జైపూర్ కోటలో ఘనంగా హీరోయిన్ హన్సిక వివాహం... దేశముదురు బ్యూటీ బిగ్ షాక్ ఇచ్చిందిగా!

First Published Oct 17, 2022, 7:36 AM IST


ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి అంటారు. థర్టీ ప్లస్ లోకి వెళ్లిన హన్సిక పెళ్లికి సిద్దమయ్యారనేది తాజా సమాచారం. దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా ప్రారంభం అయ్యాయట. 
 

Hansika Marriage

హన్సిక మోత్వానీ పెళ్లి దాదాపు ఖాయమే అంటున్నారు. డిసెంబర్ లో జైపూర్ లోని ముండోట ప్యాలస్ వేదికగా హన్సిక వివాహం ఘనంగా జరగనుందట. ఈ వేడుక కోసం ఏర్పాట్లు మొదలయ్యాయట. 450 ఏళ్ల పురాతన ప్యాలస్ లో గదులు ముందుగానే బుక్ చేశారట. పెళ్ళి వేదిక, అతిధులకు విడిదికి ఏర్పాట్లు చేస్తున్నారట. ముండోట ప్యాలస్ ని హన్సిక తన వివాహం కోసం అద్దెకు తీసుకున్నట్లు బాలీవుడ్ మీడియా రిపోర్ట్ చేసింది. 
 

ఖచ్చితమైన తేదీ తెలియకున్నప్పటికీ డిసెంబర్ లో హన్సిక వివాహం జరుగుతుంది అంటున్నారు. ఇక అబ్బాయి ఎవరనే సందేహాలు అందరి మదిని తొలిచేస్తున్నాయి. ప్రియుడినే హన్సిక వివాహం చేసుకోబోతున్నారట. ఆయన ఎవరో స్పష్టమైన సమాచారం లేకున్నప్పటికీ ఇది లవ్ మ్యారేజ్ అంటున్నారు. 

కాగా హన్సిక తమిళ హీరో శింబుతో ఎఫైర్ నడిపారు. తెలుగులో ఫేడ్ అవుట్ అయ్యాక హన్సిక తమిళంలో రాణించారు. అక్కడ అధికంగా చిత్రాలు చేశారు. ఈ క్రమంలో హన్సిక శింబు ప్రేమలో పడ్డారు. కొన్నాళ్లు ఈ జంట ఓపెన్ గానే ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుంటారనే పుకార్లు వినిపించాయి. అనూహ్యంగా శింబు-హన్సిక బ్రేకప్ చెప్పుకున్నారు. 

hansika motwani


ఇక చైల్డ్ ఆర్టిస్ట్ గా హన్సిక కెరీర్ మొదలైంది. పలు సీరియస్, సినిమాల్లో నటించారు. హృతిక్-ప్రీతీ జింటా హిట్ మూవీ కోయీ మిల్ గయా మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా హన్సిక నటించారు.  కాగా ఆమె హీరోయిన్ కెరీర్ మొదలైంది టాలీవుడ్ లోనే కావడం విశేషం. దర్శకుడు పూరి జగన్నాధ్ దేశముదురు సినిమాతో హీరోయిన్ గా పరిచయం చేశాడు. 


దేశముదురు హిట్ టాక్ తెచ్చుకోగా తెలుగులో ఆఫర్స్ వచ్చాయి. ఎన్టీఆర్ తో కంత్రి, ప్రభాస్ తో బిల్లా వంటి చిత్రాల్లో హన్సిక నటించారు. కొన్నాళ్లుగా తెలుగులో అడపాదడపా సినిమాలు చేస్తున్న హన్సిక తమిళంలో సెటిల్ అయ్యారు. తెలుగులో ఫేడ్ అవుట్ అయ్యాక కోలీవుడ్ లో బ్రేక్ వచ్చింది. 

ప్రస్తుతం హన్సిక చేతిలో అరడజను చిత్రాలు ఉన్నాయి. 5 చిత్రాల వరకు తమిళ్ లో చేస్తున్నారు. ఇక ప్రచారం జరుగుతున్నట్లు డిసెంబర్ లో హన్సిక వివాహం జరిగితే సినిమాలు కంటిన్యూ చేస్తారా? లేక గుడ్ బై చెప్పేస్తారా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. 31 ఏళ్ల వయసులో 20 ఏళ్ల కెరీర్ ని హన్సిక చూసేసింది.

click me!