రవి, నీ యాటిట్యూడ్ నీ దగ్గరే పెట్టుకో..ఎలిమినేషన్ నామినేషన్స్ హీట్ లో కంటెస్టెంట్స్ మధ్య గొడవలు!

First Published Sep 6, 2021, 3:36 PM IST


బిగ్ బాస్ సీజన్ 5 గ్రాండ్ గా మొదలైంది. ఈ సీజన్ కి గాను మొదటిరోజు 19మంది కంటెస్టెంట్స్ హౌస్లోకి ఎంటర్ అయ్యారు. యాంకర్ రవి, నటి ప్రియ, యూట్యూబర్ షణ్ముఖ్, నటుడు విశ్వ, నటి ఉమాదేవి, యాని మాస్టర్ ఇలా టాప్ సెలెబ్రిటీలు కంటెస్టెంట్స్ లిస్ట్ లో ఉన్నారు. 


సోమవారం కావడంతో ఈ వారం ఎలిమినేషన్స్ కి సంబంధించిన ప్రక్రియ మొదలైపోయింది. నామిషన్స్ కి సంబంధించిన టాస్క్ లో కంటెస్టెంట్స్ మధ్య వాడి వేడి వాదనలు మొదలైపోయాయి. కంటెస్టెంట్స్ మధ్య మనస్పర్థలకు నామినేషన్స్ ప్రక్రియ ప్రధానంగా నిలుస్తుంది. 

కంటెస్టెంట్స్ ఫొటోలు ముద్రించిన గార్బేజ్ బ్యాగ్స్, గార్డెన్ ఏరియాలో ఉంచిన బిగ్ బాస్... తమకు నచ్చని కంటెస్టెంట్ ఫోటో ఉన్న బ్యాగ్ చెత్త బండిలో తగు కారణం చెప్పి వేయాలని, బిగ్ బాస్ ఆదేశించారు. ఈ  టాస్క్ లో తమకు నచ్చని కంటెస్టెంట్స్ ఫోటో ఉన్న బ్యాగ్ ని కంటెస్టెంట్స్ చెత్త బండిలో వేశారు. 


లోబో యాంకర్ రవి ఫోటో ఉన్న బ్యాగ్ వేశాడు. అదే సమయంలో నీ యాటిట్యూడ్ నీ దగ్గరే పెట్టుకో అంటూ ఘాటు కామెంట్ చేశాడు. సరయు బ్యాగ్ ని నటి లహరి, షణ్ముఖ్ బ్యాగ్ ని వీజే సన్నీ, జెస్సి బ్యాగ్ ని విశ్వ చెత్త బండిలో వేయడం జరిగింది. 

మీరు నాకు స్ట్రిక్ట్ గా అనిపిస్తున్నారంటూ నటరాజ్ మాస్టర్ బ్యాగ్ ని యాంకర్ రవి చెత్త బండిలో వేశాడు. నాకు నీలా నటించడం  రాదంటూ నటరాజ్ రవికి కౌంటర్ ఇచ్చాడు. ఈ ప్రక్రియలో లహరి, సరయు, జెస్సి, విశ్వల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. 
 

వారం రోజుల వ్యవధిలో ఎవరు కరెక్ట్, ఎవరు కరెక్ట్ కాదని నిర్ణయించడం కష్టమే. ఏది ఏమైనా ప్రతివారం ఒకరు ఎలిమినేట్ కావాలి కాబట్టి ప్రక్రియ మొదలైంది. కంటెస్టెంట్స్ చేత అత్యధికంగా రిజెక్ట్ కాబడిన కంటెస్టెంట్స్ ఎలిమినేషన్ కి నామినేట్ అవుతారు. 

click me!