మా అబ్బాయి సెంచరీ చేస్తాడని అనుకున్నా, త్వరగా అవుటైనందుకు చాలా ఫీలయ్యా...

First Published Jan 19, 2021, 6:52 AM IST

భారతీయుడైన సుందర్ పిచాయ్, గూగుల్ సీఈవోగా ఎంపికైన తర్వాత ఎలా ఫీల్ అవుతున్నారని అతని తల్లిదండ్రులను ప్రశ్నించిందట ఓ మీడియా సంస్థ. దానికి వాళ్లు... ‘చాలా సంతోషంగా ఉంది, కానీ వాడు ఇంకొంచెం కష్టపడి చదివి ఉంటే, గవర్నమెంట్ ఉద్యోగం వచ్చి ఉండేది’ అని సమాధానం చెప్పారట. ఇండియన్ పేరెంట్స్ ఆలోచనా విధానం ఎలా ఉంటుందో చెప్పడానికి ఇది పర్ఫెక్ట్ ఉదాహరణ. ఇప్పుడు క్రికెటర్ వాషింగ్టన్ సుందర్ తండ్రి కూడా ఇదే విధంగా సమాధానం చెప్పాడు.

నాలుగో టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో 186 పరుగులకే 6 కీలక వికెట్లు కోల్పోయిన దశలో శార్దూల్ ఠాకూర్‌తో కలిసి అద్భుతమైన భాగస్వామ్యం నెలకొల్పాడు వాషింగ్టన్ సుందర్.
undefined
సీనియర్ స్పిన్నర్లు, ఆల్‌రౌండర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా గాయంతో నాలుగో టెస్టు నుంచి తప్పుకోవడంతో వారి స్థానంలో జట్టులోకి వచ్చిన సుందర్, బాల్‌తోనూ బ్యాటుతోనూ రాణించాడు.
undefined
శార్దూల్ ఠాకూర్‌తో కలిసి ఏడో వికెట్‌కి 123 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పిన సుందర్,144 బంతుల్లో 7 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 62 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.
undefined
వాషింగ్టన్ సుందర్ పర్ఫామెన్స్‌తో సంతోషంగా ఉన్నానని, కానీ అతను సెంచరీ పూర్తి చేయకపోవడం కొంచెం బాధగా అనిపించిందని కామెంట్ చేశాడు సుందర్ తండ్రి ఎం. సుందర్.
undefined
‘వాషింగ్టన్ సుందర్‌ను అందరూ స్పిన్నర్ మాత్రమే అనుకుంటారు. కానీ అతను బౌలర్ కంటే మంచి బ్యాట్స్‌మెన్‌గానే నాకు తెలుసు...
undefined
వాషింగ్టన్ సుందర్‌కి తొమ్మిదేళ్ల వయసులో తలకు గాయమైంది. అండర్ 14 మ్యాచ్‌కి ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో తలకు బాల్ తగిలి, ఐదు కుట్లు పడ్డాయి.
undefined
అయితే ఆ తర్వాతి రోజే మల్లీ మ్యాచ్‌కి వెళ్లి 39 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అతని బ్యాటింగ్ ఏంటో నాకు ఆ రోజే అర్థమైంది...
undefined
ఆఖరి టెస్టులో అతని పర్ఫామెన్స్ చూసి సంతోషించాను. బౌలింగ్‌లో మూడు వికెట్లు తీసిన తర్వాత నాకు ఫోన్ చేసి చెప్పాడు...
undefined
ఈ మ్యాచ్‌లో నువ్వు చేయాల్సిన పని ఇంకా పూర్తి కాలేదని, బ్యాటింగ్‌లో కూడా రాణించాలని వాషింగ్టన్ సుందర్‌కి చెప్పాను... బ్యాటింగ్‌లోనే రాణించాడు, కానీ సెంచరీ పూర్తిచేయనందుకు బాధపడ్డా...’ అంటూ చెప్పుకొచ్చాడు ఎం. సుందర్.
undefined
వాషింగ్టన్ సుందర్ హిందూ కుటుంబానికి చెందిన వాడే. అయితే అతను పుట్టకముందు ఎన్నో ఆర్థిక కష్టాలను అనుభవించిన సుందర్ కుటుంబానికి, పీడీ వాషింగ్టన్ అనే ఆర్మీ అధికారి సాయం చేశాడట.
undefined
క్రికెట్‌పై ఎం.సుందర్ ఆసక్తిని గమనించిన పీడీ వాషింగ్టన్... స్కూల్ యూనిఫామ్ నుంచి ఫీజు చెల్లించడంతో పాటు క్రికెట్ టెక్నిక్స్ నేర్పించేవాడట.
undefined
1999లో పీడీ వాషింగ్టన్ మరణించాడట. అదే ఏడాది సుందర్‌కి కొడుకు పుట్టాడు. తనకి గాడ్ ఫాదర్‌గా భావించిన ఆర్మీ ఆఫీసర్ గుర్తుగా కొడుకుకి అతని పేరుని కలిపి వాషింగ్టన్ సుందర్ అని పెట్టుకున్నాడు.
undefined
click me!