సెమీస్‌కి సిక్సర్లతో సెక్సీ స్టార్ట్ ఇచ్చిన రోహిత్ శర్మ... ముంబైలో లోకల్ బాయ్ రికార్డుల మోతే..

First Published | Nov 15, 2023, 2:41 PM IST

వరల్డ్ కప్ 2023 టోర్నీలో రోహిత్ శర్మ మెరుపు బ్యాటింగ్‌తో దుమ్మురేపాడు. అయితే నాకౌట్ మ్యాచుల్లో రోహిత్‌కి చెప్పుకోదగ్గ రికార్డు లేకపోవడంతో ఫ్యాన్స్ కాస్త కంగారు పడ్డారు. 

Rohit Sharma

కీలక మ్యాచ్‌లో రోహిత్ తన స్టైల్ మారుస్తాడా? పాత రూట్‌లో నెమ్మదిగా బ్యాటింగ్ చేస్తూ ఇన్నింగ్స్ నిర్మిస్తాడా? అనే అనుమానాలు రేగాయి. అయితే సెమీస్  మ్యాచ్‌లోనూ సిక్సర్ల మోత మోగిస్తూ టీమిండియాకి సెక్సీ స్టార్ట్ అందించాడు హిట్ మ్యాన్..
 

ట్రెంట్ బౌల్ట్ వేసిన ఇన్నింగ్స్ మొదటి బంతికి 2 పరుగులు రాబట్టిన రోహిత్ శర్మ, రెండు ఫోర్లతో 10 పరుగుల రాబట్టాడు. టిమ్ సౌథీ వేసిన ఇన్నింగ్స్ రెండో ఓవర్‌లో శుబ్‌మన్ గిల్ రెండు ఫోర్లు బాదాడు. ట్రెంట్ బౌల్ట్ వేసిన ఇన్నింగ్స్ మూడో ఓవర్‌లో ఓ భారీ సిక్సర్ బాదిన రోహిత్ శర్మ, టిమ్ సౌథీ బౌలింగ్‌లో మరో సిక్సర్ బాదాడు. 

Latest Videos


Rohit

4 ఓవర్లలో 38 పరుగులు చేసింది భారత జట్టు. ట్రెంట్ బౌల్ట్ వేసిన ఐదో ఓవర్‌లో సిక్సర్ బాదిన రోహిత్ శర్మ, వరల్డ్ కప్ చరిత్రలో 50 సిక్సర్లు పూర్తి చేసుకున్నాడు. 

Rohit Sharma

వరల్డ్ కప్ చరిత్రలో 50 సిక్సర్లు బాదిన మొట్టమొదటి క్రికెటర్‌గా నిలిచాడు రోహిత్ శర్మ. ఇంతకుముందు 49 సిక్సర్లు బాదిన క్రిస్ గేల్ రికార్డును బ్రేక్ చేశాడు రోహిత్..

Rohit Sharma

ఈ వరల్డ్ కప్‌లో 27+ సిక్సర్లు బాదిన రోహిత్ శర్మ, ఒకే వరల్డ్ కప్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాటర్‌గా టాప్‌లో నిలిచాడు. ఇంతకుముందు 2015 వన్డే వరల్డ్ కప్‌లో క్రిస్ గేల్ 26 సిక్సర్లు బాదాడు. ఈ వరల్డ్ కప్‌లో 22 సిక్సర్లు బాదిన గ్లెన్ మ్యాక్స్‌వెల్, టాప్ 3లో ఉన్నాడు.
 

Rohit Sharma

మొదటి పవర్ ప్లేలో అత్యధిక సిక్సర్లు బాదిన రికార్డు కూడా రోహిత్ పేరిటే నమోదైంది. ఇంతకుముందు మెక్‌కల్లమ్, డేవిడ్ వార్నర్.. మొదటి 10 ఓవర్లలో 17 సిక్సర్లు బాదగా, రోహిత్ 20 సిక్సర్లు దాటేశాడు.

Rohit Sharma

అంతేకాకుండా వరల్డ్ కప్‌లో 1500 పరుగులు పూర్తి చేసుకున్నాడు రోహిత్. అత్యంత వేగంగా ఈ ఫీట్ సాధించిన బ్యాటర్‌గా సచిన్ రికార్డు సమం చేశాడు రోహిత్ శర్మ. 

 సచిన్ టెండూల్కర్, రోహిత్ 27 ఇన్నింగ్స్‌ల్లో 1500+ వరల్డ్ కప్ పరుగులు చేయగా విరాట్ కోహ్లీ 34 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఫీట్ సాధించాడు. 

Rohit Sharma

29 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 47 పరుగులు చేసిన రోహిత్ శర్మ, టిమ్ సౌథీ బౌలింగ్‌లో కేన్ విలియంసన్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 71 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది టీమిండియా..  

click me!