
హైదరాబాద్ : ఉప్పల్ బాలు... సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపించే పేరు. అమ్మాయిలా హావభావాలు ప్రదర్శించే ఇతడు ఇప్పుడు సెలబ్రిటీ. సోషల్ మీడియా ద్వారా వచ్చిన పాపులారిటీని అలాగే నిలబెట్టుకుంటూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పటికే పలు టీవి షోలలో కనిపించిన ఉప్పల్ బాలు...బయట ప్రైవేట్ ఈవెంట్స్, శుభకార్యాల్లో కూడా పాల్గొంటుంటాడు. ఇలా తనకు సోషల్ మీడియా ద్వారా దక్కిన గుర్తింపునే కెరీర్ గా మలుచుకున్నాడు ఉప్పల్ బాలు.
అయితే ప్రస్తుతం తెలంగాణలో లోక్ సభ ఎన్నికల వేళ ఉప్పల్ బాలు కొత్త అవతారం ఎత్తాడు. తన సహచరుడు వైజాగ్ సత్యతో కలిసి ఉప్పల్ బాలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నాడు. ఈ కండువాతోనే కాంగ్రెస్ కు మద్దతుగా ఓ వీడియోను రూపొందించి సోషల్ మీడియాలో పెట్టాడు బాలు. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది.
తనకు రేవంత్ రెడ్డి అంటే ఎంతో ఇష్టమని... చాలాకాలంగా ఆయనను అభిమానిస్తున్నానని బాలు తెలిపారు. రేవంత్ తెలంగాణ ముఖ్యమంత్రి కావడంతో తాను ఎంతగానో ఆనందించానని అన్నాడు. ఈ ఎన్నికల్లోనూ తమ మద్దతు కాంగ్రెస్ పార్టీకే అని ఉప్పల్ బాలు తెలిసాడు. ఇలా లోక్ సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ కు మద్దతుగా నిలిచి తన స్లైల్లోనే ప్రచారం చేస్తున్నాడు బాలు.
కాంగ్రెస్ కండువాతో కనిపించిన ఉప్పల్ బాలు వీడియోపై నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. చివరకు ఉప్పల్ బాలు కూడా పొలిటీషన్ అయిపోయాడని కొందరు... రాజకీయాల్లో ఇంకెన్ని చూడాలో అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఏదైమైనా ఉప్పల్ బాలు పార్టీ కండువాతో కనిపిస్తున్న వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.