సిల్క్‌ స్మిత చివరగా ఫోన్‌ చేసింది ఆ స్టార్ హీరోకే.. కానీ!

First Published Apr 28, 2020, 11:36 AM IST

80వ దశకంలోనే శృంగార తారగా ఇండస్ట్రీని ఊపేసిన ముద్దుగుమ్మ సిల్క్‌ స్మిత. క్యారెక్టర్‌గా ఆర్టిస్ట్‌గా ఎంట్రీ ఇచ్చి తరువాత ఐటమ్ సాంగ్స్‌ స్టార్ గా ఎదిగిన ఈ బ్యూటీ జీవితం తో పాటు మరణం కూడా ఎన్నో సమాధానం లేని ప్రశ్నలను మిగిల్చింది. అయితే తాజాగా ఆమె మరణానికి సంబంధించి మరో ఆసక్తికర విషయం బటయకు వచ్చింది.

సిల్క్‌ స్మిత ఇండియన్‌ సిల్వర్‌ స్క్రీన్‌ మీద ఓ సెన్సేషన్. సౌత్ ఇండస్ట్రీలో టాప్‌ స్టార్లందరి సరసన నటించిన ఈ భామ జీవితం ఆకస్మాత్తుగా ముగిసింది.
undefined
ఆమె జీవితంలో కమర్షియల్ సినిమాకు తగ్గ మలుపులు ఎన్నో ఉన్నాయి. అందుకే బాలీవుడ్‌ దర్శక నిర్మాతలు డర్టీ పిక్చర్‌ పేరుతో ఆమె బయోపిక్‌ను తెరకెక్కించారు.
undefined
గ్లామర్‌తో యాక్టింగ్ తో ఎంతో మంది కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేసి సిల్క్‌ స్మిత మరణం ఇప్పటికీ ఓ మిస్టరీనే. పిన్న వయసులోనే సిల్క్‌ స్మిత తనువు చాలించటం వెనక కారణం ఏంటనేది ఇంకా బయటకు రాలేదు.
undefined
అయితే తాజాగా సిల్క్‌ స్మిత స్నేహితుడు, కన్నడ స్టార్ హీరో రవిచంద్రన్‌ స్మిత మరణానికి సంబంధించి ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. స్మిత చనిపోవడానికి ముందు రోజు ఏం జరిగిందో వెళ్లడించాడు రవిచంద్రన్‌.
undefined
1992లో ఈ ఇద్దరు కలిసి హల్లి మేస్త్రు అనే సినిమాలో నటించారు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. తరుచు కలవటంతో పాటు రెగ్యులర్‌గా ఫోన్‌లో టచ్‌లో ఉండేవారు.
undefined
స్మిత చనిపోవడానికి ఒక్క రోజు ముందు రవిచంద్రన్‌కు ఫోన్‌ చేసిందట. అయితే షూటింగ్ బిజీలో ఉండటం వల్ల ఆయన కాల్ అటెండ్ చేయలేదట, తరువాత కూడా రెగ్యులర కాల్ అనుకొని నిర్లక్ష్యం చేశానని చెప్పాడు.
undefined
కానీ డిప్రెషన్‌లో ఉన్న తనతో నేను మాట్లాడి ఉంటే పరిస్థితి మరోలా ఉండే అవకాశం ఉండేదని కూడా ఆయన అభిప్రాయపడ్డాడు.
undefined
1996 సెప్టెంబర్ 23న స్కిల్‌ స్మిత తన ఇంట్లోనే ఆత్మ హత్య చేసుకుంది. ఆమె మరణంతో ఇండస్ట్రీ అంతా ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఇండస్ట్రీలో అప్పటి వరకు తెలియని ఎన్నో చీకటి కోణాలు స్మిత మరణంతో తెర మీదకు వచ్చాయి.
undefined
click me!