క్రిప్టోకరెన్సీ బిల్లు అంటే ఏమిటి.. ప్రభుత్వం క్రిప్టోను ఎలా నియంత్రిస్తుంది.. ? ప్రతిదీ తేలుసుకోండి..

First Published Nov 24, 2021, 12:31 PM IST

క్రిప్టోకరెన్సీల  నుండి పెట్టుబడిదారులను రక్షించడానికి మోడీ ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. దీని కింద, భారత ప్రభుత్వం మంగళవారం (నవంబర్ 23) క్రిప్టోకరెన్సీ బిల్లును ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించింది, దీని ద్వారా దేశంలో అన్ని ప్రైవేట్ క్రిప్టోకరెన్సీలు నిషేధించబడతాయి. 

ఈ వార్త తెరపైకి వచ్చిన వెంటనే  క్రిప్టో మార్కెట్ దారుణంగా కుప్పకూలింది. అదే సమయంలో అన్ని రకాల క్రిప్టోకరెన్సీలలో 25 నుండి 30 శాతం క్షీణత ఏర్పడింది. క్రిప్టో మార్కెట్‌లో సంభవించిన ఈ సెన్సేషన్ చూస్తే క్రిప్టోకరెన్సీ బిల్లు అంటే ఏమిటి, కేంద్ర ప్రభుత్వం  క్రిప్టోకరెన్సీని ఎలా నియంత్రిస్తుంది.. ? అనే ఆలోచన మొదలవుతుంది..

క్రిప్టోకరెన్సీ బిల్లు అంటే ఏమిటి?
సమాచారం ప్రకారం, క్రిప్టోకరెన్సీల నియంత్రణ కోసం క్రిప్టోకరెన్సీలు అండ్ అధికారిక డిజిటల్ కరెన్సీ నియంత్రణ బిల్లు 2021ని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టనుంది. ఈ బిల్లు ద్వారా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రింద అధికారిక క్రిప్టోకరెన్సీని జారీ చేయడానికి సులభమైన ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీని టెక్నాలజి, వినియోగానికి సంబంధించి కూడా సన్నాహాలు చేస్తున్నారు. అలాగే, ఈ బిల్లు కింద నిబంధనలు తీసుకురాబడుతుంది, ఇది అన్ని ప్రైవేట్ క్రిప్టోకరెన్సీలను నిషేధిస్తుంది. విశేషమేమిటంటే, శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టడానికి 26 బిల్లులు జాబితా చేయబడ్డాయి. వీటిలో క్రిప్టోకరెన్సీ బిల్లులు ఉన్నాయి. 
 

పార్లమెంటరీ కమిటీ
శీతాకాల సమావేశానికి ఏడు రోజుల ముందు క్రిప్టోక్రెన్సీకి సంబంధించి నవంబర్ 16న మొదటి పార్లమెంటరీ కమిటీకి  ముందు సమావేశం జరిగిందని పేర్కొంది. ఇందులో క్రిప్టో ఎక్స్ఛేంజ్, బ్లాక్‌చెయిన్ ఉన్నాయి. క్రిప్టోకరెన్సీల నియంత్రణ, ప్రమోషన్‌కు సంబంధించిన అంశాలు క్రిప్టో అసెట్ కౌన్సిల్, పరిశ్రమ ప్రతినిధులు, ఇతర స్టేక్ హోల్దెర్స్ చే చర్చించబడ్డాయి. క్రిప్టోకరెన్సీలను ఆపలేమని ఈ సమావేశంలో వెల్లడించారు. అయితే దానికి నియంత్రణ అవసరం.
 

సిడ్నీ డైలాగ్‌లో ప్రధాని మోదీ 
క్రిప్టోకరెన్సీకి సంబంధించి అనేక మంత్రిత్వ శాఖలతో ప్రధాని మోదీ ఉన్నత స్థాయి సమావేశాన్ని కూడా నిర్వహించారు. అంతేకాకుండా, సిడ్నీ డైలాగ్ ప్రోగ్రామ్‌లో అడ్రస్ చేస్తూ  క్రిప్టోకరెన్సీని కూడా ప్రస్తావించాడు. క్రిప్టోకరెన్సీ లేదా బిట్‌కాయిన్‌ను ఉదాహరణగా తీసుకోమని ప్రధాని మోదీ అన్నారు. ప్రజాస్వామ్య దేశాలన్నీ దీనిపై కృషి చేయడం చాలా ముఖ్యం. అలాగే, ఇది మన యువతపై చెడు ప్రభావాన్ని చూపుతుంది కాబట్టి దీనిని తప్పుడు చేతుల్లోకి వెళ్లకుండా చూసుకోవాలని కోరారు.
 

click me!