ఇదో నరకం! ప్రపంచమంతా డ్రగ్స్ బ్యాన్, కానీ ఇక్కడ కాదు... వసీం అక్రమ్ సెన్సేషనల్ కామెంట్స్...

First Published Nov 27, 2022, 10:01 AM IST

పాకిస్తాన్‌ క్రికెట్ టీమ్ సాధించిన విజయాలను తక్కువ చేయలేం కానీ గెలుపుల కంటే వివాదాల్లో నిలిచిన సందర్భాలే ఎక్కువ. మ్యాచ్ ఫిక్సింగ్ కుంభకోణాలతో సతమతమైన పాక్ టీమ్, డ్రగ్స్‌ మాఫియాలోనూ ఇరుక్కుంది... పాక్ మాజీ కెప్టెన్ వసీం అక్రమ్, తాను డ్రగ్స్‌కి బానిసగా మారినట్టు స్వయంగా ప్రకటించాడు. తన ఆటోబయోగ్రఫీ ‘సుల్తాన్ ఏ మెమోయర్’లో సంచలన విషయాలు బయటపెట్టాడు వసీం అక్రమ్...

‘ఇంగ్లాండ్‌లో ఓ పార్టీకి వెళ్లినప్పుడు ఎవరో ‘ఇది ట్రై చెయ్’ అని చెప్పారు. అప్పటికే రిటైర్ కావడంతో నేను సరదాగా తీసుకున్నా. ఒక్క లైన్ కాస్తా ఓ గ్రామ్‌గా మారింది. పాకిస్తాన్‌కి తిరిగి వచ్చిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. పాక్‌ జనాలకు అదేంటో తెలీదు...

కానీ ప్రతీ ఏరియాలోనూ డ్రగ్స్ దొరుకుతాయి. ప్రపంచమంతా డ్రగ్స్‌పై నిషేధం ఉంది కానీ పాక్‌లో లేదు. కొన్నాళ్లకు పరిస్థితి ఎలా మారిపోయిందంటే డ్రగ్స్ లేకపోతే నేను బతకలేనంతగా వాటికి అడిక్ట్ అయిపోయా. రోజు రోజుకీ పరిస్థితి దిగజారుతూ వచ్చింది..

Image credit: Twitter

నేను దిగజారడం చూసి నా భార్య తట్టుకోలేకపోయింది. నా వల్ల ఆమె ఎన్నో కష్టాలు అనుభవించింది. అప్పటికి మా పిల్లలు చాలా చిన్నవాళ్లు. రోజూ ఇంట్లో గొడవలు అయ్యేవి. నాకు సాయం కావాలని ఆమె గ్రహించింది. వెంటనే రిహాబ్ సెంటర్‌కి పంపించింది...
 

ఆమె కోరిక మేరకు నేను నెల రోజులు రిహాబ్ సెంటర్‌కి వెళ్లడానికి ఒప్పుకున్నా, కానీ అక్కడే రెండున్నర నెలలు ఉండాల్సి వచ్చింది. ఆస్ట్రేలియా వంటి దేశాల్లో రిహాబ్ సెంటర్స్‌లో చాలా ఉల్లాసభరితమైన వాతావరణం ఉంటుంది. మోటివేషనల్ స్పీచ్‌లతో వ్యసన పరులను ఉత్సాహపరుస్తారు...

అయితే పాకిస్తాన్‌లో అలా ఉండదు. అదో నరకంలా ఉంటుంది. బయటి ప్రపంచానికి తెలియకుండా కట్టిపడేసినట్టు ఓ గదిలో ఉంచుతారు. అందులో ఓ కారిడార్, 8 గదులు ఉంటాయి. అందరూ నా లాంటి వాళ్లే.. అక్కడ బలవంతంగా రెండున్నర నెలలు ఉన్నా. ఆ సమయంలో నరకం అనుభవించా...

wasim akram 1992 world cup

దాని నుంచి బయట పడుతున్న సమయంలోనే నా భార్య చనిపోయింది. నేను వెళ్లింది మంచి దారి కాదని నాకు తెలుసు. అందుకే దాన్నుంచి బయటపడాలని అనుకున్నా. నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. వాళ్ల కోసం మొండి పట్టుదలతో దాన్నుంచి బయటపడ్డా...

wasim akram 1992 world cup

ప్రాశ్చాత్య దేశాల్లో తల్లితో పాటు తండ్రి కూడా పిల్లల పోషణలో బాధ్యత తీసుకుంటాడు. పొద్దునే లేచి పిల్లలను స్కూల్‌లో దిగబెట్టడం, వాళ్లను తీసుకురావడం, బట్టలు మార్చడం వంటివి చేస్తారు. కానీ మా కల్చర్‌లో అలా ఉండదు. అన్నీ తల్లులే చూసుకుంటారు. తండ్రిగా బయటికి వెళ్లి సంపాదించడమే మా పని..

Wasim Akram

భార్య పోయిన బాధ నుంచి బయటపడడానికి రెండేళ్లు పట్టింది. పిల్లలకు బట్టలు ఎక్కడ కొనాలో  తెలీదు. వాళ్లేం తింటారో కూడా తెలీదు. ఆఖరికి వాళ్లు ఏ క్లాస్ చదువుతున్నారో కూడా తెలీదు. తను పోయాక వాళ్ల ప్రతీ క్లాసుకి వెళ్లాను. పేరెంట్స్ టీచర్స్ మీటింగ్‌కి వెళ్లాను..

మా పిల్లల ఫ్రెండ్స్‌ తల్లిదండ్రులతో కూడా కలిశాను, వారితో స్నేహం ఏర్పరచుకున్నాను. ప్రతీ పేరెంట్, మా పిల్లలకు ఎంతగానో సాయం చేశారు...’ అంటూ తన ఆటోబయోగ్రఫీలో రాసుకొచ్చాడు వసీం అక్రమ్.. పాకిస్తాన్ తరుపున 104 టెస్టులు ఆడిన వసీం అక్రమ్ 414 వికెట్లు తీసి అత్యధిక వికెట్లు తీసిన పాక్ బౌలర్‌గా ఉన్నాడు. 

click me!