శివాజీ కొత్త ప్రాజెక్ట్స్ కి సైన్ చేస్తున్నారని సమాచారం. ఈ క్రమంలో శివాజీ సోషల్ మీడియా పోస్ట్ వైరల్ గా మారింది. దర్శకుడు తరుణ్ భాస్కర్ తో శివాజీ కనిపించాడు. ఆ ఫోటోకి త్వరలో సర్ప్రైజ్ అని క్యాప్షన్ ఇచ్చాడు. ఇది నెటిజెన్స్ ని ఆకర్షించింది. శివాజీ, తరుణ్ భాస్కర్ క్రికెట్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఏదైనా సినిమా లేదా వెబ్ సిరీస్లో భాగంగా వీరిద్దరూ కలిశారా? లేక సెలబ్రిటీ క్రికెట్ లీగ్ కోసం ప్రాక్టీస్ చేస్తున్నారా? అనే సందేహాలు నెటిజెన్స్ వ్యక్తం చేస్తున్నారు.