నీ పని నువ్వు చెయ్.. పిచ్చిగా వాగకు.. నీ కోచ్‌కే గతి లేదు నిన్నెవడడిగాడు? సర్ఫరాజ్ పై చీఫ్ సెలక్టర్ ఫైర్

First Published Jan 20, 2023, 2:37 PM IST

Sarfaraz Khan: గత  రెండేండ్లుగా దేశవాళీలో  నిలకడగా రాణిస్తున్న  ముంబై కుర్రాడు సర్ఫరాజ్ ఖాన్ కు మరోసారి నిరాశ తప్పలేదు. ఆసీస్ తో రెండు టెస్టులకు గాను  ప్రకటించిన జట్టులో చోటు దక్కకపోవడంతో  నిరాశకు గురైన సర్ఫరాజ్..  ఛేతన్ శర్మపై చేసిన కామెంట్స్ చర్చనీయాంశమయ్యాయి.   

వచ్చే నెల ఆస్ట్రేలియా జట్టు భారత పర్యటనకు రానుండగా  భారత్ తో  కంగారూలు నాలుగు   టెస్టులు, మూడు వన్డేలు ఆడనున్నారు. టెస్టు సిరీస్ లో భాగంగా  ఇదివరకే రెండు టెస్టులకు జట్టును ప్రకటించారు.  ఇటీవలే ముగిసిన బంగ్లాదేశ్ పర్యటనలో చోటు దక్కకపోయినా ఈసారి మాత్రం తనకు తప్పకుండా  ప్లేస్ ఉంటుందని ఆశించిన ముంబై క్రికెటర్  సర్ఫరాజ్ ఖాన్ కు భారీ షాక్ తప్పలేదు. 

గడిచిన రెండేండ్లుగా దేశవాళీలో  నిలకడగా రాణిస్తున్న  అతడికి మరోసారి నిరాశ తప్పలేదు. అయితే తనకు ఆసీస్ తో రెండు టెస్టులకు గాను  ప్రకటించిన జట్టులో చోటు దక్కకపోవడంతో  నిరాశకు గురైన సర్ఫరాజ్.. ఆలిండియా సీనియర్ సెలక్షన్ కమిటీ చీఫ్  సెలక్టర్  చేతన్ శర్మపై చేసిన వ్యాఖ్యలు పెనుదుమారం  రేపాయి. చేతన్.. తనను బంగ్లాదేశ్ పర్యటనకు ఎంపిక చేస్తానని హామీ ఇచ్చాడని, కానీ చివరికి  హ్యాండ్ ఇచ్చాడని సర్ఫరాజ్ ఖాన్ వాపోయాడు.  

సర్ఫరాజ్ ఖాన్ వ్యాఖ్యల నేపథ్యంలో  ముంబై రంజీ జట్టుకు గతంలో  సారథిగా పనిచేసి ప్రస్తుతం  అదే టీమ్ కు చీఫ్ సెలక్టర్ గా  వ్యవహరిస్తున్న మిలింద్ రెగె  సర్ఫరాజ్ పై మండిపడ్డాడు. బ్యాటర్ గా సర్ఫరాజ్ పని పరుగులు చేయడం వరకేనని, టీమ్ లో చోటు దక్కుతుందా..? లేదా..? అన్నది అతడి చేతుల్లో లేని అంశమని చెప్పాడు. తన చేతుల్లో లేనిదాని గురించి మాట్లాడి వేస్ట్ అని  చెప్పాడు. 

మిలింద్ స్పందిస్తూ... ‘ముందు నువ్వు ఆట మీద దృష్టి పెట్టు.  నిలకడగా మెరుగైన  ప్రదర్శనలు చేస్తూ ఉండాలి. అంతేగానీ ఏది పడితే అది మాట్లాడకూడదు. అతడు  టీమిండియా సెలక్టర్ల మీద చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి. తన బ్యాటింగ్ మీద దృష్టి పెట్టాలి..’అని మిడ్ డే కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నాడు. 

అంతేగాక.. ‘సర్ఫరాజ్ గొప్ప ఫామ్ లో ఉన్నాడు.  అందులో  సందేహమే లేదు.  కానీ ప్రస్తుతం టీమిండియాలో సర్ఫరాజ్ వెళ్లడానికి  చోటు ఉండాలి కదా.  అసలు  భారత జట్టులో  ఉద్ధండులైన బ్యాటర్లు ఉండగా చోటెక్కడుంది.. సర్ఫరాజ్ కు కూడా అవకాశం వస్తుంది. అప్పుడు అతడు నిరూపించుకోవాలి.  కానీ ఇప్పుడైతే అతడికి టీమ్ లో  ప్లేస్ లేదు..’ అని  చెప్పాడు. 

సర్ఫరాజ్  కు  కోచ్ (ముంబై టీమ్ కు కూడా అతడే) గా వ్యవహరిస్తున్న అమోల్ మజుందార్  కూడా తాను క్రికెట్ ఆడినప్పుడు దేశవాళీలో  వేలకొద్దీ పరుగులు చేసినా అప్పుడు జాతీయ జట్టులో సచిన్, గంగూలీ, ద్రావిడ్ వంటి బ్యాటర్ల కారణంగా అమోల్ కు జట్టులో చోటు దక్కలేదు. అమోల్ దగ్గర కోచింగ్ తీసుకుంటున్న  సర్ఫరాజ్ ఇలా ఏది పడితే అది మాట్లాడటం తగదని  సూచించాడు. 

click me!