పెంపుడు కుక్కలు, సన్నాసులు, పార్టీగుర్తు కూడా లేదు... నాగబాబు,పవన్ పై బాబు గోగినేని వీరంగం!

First Published Apr 21, 2021, 11:01 AM IST

హేతువాది బాబు గోగినేని, నాగబాబుకు మధ్య సోషల్ మీడియా వార్ కొనసాగుతుంది. ఇద్దరూ ఒకరిపై మరొకరు తీవ్ర వ్యాఖ్యలు చేస్తుకుంటున్నారు. తాజాగా నాగబాబును,పవన్ లను ఉద్దేశిస్తూ బాబు గోగినేని తీవ్ర వ్యాఖ్యలు చేశాడు.

ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కరోనా బారినపడ్డారు. తన ఫార్మ్ హౌస్ లో చికిత్స తీసుకుంటున్న పవన్ కళ్యాణ్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. అయితే పవన్ వీరాభిమానుల్లో ఒకరు.. వివేకానందుడు, చేగువేరా పవన్ దగ్గరకు వచ్చి పరామర్శించినట్లు ఫోటో ఎడిట్ చేశారు.
undefined
ఆ ఫోటో నచ్చిన పవన్ అభిమానులు సోషల్ మీడియాలో ట్రెండ్ చేశారు. చేగువేరా, వివేకానంద వంటి గొప్ప వ్యక్తులు పవన్ దగ్గరకు వచ్చినట్లు చేసిన ఫోటో ఎడిట్ బాబు గోగినేనికి నచ్చలేదు. ఆ ఫోటోపై లాజికల్ గా పవన్ తో పాటు ఫ్యాన్స్ పై ఘాటు సెటైర్స్ వేశారు.
undefined
ఇక మెగా ఫ్యామిలీని ఎవరు ఎమన్నా కౌంటర్ ఇవ్వడానికి సిద్ధంగా ఉండే నాగబాబు రంగంలోకి దిగాడు. పరోక్షంగా బాబు గోగినేని వీధికుక్క అంటూ కౌంటర్ విసిరారు. నాగబాబు కౌంటర్ కి బాబు గోగినేని ప్రతి కౌంటర్ ఇచ్చారు.
undefined
సోషల్ మీడియా వేదికగా నాగబాబు, పవన్ కళ్యాణ్, ఆయన ఫ్యాన్స్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశాడు బాబు గోగినేని. ఏంటి నాగబాబూ.. నీ ఉచుకో బ్యాచ్‌కు గమ్మునూకోమని చెప్పేశావా?? నీ పెంపుడు కుక్కల్లో ఒక్కడు తప్ప ఎవరూ ట్యాగ్ చేయలా. మహేష్ కత్తితో లాగా నాతో అడుకుందాం అనుకున్నారు కదా నువ్వూ.. నీ సన్నాసులూ? మీ తెలివి తగలడా.. మీకు తెలియదుగా.. నేను చేతితో కత్తి పట్టుకుని దిగుతాను అని.
undefined
సేన, సైన్యం అని తిరిగితే చాలదు సామీ, ఆర్ట్ ఆఫ్ వార్ అని పుస్తకం ఉంటుంది. నువ్వూ, నీ తమ్ముడూ చదువుకోండి. నువ్వు లాయరూ.. ఆయన వకీలూ.. అర్థం అవ్వుద్దిలే.. అర్థం కాకపోతే మీకు నేనున్నానుగా.
undefined
సర్లే కానీ.. ఆ సీసా పక్కన పెట్టి వస్తే గ్లాస్ గురించి మాట్లాడుకుందాం.. పార్టీ 2014లో పెడితే ఇప్పుడు మనకి సింబర్ కూడా లేదా?? అదేమిటీ?? 2019లో చేరగానే నీకు పార్టీలో పెద్ద పొజిషన్ అంట. అక్కడ ఏం ఎలగబెడుతున్నావు రాజా?? నువ్వూ నీ పెంపుడు కుక్కలు కలిసి కనీసం పార్టీ సింబల్‌ని కూడా కాపాడుకోలేకపోయారు?? ఇప్పుడు నీ పెంపుడు కుక్క సింబల్ ఉంది అట. ఆలోచించుకో.
undefined
చెప్పాను కదా.. ట్యాగ్ చేస్తే ర్యాగ్ చేస్తాను అని.. ఆపేస్తే ఆపేస్తాను అని. నీ గోదీ మీడియా అయినా సరే.. సేమ్ రూల్స్ మచ్చా.. అంతా మన కుక్కల చేతిలో ఉంది. ఇప్పుడు మనం గేమ్‌లో లెవల్ 2. షేర్ చేయడం మర్చిపోవద్దు.. అవసరం బట్టి ఇంకా మనం యూట్యూబ్‌లో వీడియోలు కూడా చేసుకోవాలి’ అంటూ... బాబు గోగి నేని ఈస్థాయిలో విమర్శలు దాడి చేయగా, నాగబాబు స్పందన ఎలా ఉంటుందో చూడాలి.
undefined
click me!