పవన్ ఫస్ట్ బ్లాక్ బస్టర్ తో బాలయ్యకు ఉన్న లింకేటి... బర్త్ డే స్పెషల్ కథనం!

First Published Sep 2, 2021, 1:25 PM IST

టాలీవుడ్ లో మెగా, నందమూరి అభిమానుల మధ్య ఫ్యాన్ వార్ ఎప్పటి నుండో ఉంది. ముఖ్యంగా చిరంజీవి, బాలయ్య సినిమాలు కలెక్షన్స్, డేస్, సెంటర్స్ అంటూ రికార్డుల పోటీ నడుస్తూ ఉండేది. ఆరోగ్యకరమైన సినిమా వార్ లో చిరు, బాలయ్య మధ్య సత్సంబంధాలు ఉండేవి.

ఒకరి సినిమా వేడుకలలకు మరొకరు హాజరు కావడం, ఫ్యామిలీ ఫంక్షన్స్ లో పాల్గొనడం చేసేవారు. అయితే 2019 ఎన్నికల ముందు నుండి చిరు, బాలయ్య మధ్య బంధం తెగింది. బాలయ్య చేసిన కొన్ని వ్యాఖ్యలను తప్పుబడుతూ నాగబాబు వరుస వీడియోలు చేశారు. 
 

ఈ మధ్య కూడా చిరంజీవి అధ్యక్షతన కరోనా సంక్షోభంపై సినీ ప్రముఖులు, తెలంగాణా ప్రభుత్వ పెద్దలతో జరిగిన మీటింగ్ కి తనను ఆహ్వానించకపోవడంపై బాలయ్య అసంతృపి వ్యక్తం చేశారు. చిరంజీవిని ఉద్దేశిస్తూ కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేశారు. 
 

ఈ వివాదం బాలయ్య, చిరు కుటుంబాల మధ్య దూరం మరింత పెంచింది. అయితే గతంలో చిరంజీవి, బాలయ్య సన్నిహితంగా ఉండేవారు. కాగా పవన్ కళ్యాణ్ మూవీ ఓపెనింగ్ కి బాలయ్య అతిథిగా రావడం జరిగింది. 

1996లో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్రంతో హీరోగా మారిన పవన్ కళ్యాణ్... మూడవ చిత్రం సుస్వాగతం తో మొదటి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. విజయ్ హీరోగా తమిళంలో విజయవంతమైన లవ్ టుడే చిత్రానికి అధికారిక రీమేక్ సుస్వాగతం. 

ఈ మూవీ ఓపెనింగ్ వేడుకకు బాలయ్య అతిథిగా రావడం జరిగింది. అలాగే ఆయన పవన్ పై క్లాప్ కొట్టారు. ఈ మూవీ ఓపెనింగ్ కి విక్టరీ వెంకటేష్ తో పాటు అన్నయ్య చిరంజీవి కూడా హాజరయ్యారు. 

దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు తెరకెక్కించిన సుస్వాగతం బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఎస్ ఏ రాజ్ కుమార్ సంగీతం అందించగా... పాటలు యూత్ ని ఊపేశాయి. భారీ వసూళ్లు రాబట్టిన సుస్వాగతం మూవీ పవన్ కెరీర్ లో అతి పెద్ద విజయం సాధించిన మొదటి చిత్రంగా రికార్డులకు ఎక్కింది. 
 

సుస్వాగతం మూవీ ఓపెనింగ్ కి అతిథిగా వచ్చిన బాలయ్య ఆ మూవీ విజయంలో సెంటిమెంటల్ గా భాగం అయ్యారు. ఇక పవన్, బాలయ్య కూడా ఒకప్పుడు చాలా సన్నిహితంగా ఉండేవారు.

click me!