లైవ్‌లో చూడడానికి రా... అజింకా రహానే, రాజ్‌కుంద్రా మధ్య పాత ట్వీట్స్ సంభాషణ వైరల్...

First Published Jul 20, 2021, 4:45 PM IST

బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త, వ్యాపారవేత్త అయిన రాజ్‌కుంద్రా... పోర్నోగ్రఫీ కంటెంట్ ఉన్న సినిమాలను నిర్మిస్తున్నారనే ఆరోపణలతో అరెస్టు అయిన విషయం తెలిసిందే. అతని అరెస్ట్ తర్వాత భారత ఆటగాడు అజింకా రహానే, రాజ్‌కుంద్రా మధ్య జరిగిన 9 ఏళ్ల కిందటి ట్వీట్ల సంభాషణ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్‌ జట్టుకి సహ యజమానికి వ్యవహరించాడు రాజ్‌కుంద్రా. శిల్పా శెట్టితో కలిసి మ్యాచులు చూడడానికి వెళుతూ, స్టేడియంతో తెగ హడావుడి చేసేవాడు కుంద్రా...
undefined
అయితే 2013 స్పాట్ ఫిక్సింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న రాజ్ కుంద్రా, 2015లో రాజస్థాన్ రాయల్స్ జట్టు నుంచి, క్రికెట్ సంబంధిత వ్యవహరాల నుంచి జీవితకాల నిషేధాన్ని ఎదుర్కొన్నాడు.
undefined
ఇండియాలో మొట్టమొదటి లైవ్ స్ట్రీమింగ్ సోషల్ మీడియా యాప్ ‘జల్దీ’ని లాంఛ్ చేసిన రాజ్ కుంద్రా, 2021 ఫిబ్రవరిలో ముంబైలో నమోదైన ఓ కేసులో ప్రధాన నిందితుడిగా అరెస్ట్ అయ్యాడు...
undefined
మొబైల్ అప్లికేషన్స్, వెబ్‌ సైట్ల ద్వారా పోర్నోగ్రఫిక్ కంటెంట్‌ను సృష్టించి, ప్రసారం చేస్తున్నారనేది రాజ్‌కుంద్రాపై ప్రధాన ఆరోపణ....
undefined
పోలీసుల దగ్గరున్న ఆధారాల ప్రకారం రాజ్‌కుంద్రా దాదాపు 8 నుంచి 10 కోట్ల రూపాయాల దాకా పోర్న్ పరిశ్రమలో పెట్టుబడులు పెట్టారు. ఇండియాలో ఈ వీడియోలో చిత్రీకరించి, యూకేకి పంపుతున్నారు.
undefined
అక్కడి నుంచి ఆన్‌లైన్ ద్వారా ప్రపంచమంతటికీ ప్రసారం అవుతున్నాయి. ఈ వీడియోల ట్రాన్స్‌ఫర్ కోసం వీళ్లు ‘వీ ట్రాన్స్‌ఫర్’ యాప్‌ను వాడుతున్నారు...
undefined
పోలీసుల విచారణలో కొన్ని సంచలన విషయాలను కూడా వెల్లడించాడు రాజ్‌కుంద్రా. వెబ్‌సిరీస్‌ల ఆడిషన్స్ పేరుతో అమ్మాయిలను, మోడల్స్‌ను రప్పించి, వారితో నగ్నంగా ఆడిషన్స్ జరిపి... వాటిని ‘హాట్ హిట్ మూవీస్’ అనే యాప్‌లో అప్‌లోడ్ చేసేవారని తేలింది.
undefined
ఇవన్నీ పక్కనబెడితే తాజాగా 2012లో రాజ్‌కుంద్రాను మెచ్చుకుంటూ అజింకా రహానే వేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్‌గా మారింది... ఈ ట్వీట్‌లో ‘రాజ్‌కుంద్రా మీరు చాలా గ్రేట్ జాబ్ చేస్తున్నారు...’ అంటూ ట్వీట్ చేశాడు అజింకా రహానే...
undefined
దానికి రాజ్‌కుంద్రా... ‘థ్యాంక్యూ సో మచ్... నువ్వు కచ్ఛితంగా వచ్చి, లైవ్‌లో చూడాలి...’ అంటూ సమాధానం ఇచ్చాడు. ‘తప్పకుండా వస్తా సార్’ అంటూ రహానే రిప్లై ఇచ్చాడు.
undefined
క్రికెట్‌లో క్లాస్ ప్లేయర్‌గా, ఎలాంటి వివాదాల్లో ఇరుక్కోని అజింకా రహానేని ఈ ట్వీట్లు చిక్కుల్లో పడేశాయి.
undefined
అసలు ఈ ట్వీట్లు దేని కోసం వేసినవి, అక్కడ జరిగిన సంభాషన దేనిగురించి అనేదాంట్లో ఎలాంటి సమాచారం లేకపోయినా... కొందరు నెటిజన్లు మాత్రం రాజ్‌కుంద్రా చేసే పోర్న్ బిజినెస్ గురించి రాజస్థాన్ రాయల్స్ మాజీ కెప్టెన్‌కి ముందే తెలుసని ఆరోపణలు చేస్తుండడం విశేషం...
undefined
click me!