బిగ్ బాస్ హౌస్ నుండి ఉమాదేవి అవుట్? ఫలితం ఇవ్వని లోబోతో ప్రేమాయణం?

First Published Sep 19, 2021, 8:32 AM IST

బిగ్ బాస్ సీజన్ 5 సక్సెస్ ఫుల్ గా రెండవవారం ముగించనుంది. కంటెస్టెంట్స్ మధ్య హాట్ హాట్ చర్చలు, వాడి వేడి వాగ్వాదాలు, బలప్రయోగాలతో సాగిన బిగ్ బాస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. 

ఇక ఆదివారం వచ్చిందంటే హౌస్ నుండి ఒకరిని బయటికి పంపించేస్తాడు బిగ్ బాస్. మొదటి వారం యూట్యూబర్ సరయు ఎలిమినేట్ కాగా, ఈ వారం ఎలిమినేషన్స్ కి మొత్తం ఏడుగురు నామినేట్ అయ్యారు. 

శనివారం ప్రియాంక, లోబో, అని మాస్టర్స్ సేవ్ కాబడ్డారు. కింగ్ నాగార్జున నాటకీయంగా వారు సేవ్ అయినట్లు తెలియజేశారు. ఇక మిగిలింది నలుగురు కంటెస్టెంట్స్. ఉమాదేవి, నటరాజ్ మాస్టర్, ప్రియ, ఆర్జే కాజల్ పై ఎలిమినేషన్ కత్తి వేలాడుతుంది. 

ఎలిమినేషన్ లిస్ట్ లో ఉన్న ఈ నలుగురిలో ఉమాదేవి ఇంటి నుండి బయటికి రానున్నారని గట్టిగా వినిపిస్తుంది.  ఉమాదేవి ని బిగ్ బాస్ ఇంటి నుండి బయటికి పంపించేందుకు సిద్ధం అయ్యారట. 


వాదోపవాదాల సమయంలో బూతుల పంచాంగం అందుకుంటున్న ఉమాదేవి పై ప్రేక్షకులలో వ్యతిరేకత ఉందని, దానితో ఆమెకు బిగ్ బాస్ గుడ్ బై చెబుతున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. 


హౌస్ లో ఎలాగైనా ఎక్కువ కాలం ఉండాలని ఉమాదేవి... యాంకర్ లోబోతో లవ్ ట్రాక్ నడుపుతున్నారు. లోబో సైతం ఆమెను విడిది ఉండలేను అన్నట్లు ప్రవరిస్తున్నాడు. నిన్న నాగార్జున ఉమాదేవి సేవ్ అవుతుండగా అని లోబోని అడుగుగా.. నా పొట్టి నాకు కావాలి సర్. . అంటూ కన్నీరు పెట్టుకున్నారు. 


ఇక బిగ్ బాస్ హౌస్ లో సీనియర్ ఆర్టిస్ట్స్ ఎక్కువ కాలం ఉండలేక పోతున్నారు. ప్రేక్షకులు రెండు మూడు వారాల లోపే వారిని ఇంటికి పంపించేస్తున్నారు. గతంలో నటి హేమ, కరాటే కళ్యాణి... ఇలాగే తక్కువ సమయంలో హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యారు. 

click me!