సిరి, శ్రీహాన్‌ ల మధ్య చిచ్చు పెట్టిన సోహైల్‌.. ఓ నైట్‌ కూకట్‌ పల్లిలో అమ్మాయితో చూశానంటూ బాంబ్‌..

First Published Nov 26, 2022, 11:54 PM IST

సోహైల్‌.. శ్రీహాన్‌ కొంప ముంచాడు. ఇనయ కోసం వచ్చి సిరికి, తనకు మధ్య రిలేషన్‌లో చిచ్చు పెట్టే ప్రయత్నం చేశాడు. కూకట్‌పల్లిలో అమ్మాయితో చూశానని చెప్పి పెద్ద షాకిచ్చాడు. 
 

బిగ్‌ బాస్‌ 4 పాపులర్‌ కంటెస్టెంట్‌, రియల్‌ విన్నర్‌గా నిలిచిన సోహైల్‌(Sohel) సయ్యద్‌ మరోసారి బిగ్‌ బాస్‌ షోలో సందడి చేశాడు. ఆయన ఇనయ కోసం బిగ్‌ బాస్‌ 6(Bii Boss 6)లో అడుగుపెట్టాడు. ఈ సందర్బంగా ఆసక్తికర విషయాలను పంచుకోవడంతోపాటు తనదైన స్టయిల్‌లో రచ్చ చేశాడు. అదే సమయంలో సిరి(Siri), శ్రీహాన్‌ (Srihan)ల మధ్య నిప్పు పెట్టిపోయాడు. దీంతో ఇప్పుడిది హాట్‌ టాపిక్ అవుతుంది. 
 

ఇనయ కోసం వచ్చిన సోహైల్‌ శ్రీహాన్‌ గురించి సీక్రెట్‌లు బయటపెట్టాడు. గత సీజన్‌లో శ్రీహాన్‌ ప్రియురాలు, కాబోయే భార్య సిరి పాల్గొన్న విషయం తెలిసిందే. అయితే సిరి బిగ్‌ బాస్‌ హౌజ్‌లో ఉండగా, శ్రీహాన్‌ బయట అమ్మాయిలతో తిరుగుతున్నాడని తెలిపారు. ఓ సారి కూకట్‌ పల్లిలో ఓ కాఫీ షాప్‌లో అమ్మాయితో చూశానని తెలిపారు. ప్రియాంక అనే అమ్మాయితో కనిపించాడని చెప్పి షాకిచ్చాడు. 

సిరితో కాకుండా మరో ఇద్దరు ముగ్గురు అమ్మాయిలతో చూశానంటూ బాంబ్‌ పేల్చాడు. దీంతో శ్రీహాన్‌ దాన్ని కవర్‌ చేసుకునేందుకు నానా కష్టాలు పడ్డారు. అది షూటింగ్ లోనే కలిశామని, తనకు నాకు ఎలాంటి సంబంధం లేదని వివరణ ఇచ్చుకున్నాడు. కానీ సోహైల్ మరింత గట్టిగా ఇరికించేలా ఇతర విషయాలను కూడా పంచుకోవడంతో శ్రీహాన్‌ తడబటడం విశేషం. అంతేకాదు సిరి బయట ఉంటే ఎక్కడ ఉన్నావో చెప్పాల్సి వచ్చేదని, వీడియో కాల్‌ చేసేదని, కానీ హౌజ్‌లో ఉండటంతో ఓ అమ్మాయితో టూర్‌ వెళ్లాడని తెలిపాడు సోహైల్‌. 
 

అయితే తాను ఒంటరిగానే టూర్‌ వెళ్లానని వివరణ ఇచ్చాడు శ్రీహాన్‌. అదే సమయంలో బయట ఉంటే సిరి కచ్చితంగా వీడియో కాల్‌ చేసి ఎక్కడున్నావో అడిగేదని మాత్రం ఒప్పుకున్నాడు. మొత్తంగా సోహైల్‌ ఇనయ కోసం వచ్చి.. శ్రీహాన్‌ కొంప కొల్లేరు చేశాడు. మరి ఈ ప్రభావం బయట ఎలా ఉంటుంది, సిరి ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. శ్రీహాన్‌ హౌజ్‌నుంచి బయటకు వచ్చాక దీనిపై ఓ క్లారిటీ రానుందని చెప్పొచ్చు. 
 

ఇదిలా ఉంటే సిరి గత సీజన్‌లో షణ్ముఖ్‌తో క్లోజ్‌గా మూవ్‌ అయ్యింది. అది షణ్ముఖ్‌ రిలేషన్‌పై ప్రభావం పడింది. షో అయ్యాక షణ్ముఖ్‌కి ఆయన ప్రియురాలు దీప్తి సునైనా బ్రేకప్‌ చెప్పిన విషయం తెలిసిందే. మరి ఇప్పుడు హౌజ్‌లో శ్రీహాన్‌.. శ్రీ సత్యతో మూవ్‌ అవుతున్నాడు, పైగా సోహైల్‌ వచ్చి ఈవిషయాలన్ని చెప్పాడు. మరి వీరి పరిస్థితేంటో అని నెటిజన్లు ప్రశ్నలు సందిస్తుండటం విశేషం. 

ఇక శనివారం ఎపిసోడ్‌లో ఒక్కో ఒక్కో కంటెస్టెంట్‌కి ఒక్కో ఫ్యామిలీ మెంబర్‌ని, ఓ సెలబ్రిటీని తీసుకొచ్చాడు. ఇందులో శ్రీహాన్‌ కోసం వాళ్ల ఫాదర్‌తోపాటు శివబాలాజీ వచ్చారు. శ్రీహాన్‌కి రేవంత్‌(Revanth) కాంపీటీషన్‌ అని, ఫైమా కాదన్నారు. శ్రీహాన్‌ని సేవ్‌ చేశారు. ఫైమా కోసం బుల్లెట్‌ భాస్కర్‌తోపాటు ఫైమా సిస్టర్‌ సల్మా వచ్చారు. ఇనయ కాంపిటీషన్‌ అని, శ్రీ సత్య కాదన్నారు. రేవంత్‌ కోసం అన్నయ్య సంతోష్‌తోపాటు రోల్స్ రైడా వచ్చాడు. శ్రీహాన్‌ కాంపిటీషన్‌ అని, రోహిత్‌ కాదన్నారు. రోహిత్‌ కోసం అన్నయ్య హిమాన్షు, ప్రభాకర్‌ వచ్చారు. రేవంత్‌ కాంపిటీషన్‌ అని, రాజ్‌ కాదన్నారు. అలాగే ఆదిరెడ్డి కోసం చెల్లి నాగలక్ష్మి, లహరి షరి వచ్చారు. రేవంత్ కాంపిటీషన్‌ అని, శ్రీసత్య కాదన్నారు. శ్రీ సత్య కోసం ఫ్రెండ్‌ హరిక, విష్ణు ప్రియా వచ్చారు. రేవంత్‌ కాంపిటీషన్‌ అని, కీర్తి కాదన్నారు. రాజ్‌ కోసం బ్రదర్‌ వెంకీ, నటుడు సాయి రోనక్‌ వచ్చారు. రేవంత్‌ కాంపిటీషన్‌ అని, ఇనయ కాదన్నారు. కీర్తి కోసం ప్రియాంక, వితికా షేరు వచ్చారు. శ్రీహాన్‌ కాంపిటీషన్‌ అని, శ్రీ సత్య కాదన్నారు. ఫైనల్‌గా రేవంత్‌ విన్నర్‌గా తేల్చారు. 

click me!