ఆ నటుడితో పిల్లల్ని కనేందుకు అవికాగోర్‌ ప్లాన్‌? అసలు విషయం చెప్పిన నటి

First Published Jun 22, 2021, 3:07 PM IST

`ఉయ్యాల జంపాలా` భామ అవికా గోర్‌ మిలింద్‌ చద్వానీతో డేటింగ్‌లో ఉంది. తాజాగా మరో నటుడు తెరపైకి వచ్చాడు. అతనితో బిడ్డని కూడా కన్నట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీంతో అవికాగోర్‌ స్పందించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 

అవికా గోర్‌ ఇటీవల ఓ రకంగా తన సెకండ్‌ ఇన్నింగ్స్ ని ప్రారంభించిందని చెప్పొచ్చు. బాడీని ఫిట్‌గా మార్చుకుని మెచ్యూర్‌ ఆలోచనలో, సరికొత్తగా ముందుకు సాగుతుంది.
undefined
క్రమంగా వరుసగా సినిమాలు దక్కించుకుంటూ కెరీర్‌ని మళ్లీ గాడిలో పెట్టుకుంటుంది. ప్రస్తుతం తెలుగులో రెండు సినిమాలు చేస్తుంది. మరోవైపు నిర్మాణంలోకి కూడా అడుగుపెట్టింది.
undefined
ఇదిలా ఉంటే సామాజిక కార్యకర్త మిలింద్‌ చద్వానీతో ఆమె గత కొంత కాలంగా డేటింగ్‌లో ఉంటుంది. వీరిద్దరు చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. తాజాగా అవికాపై మరో ఆరోపణలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.
undefined
`చిన్నారి పెళ్లికూతురు`గా పాపులర్‌ అయిన అవికా గోర్‌ `ససురాల్‌ సిమర్‌ కా` అనే మరో సీరియల్‌లోనూ నటించింది. అందులో నటుడు మనీశ్‌ రాయ్‌సింఘన్‌తో కలిసి నటించింది. అయితే ఈ ఇద్దరి మధ్య ఏదో సంబంధం ఉందని, వీళ్లు సీక్రెట్‌గా ఓ బిడ్డను కూడా కన్నారని బాలీవుడ్‌లో వార్తలు చక్కర్లు కొట్టాయి.
undefined
ఈ నేపథ్యంలో దీనిపై ఘాటుగా స్పందించింది అవికాగోర్‌. ఆ వార్తలను ఖండించింది. `మేం ఓ బిడ్డను కన్నామని, ఆ విషయాన్ని సీక్రెట్‌గా ఉంచామని అంటున్నారు. అది పూర్తిగా అవాస్తవం. 13 ఏళ్ల వయసులో నటిగా ప్రయాణం ప్రారంభించినప్పటి నుంచి మనీశ్‌ నాకు స్నేహితుడు. నా లైఫ్‌లో అతనొక స్పెషల్‌ పర్సన్‌. అతడి నుంచి చాలా నేర్చుకున్నాను. మా మధ్య ఏదైనా జరిగిందేమోనని ఇప్పటికీ చాలా మంది అడుగుతున్నారు.
undefined
దీనిపై నేను ఏం చెప్పాలి. అతడు మా నాన్న కంటే కొంచెం చిన్నవాడు. సరిగ్గా చెప్పాలంటే మా నాన్న వయసు. మా ఇద్దరి మధ్య సంబంధం ఉందని వచ్చిన కథనాలు మొదట్లో మా మీద ప్రభావాన్ని చూపించాయి. రెండు వారాలపాటు మేమిద్దరం మాట్లాడుకోలేదు కూడా!
undefined
కానీ మళ్లీ అలాంటి పుకార్లు వస్తూనే ఉంటడంతో అసలు దూరంగా ఉండటంలో అర్థం లేదనిపించింది. ఇద్దరం క్లోజ్‌ ఫ్రెండ్స్‌లా కలిసిపోయాం. మా గురించి రాసిన గాసిప్‌ వార్తలు చదివి ఇప్పటికీ సరదాగా నవ్వుకుంటున్నాం` అని తెలిపింది అవికా గోర్‌.
undefined
ప్రస్తుతం అవికా గోర్‌ తెలుగులో `థ్యాంక్యూ`, కళ్యాణ్‌ దేవ్‌తో ఓ సినిమా, సాయి రోనక్‌తో మరో సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.
undefined
అవికా ప్రస్తుతం పూర్ణతో కలిసి ఓంకార్‌ హోస్ట్ గా రన్‌ అవుతున్న `సిక్త్స్ సెన్స్` షోలో పాల్గొంది. అది ఈ వీకెండ్‌లో ప్రసారం కానుంది.
undefined
click me!