Manchu Lakshmi: వయసుతో పనేముంది కవ్వించే సొగసులు ఉండగా... ఆ విషయంలో అసలు తగ్గేదేలే అంటున్న మంచు లక్ష్మి!

First Published Dec 19, 2022, 7:25 PM IST

నాలుగు పదుల వయసులో గ్లామరస్ ఫోటో షూట్స్ చేస్తుంది మంచు లక్ష్మి. తనలోని గ్లామర్ యాంగిల్ చూపించే ప్రయత్నం చేస్తుంది. మంచు లక్ష్మి లేటెస్ట్ ఫోటో షూట్ వైరల్ అవుతున్నాయి.

Machu Lakshmi

మంచు వారమ్మాయి లక్ష్మీ ఏమి చేసినా ప్రత్యేకమే. అమెరికాలో కూడా రాణించిన ఈ అల్ట్రా మోడరన్ వుమన్ చాలా ఇండిపెండెంట్ గా ఉంటారు. హీరోయిన్ రేంజ్ లో ఫోటో షూట్స్ లో పాల్గొంటారు. హీరోయిన్ కావాలని చాలా ప్రయత్నం చేసిన మంచు లక్ష్మి ఈ మధ్య క్యారెక్టర్ రోల్స్ చేస్తున్నారు. 

Machu Lakshmi

 చాలా బ్రాడ్ గా ఆలోచించే మంచు లక్ష్మి ఈ విమర్శలను, సెటైర్స్ ని అసలు పట్టించుకోరు. అవన్నీ పనీపాటా లేని వారు చేసే కామెంట్స్ అంటారు. వాళ్ళ గురించి ఆలోచిస్తే జీవితంలో ఏమీ చేయలేమని ఆమె అంటారు. ఇక వయసుతో సంబంధం లేకుండా ట్రెండీ వేర్స్ ధరించి మంచు లక్ష్మి ఫోటో షూట్స్ చేస్తూ ఉంటారు.

Machu Lakshmi


మంచు లక్ష్మి(Manchu Lakshmi) కెరీర్ అమెరికాలో మొదలైంది. ఒకటి రెండు ఇంగ్లీష్ చిత్రాలలో నటించిన ఆమె టెలివిజన్ హోస్ట్ గా చేశారు. పలు పాప్యులర్ షోస్ కి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. మంచు లక్ష్మి ఇంగ్లీష్ యాక్సెంట్ అమెరికన్స్ కి చాలా దగ్గరగా ఉంటుంది. ఆమె ఆ భాషలో చాలా పర్ఫెక్ట్. 
 

Machu Lakshmi


ఇండియాకు వచ్చిన తర్వాత కూడా ఆమె ఇదే తరహాలో మాట్లాడుతున్నారు. ఈ క్రమంలో ఆమె ఇంగ్లీష్ తో కూడిన తెలుగు ట్రోల్స్ కి గురైంది. మంచు లక్ష్మి తెలుగు మాటలపై అనేక మీమ్ వీడియోలు ఉన్నాయి. ఇక మంచు ఫ్యామిలీ అంటేనే ట్రోల్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్. సొంత డబ్బా కొట్టుకుంటారనే పేరున్న ఈ ఫ్యామిలీపై మీమ్ వీడియోలు చేస్తూ బ్రతికేస్తున్న యూట్యూబ్ ఛానల్స్ చాలా ఉన్నాయి. 
 

Machu Lakshmi


ఇక మోహన్ లాల్ లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ మాన్స్టర్. అక్టోబర్ లో విడుదలైన ఈ మలయాళ చిత్రం డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. దర్శకుడు వైశక్ తెరకెక్కించగా మంచు లక్ష్మి ఒక కీలక రోల్ చేశారు. మంచు లక్ష్మి బ్యాడ్ లక్ పక్క పరిశ్రమలకు కూడా పాకింది. ఆమె లెగ్ పవర్ కి మోహన్ లాల్ కెరీర్లో వరస్ట్ మూవీగా మాన్స్టర్ నిలిచింది. 
 

Machu Lakshmi


ఇంత దారుణమైన సినిమా మోహన్ లాల్ నుండి ఆశించలేదని ప్రేక్షకులు అభిప్రాయపడ్డారు. మోహన్ లాల్ స్క్రిప్ట్ సెలక్షన్ పై విమర్శలు వెల్లువెత్తాయి. ఇలా ప్రతి సినిమా ఒప్పుకొని చేయడం ఏమిటని విమర్శిస్తున్నారు. మాన్స్టర్ అంతటి దారుణ ఫలితాన్ని అందుకుంది. 
 

మాన్స్టర్ ఫలితం పక్కన పెడితే ఈ మూవీలో మంచు లక్ష్మి లిప్ లాక్ సన్నివేశాల్లో నటించడం హాట్ టాపిక్ అయ్యింది. మాన్స్టర్ మూవీలో ఆమె లెస్బియన్ రోల్ చేశారు. కథలో భాగంగా వచ్చే బోల్డ్ సన్నివేశాల్లో మంచు లక్ష్మి నటించారు. ఒక అమ్మాయితో మంచు లక్ష్మి లిప్ లాక్ సన్నివేశాలు చేయడం జరిగింది.
 

కాగా మంచు ఫ్యామిలీలో విబేధాలు అంటూ ఇటీవల ఒక న్యూస్ తెరపైకి వచ్చింది. మంచు మనోజ్ భూమా మౌనికా రెడ్డిని వివాహం చేసుకోవడం ఖాయమే అనిస్తుంది. ఈ క్రమంలో మోహన్ బాబు, మంచు విష్ణు... మనోజ్ పై కోపంగా ఉన్నారట. మనోజ్ ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నాడనే ప్రచారం జరుగుతుంది .

click me!