బాస్ షో ఆయనకు బ్రేక్ ఇచ్చింది.

గత ఏడాది ప్రసారమైన బిగ్ బాస్ సీజన్ 4 విన్నర్ గా నిలిచిన అభిజీత్ ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు. అభిజీత్ గేమ్ ప్రేక్షకులను ఆకట్టుకోగా, ఆయనకు ఫ్యాన్ బేస్ ఏర్పడింది. టైటిల్ విన్నర్ గా నిలిచిన అభిజీత్ వరుస ఆఫర్స్ తో వెండితెరపై దూసుకుపోతారని అందరూ ఊహించారు. 

అనూహ్యంగా ఆయన టైటిల్ అందుకొని పది నెలలు గడుస్తున్నా ఒక్క చిత్రం కూడా ప్రకటించలేదు. ఇదే సీజన్ లో పాల్గొన్న సోహైల్ మూవీ చేస్తుండగా, రన్నర్ అఖిల్ తో పాటు మోనాల్, అరియానా కెరీర్స్ ఆశాజనకంగా సాగుతున్నాయి. 

కథలు వింటున్న అభిజీత్ త్వరలో మూవీపై అధికారిక ప్రకటన చేయనున్నట్లు పలుమార్లు వార్తలు వెలువడ్డాయి. ఒకేసారి ఆయన మూడు చిత్రాలు ఓకె చేశారంటూ కూడా కథనాలు రావడం జరిగింది. అయితే అవి వార్తల వరకే పరిమితం అయ్యాయి. 

లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ మూవీ తరువాత అభిజీత్ నటించిన ఒకటి రెండు చిత్రాలు అనుకున్నంత విజయం సాధించలేదు. అభిజీత్ అనే ఒక హీరో ఉన్నాడన్న విషయం ప్రేక్షకులు మరచిపోగా, బిగ్ బాస్ షో ఆయనకు బ్రేక్ ఇచ్చింది.

ఈ సందేహాలన్నింటికీ అభిజీత్ సోషల్ మీడియా వేదికగా సమాధానం చెప్పారు. అదే విధంగా ఫ్యాన్స్ కి భారీ షాక్ ఇచ్చారు. ట్విట్టర్ ద్వారా అభిమానులతో చిట్ ఛాట్ చేసిన అభిజీత్, తనకు ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు వెల్లడించారు. 

click me!