హే నాస్టీ ట్రోలర్స్ నా ఆటిట్యూడే మీకు సమాధానం... హాట్ వీడియో షేర్ చేసి షాక్ ఇచ్చిన అనసూయ!

First Published Oct 27, 2022, 12:38 PM IST


అంతకంతకు వివాదాలు ఎక్కువ అవుతున్నా అనసూయ మాత్రం అసలు తగ్గడం లేదు. తనను ట్రోల్ చేసేవారిని మరింత రెచ్చగొడుతూ వీడియోలు పోస్ట్ చేస్తుంది. తాజాగా ట్రోలర్స్ కి నా యాటిట్యూడ్ సమాధానం అన్నట్లు ఓ వీడియో పోస్ట్ చేసింది. 
 

Anasuya Bharadwaj


అనసూయ జీవితంలో వివాదాల ఎక్కువయ్యాయి. ఫేమ్ నేమ్ తో పాటు విమర్శలు ప్రతి విమర్శలు ఎక్కువవుతున్నాయి. జబర్దస్త్ యాంకర్ గా ఫేమస్ అయిన అనసూయ గత ఐదేళ్ల కాలంలో అనేక వివాదాలలో ఇరుక్కున్నారు. ముఖ్యంగా ఆమె డ్రెస్సింగ్ స్టైల్ పై ఆరోపణలు ఉన్నాయి. బుల్లితెర షోస్ లో స్కిన్ షో చేయడం దారుణమంటూ ఆమెను పలువురు ప్రశ్నించారు. 

Anasuya Bharadwaj


అయితే ఈ విమర్శలను అనసూయ ధీటుగా తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. నా బట్టలు నా ఇష్టం, మీరెవరు జడ్జి చేయడానికి అంటుంది అనసూయ. నాకు నచ్చాయా? సౌకర్యంగా ఉన్నాయా? అన్నదే ముఖ్యం. మీ కామెంట్స్ ని నేను పట్టించుకోను. అయినా ఎలాంటి బట్టలు వేసుకోవాలో చెప్పడానికి మీరెవరని ఎదురుదాడికి దిగుతుంది. 
 

Anasuya Bharadwaj


ఇక అర్జున్ రెడ్డి మూవీ విడుదల సమయంలో ఫెమిస్ట్ భావజాలం తెరపైకి తెచ్చి... ఆ చిత్ర దర్శకుడు, హీరోలపై ఆరోపణలు చేసింది. ఆ సినిమాలో కొన్ని అంశాలపై అనసూయ అభ్యంతరం చెప్పారు. టీవీ డిబేట్స్ లో కూర్చొని తీవ్రస్థాయిలో ఖండించారు. 
 

Anasuya Bharadwaj

తాజాగా వివాదం దానికి కొనసాగింపు అనాలి. లైగర్ మూవీ ఫెయిల్యూర్ పై అనసూయ ట్వీట్ చేశారు. ఆనాడు అమ్మను తిట్టిన పాపం వెంటాడి లైగర్ మూవీ ప్లాప్ కి కారణమైందని అర్థం వచ్చేలా ఇండైరెక్ట్ ట్వీట్ చేసింది. అనసూయ ట్వీట్ విజయ్ దేవరకొండ అభిమానులను హర్ట్ చేసింది. వారు ఆంటీ అంటూ ట్రోల్స్ కి తెగబడ్డారు. 
 

Anasuya Bharadwaj


దాదాపు మూడు రోజులు ట్విట్టర్ లో ఆంటీ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అయ్యింది. తనను ట్రోల్ చేస్తున్నవారికి అనసూయ సమాధానాలు ఇచ్చే ప్రయత్నం చేశారు. అలాగే సైబర్ పోలీసులకు కొందరిపై ఫిర్యాదు చేశారు. లైగర్ వివాదం తర్వాత అనసూయపై సోషల్ మీడియా నెగిటివిటీ మరింత ఎక్కువైంది. ఆమె ప్రతి పోస్ట్ కి నెగిటివ్ కామెంట్స్ వెల్లువెత్తున్నాయి. 

Anasuya Bharadwaj

ఈ ట్రోల్స్, నెగిటివ్ కామెంట్స్ పై అనసూయ తనదైన శైలిలో స్పందిస్తున్నారు. తాజాగా ఆమె ఒక వీడియో పోస్ట్ చేశారు. హాలీవుడ్ సాంగ్ కి డాన్స్ చేస్తూ... తెర వెనకుండి ట్రోల్ చేసే నాస్టీ ట్రోలర్స్ కి నా యాటిట్యూడ్ సమాధానం. కుటుంబం వలె ప్రేమించే ఎందరో అభిమానులు ఉన్నారు, అంటూ కామెంట్స్ వీడియోలో పోస్ట్ చేశారు.

Anasuya Bharadwaj


పొట్టి బట్టల్లో నడుము చూపిస్తూ... అనసూయ డాన్స్ చేయగా అది కాస్తా వైరల్ అవుతుంది. అనసూయ తీరు చూసిన జనాలు అంతకంతకు ఆమె ట్రోలర్స్ తో గొడవ పెద్దది చేస్తున్నారన్న అభిప్రాయం వెల్లడిస్తున్నారు. 
 

click me!