బిగ్ బాస్ లవర్స్ కి గుడ్ న్యూస్... ఓటీటీ వెర్షన్ కి రంగం సిద్ధం, కంటెస్టెంట్స్ ఎవరంటే?

First Published Dec 23, 2023, 7:21 AM IST


బిగ్ బాస్ సీజన్ 7 గతవారం ముగిసిన విషయం తెలిసిందే. బిగ్ బాస్ ప్రేమికులు ఈ క్రేజీ షో కోసం ఏడాది పాటు వెయిట్ చేయాలి. అయితే సీజన్ 7 సక్సెస్ నేపథ్యంలో ఓటీటీ వెర్షన్ సిద్ధం చేస్తున్నారట. 
 

Bigg boss telugu ott season 2

బిగ్ బాస్ రియాలిటీ షోపై విపరీతమైన నెగిటివిటీ ఉంది. అదే స్థాయిలో ఆదరణ కూడా ఉంది. ఈ మధ్య పల్లెటూరి జనాలు, పెద్దవాళ్ళు కూడా ఈ షోకి కనెక్ట్ అవుతున్నారు. ఇక పోతే బిగ్ సీజన్ 7 భారీ విజయం అందుకుంది. మంచి టీఆర్పీ రాబట్టింది. డిసెంబర్ 17న బిగ్ బాస్ తెలుగు 7 గ్రాండ్ ఫినాలే ముగిసింది. 
 

Pallavi Prashanth


బిగ్ బాస్ సీజన్ 7 టైటిల్ విన్నర్ గా పల్లవి ప్రశాంత్ నిలిచాడు. కామనర్ హోదాలో హౌస్లో అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్ టైటిల్ కొట్టడం ఊహించని పరిణామం. సెలెబ్రిటీలను వెనక్కి నెట్టి రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ విన్నర్ అయ్యాడు. అమర్, ప్రశాంత్ మధ్య టైటిల్ పోరు నడిచింది. రైతుబిడ్డదే పై చేయి అయ్యింది. 

Latest Videos


అయితే షో ముగిశాక కూడా సంచనాలు చోటు చేసుకున్నాయి. పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ నా బీభత్సం చేశారు. ప్రైవేట్, పబ్లిక్ ప్రాపర్టీ ధ్వంసం చేశారు. పల్లవి ప్రశాంత్ సైతం పోలీసుల సూచనలు పట్టించుకోకుండా ఫ్యాన్స్ తో ర్యాలీ చేశారు. దీనిపై సీరియస్ అయిన పోలీసులు పలు సెక్షన్స్ క్రింద కేసులు నమోదు చేశారు. అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు. తర్వాత బెయిల్ పై బయటకు వచ్చాడు. 
 

Bigg boss telugu ott season 2

ఇదిలా ఉంటే.. బిగ్ బాస్ సీజన్ 8 కోసం ఏడాది పాటు ఫ్యాన్స్ వెయిట్ చేయాల్సి ఉంది. అయితే వాళ్ళను ఎంటర్టైన్ చేసేందుకు బిగ్ బాస్ ఓటీటీ వచ్చేస్తుందట. బిగ్ బాస్ సీజన్ 7 సక్సెస్ నేపథ్యంలో బిగ్ బాస్ ఓటీటీకి ఏర్పాట్లు చేస్తున్నారట. 
 

Bigg boss telugu ott season 2


బిగ్ బాస్ నాన్ స్టాప్ పేరుతో గతంలో ఒక సీజన్ ప్రసారం అయ్యింది. బిందు మాధవి టైటిల్ విన్నర్ అయ్యింది. నాగార్జున హోస్టింగ్ చేశారు. ఇక త్వరలో సీజన్ 2 స్టార్ట్ కానుందట. కంటెస్టెంట్స్ ఎంపిక ప్రక్రియ కూడా మొదలైందట. 

నాగార్జున మరలా హోస్ట్ గా సందడి చేయనున్నారట. కాగా బిగ్ బాస్ షోతో మంచి కంటే చెడే ఎక్కువ జరుగుతుంది. సెలెబ్రిటీల మీద ఒకప్పటి అభిప్రాయం మారిపోతుంది. వీరి నిజస్వరూపం ఇదా అంటూ... జనాలు వాపోతున్నారు. అందుకే పేరున్న కంటెస్టెంట్స్ పాల్గొనడం లేదు. 

బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్ 2 ఓటీటీ వెర్షన్ కాగా... టాప్ సెలెబ్స్ ఆసక్తి చూపే అవకాశం లేదంటున్నారు. అగ్గి పెట్టి మచ్చ, ఉప్పల్ బాలు వంటి సోషల్ మీడియా సెలెబ్స్ లాగించేయవచ్చు. ఇక బిగ్ బాస్ ఓటీటీ సీజన్ పై ఎలాంటి అధికారిక సమాచారం లేదు. సోషల్ మీడియాలో మాత్రం ప్రచారం జరుగుతుంది. 

click me!