టమాటా, టీ ట్రీ ఆయిల్ మాస్క్
టమాటా, టీ ట్రీ ఆయిల్ కలయిక మన చర్మ ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను కలిగిస్తుంది. ఈ ఫేస్ ప్యాక్ ను తయారుచేయడానికి టమాటా గుజ్జులో కొద్దిగా టీ ట్రీ ఆయిల్ ను వేసి ముఖానికి అప్లై చేయండి. ఇలా చేయడం వల్ల డార్క్ స్పాట్స్ తగ్గి క్లియర్ స్కిన్ వస్తుంది. టీ ట్రీ ఆయిల్ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు చర్మం స్థితిస్థాపకతను పెంచుతాయి. అలాగే చర్మం రంగును పెంచుతాయి. ఈ మాస్క్ తయారు చేయడానికి ఒక టేబుల్ స్పూన్ టీ ట్రీ ఆయిల్, ఒక టీస్పూన్ జోజోబా ఆయిల్, టమాటాలను తీసుకొని వాటిని కలిపి పేస్ట్ లా తయారు చేయండి. ఈ పేస్ట్ ను ముఖానికి అప్లై చేసి 15 నిముషాల తర్వాత చల్ల నీటితో కడిగేయండి.