మతిపోగొడుతున్న అనుపమా అందాల సెల్ఫీలు.. కొంటె చూపులు.. కవ్వించే నవ్వుతో కట్టిపడేస్తున్న యంగ్ బ్యూటీ!

First Published Dec 2, 2022, 7:31 AM IST

యంగ్ హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ (Anuapama Parameswaran) చిలిపి చేష్టలతో కుర్ర హృదయాలను కొల్లగొడుతోంది. తాజాగా క్యూట్ గా సెల్ఫీలకు పోజులిస్తూ మతి చెడగొట్టేసింది. ఆ పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి. 
 

బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఇండస్ట్రీలో దూసుకుపోతోంది యంగ్ హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్. వచ్చిన అవకాశాలను చక్కగా వినియోగించుకుంటూ ప్రేక్షకుల్లో మరింత గుర్తింపును దక్కించుకుంటోంది. అలాగే గ్లామర్ పరంగానూ ఆకట్టుకుంటోంది.

సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గానే కనిపిస్తుంటుంది అనుపమా. సినిమాలు.. తన పర్సనల్ లైఫ్ గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అందిస్తూ నెటిజన్లను అట్రాక్ట్ చేస్తోంది. మరోవైపు అందాలను ఆరబోస్తూ కుర్రకారును ఉక్కిరిబిక్కిరి చేసింది. 
 

తాజాగా అనుపమా తన అభిమానులతో పంచుకున్న సెల్ఫీ పిక్స్ నెట్టింట వైరల్ గా మారింది. క్యూట్ లుక్స్, చిలిపి పోజులతో కుర్రాళ్లను కవ్వించేసింది. ఉంగరాల జుట్టు, కొంటె చూపులతో నెటిజన్లను  ఉక్కిరిబిక్కిరి చేసింది.  
 

ర్యాండమ్ గా సెల్ఫీలకు పోజులిచ్చి యువతను చిత్తు చేసింది. నెట్టింట ఎప్పుడూ సరదాగా.. చిలిపి చేష్టలతో దర్శనమిస్తున్న ఈ బ్యూటీ.. తాజాగా ఇలా స్టన్నింగ్ సెల్ఫీలతో అట్రాక్ట్ చేసింది. పిక్స్ చూసిన నెటిజన్లు అనపమా అందాన్ని వర్ణిస్తూ కామెంట్లు  పెడుతున్నారు. 
 

టాలీవుడ్ యంగ్ హీరోయిన్ గా అనుపమా పరమేశ్వరన్ దూసుకుపోతుందనే చెప్పాలి. కేరీర్ ప్రారంభంలోనే హ్యాట్రిక్ హిట్ సొంతం చేసుకున్న ఈ బ్యూటీ.. ఇటీవల వరుస హిట్స్ ను సొంతం చేసుకుంది. చివరి ‘కార్తీకేయ’ 2తో మంచి సక్సెస్ ను అందుకుంది. 

‘డీజే టిల్లు 2’లోనూ అవకాశం దక్కించుకున్న ఈ బ్యూటీ కొన్ని  కారణాలతో ఎగ్జిట్ అయినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం నిఖిల్ సిద్ధార్థ్ సరసన మరోసారి ‘18 పేజెస్’ చిత్రంతో అలరించేందుకు సిద్ధం అవుతోంది. అదీగాక ‘బటర్ ఫ్లై’ తదితర చిత్రాల్లోనూ నటిస్తూ బిజీగా ఉంది.
 

click me!