అల్లు శిరీష్ 'ఎబిసిడి' రివ్యూ

First Published May 17, 2019, 1:40 PM IST

డబ్బులోనే  పుట్టి...డబ్బులోనే  పెరిగి...డబ్బు విలువ  ఏ మాత్రం తెలీని ఓ కుర్రాడు ...ఆ డబ్బే లేకుండా కొంతకాలం జీవించాల్సి వస్తే... అతని జీవితంలో ఏ మార్పులు వస్తాయి...ఎలా సర్వైవ్ అవుతాడు అనే పాయింట్ ఈ కాలం నాటిది కాదు. 

( ---Review By సూర్య ప్రకాష్ జోశ్యుల) డబ్బులోనే పుట్టి...డబ్బులోనే పెరిగి...డబ్బు విలువ ఏ మాత్రం తెలీని ఓ కుర్రాడు ...ఆ డబ్బే లేకుండా కొంతకాలం జీవించాల్సి వస్తే... అతని జీవితంలో ఏ మార్పులు వస్తాయి...ఎలా సర్వైవ్ అవుతాడు అనే పాయింట్ ఈ కాలం నాటిది కాదు. అప్పట్లో వచ్చిన మైనర్ బాబు నుంచీ ఈ మధ్యకాలంలో వచ్చిన పిల్ల జమీందార్ దాకా ప్రతీ ఐదేళ్లకు ఇలాంటి కాన్సెప్టులతో సినిమాలు వస్తూనే ఉన్నాయి...ఆడుతూనే ఉన్నాయి. అయితే ఈ మధ్యన అలాంటి సినిమాలు తెలుగులో తగ్గాయి. కానీ మళయాళం వాళ్లు మాత్రం వాటిని వదలలేదు. ఇలాంటి అతి మామూలు స్టోరీ లైన్ తో కూడా హిట్ కొట్టచ్చు అని చూపటానికా అన్నట్లు ఇదే పాయింట్ తో 2013 లో ఇదే టైటిల్ తో దుల్కర్ (మహానటి ఫేమ్)తో ఓ కామెడీ సినిమా చేసారు.
undefined
సినిమా అద్బుతం కాకపోయినా కామెడీ పండటంతో సీరియస్ గా ఆడేసింది. దాంతో మనవాళ్లు రైట్స్ కొనేసి రీమేక్ చేసేసారు. కెరీర్ లో చెప్పుకోదగ్గ హిట్ ఇంకా పడని అల్లు శిరీష్ ..ఈ రీమేక్ తో సేఫ్ గేమ్ ఆడదామనుకున్నారు. మరి ఈ సినిమా ఎంతవరకూ వర్కవుట్ అయ్యింది. మన వాళ్లకూ ఈ సినిమా నచ్చేస్తుందా...దుల్కర్ చేసిన పాత్రకు అల్లు శిరీష్ ని తీసుకోవటం ఎంతవరకూ సమంజసం, మళయాళ వెర్షన్ కు తెలుగులో చేసిన మార్పులు ఏమన్నా ఉన్నాయా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.
undefined
కథేంటి : పాతికేళ్ల క్రితం యుఎస్ వెళ్లి సెటిలైన ఎన్నారై(నాగబాబు) కొడుకు అరవింద్ అలియాస్ అవి(అల్లు శిరిష్). తండ్రి మిలియనీర్ కావటంతో చిన్నప్పటి నుంచి దేనికీ లోటు లేదు...విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెట్టడం అలవాటు అవుతుంది. అది ఏ స్దాయికి వెళ్తుందంటే ఓవ‌ర్ నైట్‌లో 20వేల డాల‌ర్లు ఖ‌ర్చు పెట్టేస్తాడు. కూర్చుని తింటే కొండలైనా తరిగిపోతాయనే విషయం తెలిసిన ఆ తండ్రికు కంగారుపుడుతుంది. దాంతో డబ్బు విలువ, జీవితం విలువ కొడుక్కు తెలియచెప్పేందుకు ఇండియా పంపుతాడు. అలా హైదరాబాద్ లో దిగిన అవికు తన తండ్రి మరో ట్విస్ట్ ఇచ్చాడని అర్దమవుతుంది. అదేమంటే అతని క్రెడిట్ కార్డ్ లు అన్ని బ్లాక్ చేయించాడు. అంతేకాక అతని యుఎస్ కాంటాక్ట్స్ అన్నిటికి డబ్బు తన కొడుక్కు ఇవ్వద్దని చెప్తాడు. అక్కడ నుంచి అసలు కష్టాలు అవి కు ప్రారంభమవుతాయి. కేవలం తన తండ్రి ఇచ్చే ఐదు వేల రూపాయలతో అంత పెద్ద మిలియనీర్ బిడ్డ ఎలా గడపాలి. చేతిలో రూపాయి లేకుండా ఎలా జీవించాలి.. ఎంత కష్టపడితే రూపాయి వస్తుంది...ఖర్చు పెట్టినంత ఈజీగా పైసలు రావు అనే విషయాలు అవీకు ఎలా అర్దమవుతాయి. అవి తన ఫ్రెండ్ భాషా (మాస్టర్ భరత్ ) తో కలిసి ఇండియాలో చేసిన జర్నీ లో ఏ సంఘటనలు చోటు చేసుకున్నాయి, నేహా (రుక్సార్‌) తో అతని ప్రేమ కథ ఏమిటి వంటి విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
undefined
ఎలా ఉంది : ఫిష్ అవుటాఫ్ వాటర్ తరహా ఇలాంటి కథలు ఎప్పుడూ బాగానే ఉంటాయి. తమకు పరిచయం లేని ప్రపంచంలో ఇమడాల్సి రావటం, ఎదురీదటం అనేది ప్రతీ ఒక్కరి జీవితంలోనూ ఎప్పుడో ఒకప్పుడు జరిగేదే కాబట్టి కనెక్ట్ అవుతూంటాం. అయితే ఆ కనెక్టివిటీ మన సోల్ కు అయితేనే సమర్దిస్తాం. అదే ఈ సినిమాకు మిస్సైందనిపించింది. మళయాళ ఒరిజనల్ కు ఈ సినిమాకు బాగా మార్పులు చేసారు. మలయాళం వెర్షన్‌లో హీరోయిన్, విలన్ పాత్రలు లేవు. తెలుగులో పెట్టారు. అయితే అవి సరిగ్గా కథలో కలవక కన్ఫూజ్ చేసాయి. ఇక ఫస్టాఫ్ ఫన్ కు, సెకండాఫ్ సీరియస్ డ్రామాకు కేటాయించిన ఈ చిత్రానికి ప్రెడిక్టుబులిటీనే దెబ్బ కొట్టింది. స్టోరీ లైన్ లోనే ఎదర ఏం జరుగుతుందనే ఆసక్తిలేని విషయం ఉంది. దాన్ని మరింత ప్లాట్ గా డైరక్టర్ మలిచాడు. ఏవో కొన్ని కామెడీ సీన్స్ ఉన్నంత మాత్రాన మొత్తం లాగటం కష్టం కదా.
undefined
మళయాళంలో వర్కవుట్ అవటానికి చాలా కారణాలు ఉన్నాయి. వాటిల్లో అతి ముఖ్యమైనది దుల్కర్ అనే యంగ్ యాక్టర్ అద్బుత నట విన్యాసం. తెలుగులో అల్లు శిరీష్ ..ఆ స్దాయి మ్యాజిక్, ఇమేజ్ రెండూ లేవు. అలాంటప్పుడు పూర్తిగా స్క్రిప్టు మీదే ఆధారపడాలి. కానీ అది జరగలేదు. స్క్రీన్ ప్లే చాలా డల్ గా సాగుతుంది. దాంతో ఎక్కడా ..భలే ఉందిరా అనే మూవ్ మెంట్ కనపడదు. అల్లు శిరీష్ లాంటి హిట్ అవసరమైన హీరోకు ఇది సరిపోని కథ. కథ భారం మొయ్యక, శిరీష్ మొయ్యిక, మనకు భారం తెప్పిస్తుంది. దానికి తోడు విలన్ గా సిరివెన్నెల రాజా సరిపోలేదు.
undefined
విలన్ దుబాయ్‌లో ప‌వ‌ర్‌ ఫ్యాక్టరీలు న‌డుపుతూ వేల కోట్లు ఆదాయం ఉంటుంది కానీ అత‌ను ఎలక్షన్స్ లో గెలవాలంటే కాలేజీ విద్యార్థుల నుంచి ఫీజులు వ‌సూలు చేయ‌డం త‌ప్ప వేరే మార్గం లేదంటూంటాడు. ఏంటో ఆ ట్రాక్ చాలా కన్ఫూజ్ గా ఉంటుంది. సరదాగా నడవాల్సిన ఈ కథకు పొలిటికల్ టచ్ ఇవ్వటం విసిగిస్తుంది. హీరోయిన్ ట్రాక్ కూడా అంత గొప్పగా ఉండదు. చాలా సాదాసీదాగా ఉంటుంది. ఉన్నంతలో నవ్వించిన ట్రాక్...వెన్నెల కిషోర్ ...చేసిన ప్రస్టేడెట్ న్యూస్ రీడర్ (పేరడీ) ట్రాక్. కాఫీ విత్ కిషోర్ అంటూ బాగానే పేలింది.
undefined
ఎవరెలా చేశారు : అల్లు శిరీష్ ...అమెరికానుంచి వచ్చిన కుర్రాడిలా అనిపించలేదు. ఇక్కడ లోకల్ క్యాండిడేట్ లాగ అనిపించలేదు. అతను చెప్పినంత దరిద్రంలో బ్రతుకుతున్నట్లు అనిపించడు. నటనలో, బాడీ లాంగ్వేజ్ లో ఆ వేరియేషన్ లేదు. దాంతో కథ ప్రకారం అమెరికాలో పుట్టి, పెరిగి ఇక్కడకు వచ్చినట్లు చెప్పినా , మనకు ఆ ఫీల్ రాదు. అయితే క్లైమాక్స్ లో మాత్రం శిరీష్ లోని నటుడు మనకు ఆ కాసేపు కనపడతాడు. భరత్ ను చూస్తూంటే ఆశ్చర్యంగా ఉంటుంది. అప్పటి చిన్నపిల్లాడుగా కామెడీ చేసినా భరత్ నేనా చూస్తుంది అనిపిస్తుంది. అతని ట్యాలెంట్ ని డైరక్టర్ వాడుకోలేదనిపిస్తుంది. హీరోయిన్ గురించి మాట్లాడుకోవటానికి ఆమెకు అసలు అంత సీన్ ఉన్న క్యారక్టరే కాదు. నాగబాబు, శుభలేఖ సుధాకర్ ఇద్దరూ యాప్ట్.
undefined
టెక్నికల్ గా : డైరక్టర్ గా సంజీవ్ రెడ్డి స్టోరీలైన్ కు తగ్గ ట్రీట్మెంట్ ని రాసుకోవటంలోనే ఫెయిలయ్యాడనిపిస్తుంది. అలాగే హీరో క్యారక్టరైజేషన్ అర్దం చేసుకుని అందుకు తగ్గట్లు ప్రెంజెంట్ చేయలేదనిపిస్తుంది. ఇక ఈ సినిమాకు సంగీతం బాగుంది. ముఖ్యంగా మెల్లిగా..మెల్లిగా అంటూ సాగే పాట నచ్చుతుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఓకే. సినిమాటోగ్రఫీ డీసెంట్ గా ఉంది. ఎడిటర్ కూడా సినిమాకు బాగానే ప్లస్ అయ్యారు. సినిమాకు కథ, కథనమే దెబ్బకొట్టింది. ప్రొడక్షన్ వ్యాల్యూస్ కూడా అంతంత మాత్రమే.
undefined
ఫైనల్ థాట్ : ఈ `అమెరిక‌న్ బోర్న్ క‌న్ఫ్యూజ్డ్ దేశీ` తెరపైనా కన్ఫూజ్ అయ్యాడు
undefined
rating 25
undefined
click me!