`దంగల్‌` బ్యూటీ ఫాతిమాతో ప్రేమలో ఆమిర్‌.. కిరణ్‌ రావుకి విడాకుల వెనుక అసలు కథ ఇదేనా?

First Published Jul 3, 2021, 4:11 PM IST

ఆమిర్‌ ఖాన్‌, కిరణ్‌ రావు విడిపోవడానికి `దంగల్‌` బ్యూటీ ఫాతిమా సనా షేక్‌కి సంబంధం ఉందా? ఆమీర్‌ నెక్ట్స్ ఫాతిమాని పెళ్లి చేసుకోబోతున్నాడా? ఇప్పుడిది సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతుంది. కొత్త చర్చకు తెరలేపింది. 

బాలీవుడ్‌ మిస్టర్‌ పర్‌ఫెక్ట్ ఆమిర్‌ ఖాన్‌, కిరణ్‌ రావు దంపతులు విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. తమ 15ఏళ్ల వివాహ బంధానికి పుల్‌స్టాప్‌ పెడుతున్నట్టు వెల్లడించారు. విడిపోయినా కుమారుడు అజాద్‌ పోషణ, సంరక్షణ విషయంలో తామిద్దరం బాధ్యత తీసుకుంటామని, ప్రొడక్షన్‌, ఇతర విషయాల్లో కలిసే పనిచేస్తామని వెల్లడించారు. ఇప్పుడీ వార్త దేశ వ్యాప్తంగా హాట్‌ టాపిక్‌గా మారింది.
undefined
అయితే కిరణ్‌ రావ్‌ నుంచి ఆమిర్‌ విడిపోవడానికి కారణమేంటనేది ఇప్పుడు చర్చనీయాంశంగా, సస్పెన్స్ గా మారింది. బాలీవుడ్‌లోనే కాదు, ఇండియన్‌ సినిమా మొత్తంలో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. దీనికి కారణాలు వెతికే పనిలో పడ్డారు.
undefined
ఈ క్రమంలో తాజాగా ట్విట్టర్‌లో ఆమీర్‌ ఖాన్‌తోపాటు `దంగల్‌` నటి ఫాతిమ సనా షేక్‌ పేరులో మారుమ్రోగుతుంది. ట్రెండ్‌ అవుతుంది. ఇండియా వైడ్‌గా ఆమె పేరు ట్రెండ్‌ కావడం విశేషంగా మారింది.
undefined
దీని సారాంశంమేంటంటే ఆమిర్‌ ఖాన్‌ ఇప్పుడు ఫాతిమా సనా షేక్‌తో డేటింగ్‌ చేస్తున్నట్టు, ఈమెని పెళ్లి చేసుకోవడం కోసం కిరణ్‌ రావుకి విడాకులిచ్చారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ట్రెండ్‌ చేస్తున్నారు.
undefined
కిరణ్‌ రావు ప్రేమలో పడి తన మొదటి భార్య రీనా దత్తాకి విడాకులిచ్చారని, ఇప్పుడు ఫాతిమా మాయలో పడి ఆమిర్‌.. కిరణ్‌ రావుకి డైవర్స్ ఇచ్చారని కామెంట్లు చేస్తున్నారు. వరుస కామెంట్లు, విమర్శలు, సెటైర్లు, మీమ్స్, ట్రోల్స్ తో ఆమిర్‌ఖాన్‌, ఫాతిమా సనా షేక్‌ ట్విట్టర్‌లో ట్రెండ్‌ అవుతున్నారు.
undefined
ఇదిలా ఉంటే ఫాతిమా సనా షేక్‌.. ఆమిర్‌ ఖాన్‌ నటించిన సంచలన చిత్రం `దంగల్‌`లో తన కూతురు పాత్రలో నటించింది. ఆ తర్వాత `థగ్స్ ఆఫ్‌ హిందుస్థాన్‌` సినిమాలోనూ ఆమిర్‌కి జోడీ కట్టింది. ఈ క్రమంలో వీరిద్దరు ప్రేమలో పడ్డారని, ప్రస్తుతం డేటింగ్‌ చేస్తున్నారని బాలీవుడ్‌ టాక్‌.
undefined
అంతేకాదు వీరిద్దరు పలు సందర్భాల్లో కలిసి తిరిగిన ఫోటోలను, వీడియోలను షేర్‌ చేస్తూ వీరిద్దరికి ముడిపెడుతున్నారు నెటిజన్లు. మరి ఇందులో నిజమెంతా? అనేది తెలియాల్సి ఉంది. కానీ ఈ విషయం మాత్రం బాలీవుడ్‌ని షేక్‌ చేస్తుందని చెప్పొచ్చు.
undefined
అంతేకాదు ఐరా ఖాన్‌కి కాబోయే తల్లి అంటూ వీరి ఫోటోలను పంచుకుంటూ కామెంట్‌ చేయడం మరింత ఆసక్తిని రేకెత్తిస్తుంది.
undefined
ప్రస్తుతం ఆమిర్‌ఖాన్‌ `లాల్‌ సింగ్‌ చద్దా` చిత్రంలో నటిస్తున్నారు. `మోఘల్‌`తోపాటు మరో సినిమా చేయబోతున్నారు. అలాగే ఫాతిమా చేతిలో ఇప్పుడు ఒక్క సినిమా కూడా లేదు.
undefined
click me!